మాదక ద్రవ్యాల నిర్మూలనకు నడుం బిగించాలి
ABN, Publish Date - Jun 24 , 2025 | 11:16 PM
మాదక ద్రవ్యాల నిర్మూలన నేటి తరం విద్యా ర్ధుల చేతుల్లోనే ఉందని, అందుకు విద్యార్థులంతా నడుం బిగించాలని రామ గుండం పోలీస్ కమిషనర్ అంబర్ కిశోర్ ఝా పేర్కొన్నారు.
-రామగుండం సీపీ అంబర్ కిశోర్ ఝా
జైపూర్, జూన్ 24 (ఆంధ్రజ్యోతి) : మాదక ద్రవ్యాల నిర్మూలన నేటి తరం విద్యా ర్ధుల చేతుల్లోనే ఉందని, అందుకు విద్యార్థులంతా నడుం బిగించాలని రామ గుండం పోలీస్ కమిషనర్ అంబర్ కిశోర్ ఝా పేర్కొన్నారు. మంగళవారం మండల కేంద్రం లోని గురుకుల సాంఘీక సంక్షేమ బాలు ర పాఠశాలలో మాదక ద్రవ్యాల వల్ల కలిగే నష్టాలపