ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

kumaram bheem asifabad- జిల్లా అభివృద్ధికి పాటుపడాలి

ABN, Publish Date - Jul 10 , 2025 | 11:28 PM

జిల్లా అభివృద్ధికి అధికారులు సమన్వయంతో పాటుపడాలని ఎంపీ గెడం నగేష్‌ అన్నారు. జిల్లా కేంద్రంలోని సమీకృత కలెక్టరేట్‌ భవన సమావేశ మందిరంలో గురువారం జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో నిర్వహించిన జిల్లా అభివృద్ధి సమన్వయం పర్యవేక్షణ కమిటీ, జిల్లా స్థాయి దిశ కమిటీ సమావేశంలో ఆయన పాల్గొన్నారు. జిల్లాలో శాఖల ద్వారా చేపడుతున్న అభివృద్ధి పనులపై సమీక్షించారు.

ఎంపీ గెడెం నగేష్‌కు పూల మొక్కను అందజేస్తున్న ఎమ్మెల్యే కోవ లక్ష్మి

ఆసిఫాబాద్‌, జూలై 10 (ఆంధ్రజ్యోతి): జిల్లా అభివృద్ధికి అధికారులు సమన్వయంతో పాటుపడాలని ఎంపీ గెడం నగేష్‌ అన్నారు. జిల్లా కేంద్రంలోని సమీకృత కలెక్టరేట్‌ భవన సమావేశ మందిరంలో గురువారం జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో నిర్వహించిన జిల్లా అభివృద్ధి సమన్వయం పర్యవేక్షణ కమిటీ, జిల్లా స్థాయి దిశ కమిటీ సమావేశంలో ఆయన పాల్గొన్నారు. జిల్లాలో శాఖల ద్వారా చేపడుతున్న అభివృద్ధి పనులపై సమీక్షించారు. జిల్లా మహిళా శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో 973 అంగన్‌వాడీ కేంద్రాలు పని చేస్తున్నాయని 137 అంగన్‌వాడీ టీచర్లు ఖాళీలు, 357 ఆయాల ఖాళీలు ఉన్నాయని ప్రతి అంగన్‌వాడీ కేంద్రానికి పిల్లలు, బాలింతలు, గర్భిణులు, కిశోర బాలికలకు పౌష్టిక ఆహారం అందింస్తున్నామని జిల్లా సంక్షేమాధికారి భాస్కర్‌ వివరించారు. ఎంపీ మాట్లాడుతూ ప్రతి అంగన్‌వాడీ కేంద్రాన్ని సీడీపీఓలు, సూపర్‌వైజర్‌లు సందర్శించాలని తెలిపారు. బేటీ బచావో- బేటీ పడావో కార్యక్రమంలో భాగంగా ఆడ పిల్లల చదువు, ఆరోగ్యంపై ప్రతి కళాశాలలో, పాఠశాలలో అవగాహన కార్యక్రమాలు చేపట్టాలని తెలిపారు. ప్రధాన మంత్రి జన్‌మన్‌ పథకం కింద పీవీటీజీ గ్రామాలలో అవసరమైన చర్యలు చేపట్టాలని మిషన్‌ భగీరథ పథకం కింద ప్రతి ఆవాస గ్రామాలలో శుద్ధమైన తాగునీటిని అందించాలన్నారు. వర్షాకాలం దృష్ట్యా ప్రజలు కలుషితమైన నీరు తాగి వ్యాధులు బారిన పడకుండా వైద్య ఆరోగ్య శాఖ అధికారులు ప్రజలకు అవగాహన కార్యక్రమాలు చేపట్టాలన్నారు. జల్‌ జీవన్‌ మిషన్‌ ద్వారా ప్రతి ఇంటికి నీటిని అందించాలని తెలిపారు. విద్యుత్‌ శాఖాధికారులు ప్రధాన మంత్రి జన్‌మన్‌ పథకం కింద ప్రతి పీవీటీజీ గ్రామాలలో సూర్య ఘర్‌ పథకంద్వారా విద్యుత్‌ లేని గృహాలను గుర్తించి విద్యుత్‌ సరఫరా చేసే విధంగా చర్యలు తీసుకోవాలని తెలిపారు. తిర్యాణి మండలం గోవెన గ్రామ పంచాయతీలో విద్యుత్‌ సరఫరా లేని ఆవాస ప్రాంతాలకు వెంటనే సరఫరా చేసే విధంగా చర్యలు తీసుకోవడంతో పాటు అవసరమైన ప్రాంతాలో అదనపు విద్యుత్‌ స్తంభాలు, తీగలను అమర్చాలని చెప్పారు. ఇందిరా గిరి సౌర జల వికాసం పథకం కింద గిరిజన పోడు పట్టాదారుల భూములలో బోరువెల్స్‌, బావులు ఏర్పాటు చేసేందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలని తెలిపారు. కేంద్ర ప్రభుత్వం శ్యాంప్రసాద్‌ ముఖర్జీ రూర్బన్‌ పథకం కింద జిల్లాలో 19 రహదారులు, 31 వంతెనల నిర్మాణానికి చర్యలు తీసుకుంటుందన్నారు. అటవీ శాఖ అనుమతుల ప్రక్రియ త్వరగా పూర్తి చేసి పనులు ప్రారంభించాలన్నారు. జాతీయ రహదారుల శాఖ ఆఆధ్వర్యంలో జిల్లాలో జతీయ రహదారికి ఇరువైపులా గ్రామాలలో సర్వీసు రహదారులు, మురుగు కాలువలు, ప్రమాదాలు జరగకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని సూచించారు. జిల్లా కేంద్రంలోని ప్రధాన రహదారి సాయిబాబా ఆలయం నుంచి గుండి అండర్‌పాస్‌ వరకు పనులు చేపట్టాలని తెలిపారు. ప్రధాన మంత్రి జన్‌మన్‌ పథకం కింద పీవీటీజీ గ్రామాలలో 12 రకాల వైద్య సేవలు అందించేందుకు 10 మొబైల్‌ వాహనాలు ఏర్పాటు చేయాలని ఆదేశించారు. వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో ప్రధాన మంత్రి సమ్మన్‌ కిసాన్‌ నిధులను అర్హులైన ప్రతి రైతులకు అందించాలని అన్నారు. జిల్లాలో యూరియా కొరతలు లేకుండా అధికారులు పర్యవేక్షించాలని తెలిపారు. విద్యాశాఖ ఆధ్వర్యంలో మధ్యాహ్న భోజన పథకాన్ని పకడ్బందీగా అమలు చేయాలని తెలిపారు. జిల్లాలో భారత్‌ సంచార్‌ నిగం లిమిటెడ్‌ టవర్ల నిర్మాణం త్వరగా పూర్తి చేసి ప్రతి మారు మూల గ్రామానికి సేవలను అందించాలని తెలిపారు. ప్రధాన మంత్రి గ్రామీణ సడక్‌ యోజన పథకంలో భాగంగా మారు మూల గ్రామాలకు రహదారి సౌకర్యం కల్పించి జిల్లా కేంద్రానికి అనుసంధానం చేయాలని తెలిపారు. కలెక్టర్‌ వెంకటేష్‌ దోత్రే మాట్లాడుతూ అధికారులు క్షేత్రస్థాయిలో పర్యటనలు చేసి జిల్లాలో నెలకొన్న సమస్యలు గుర్తించి అక్కడికక్కడే పరిష్కరించే విధంగా చర్యలు తీసుకోవాలని తెలిపారు. కార్యక్రమంలో ఐటీడీఏ పీవో ఖుష్బూ గుప్తా, అదనపు కలెక్టర్లు దీపక్‌ తివారి, డేవిడ్‌, కాగజ్‌నగర్‌ సబ్‌ కలెక్టర్‌ శ్రద్ధశుక్లా, జిల్లా అటవీ అదికారి నీరజ్‌కుమార్‌, ఎమ్మెల్యే కోవ లక్ష్మి, ఆర్డీవో లోకేశ్వర్‌రావు, డీఎంహెచ్‌వో సీతారాం, విద్యుత్‌ శాఖ ఎస్‌ఈ శేషరావు, ఆర్‌అండ్‌బీ ఈఈ సురేందర్‌, పంచాయతీ రాజ్‌ ఈఈ కృష్ణ, డీపీవో భిపి, మిషన్‌ భగీరథ ఈఈ సిద్దిఖి, జడ్పీ సీఈఓ లక్ష్మినారాయణ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Jul 10 , 2025 | 11:28 PM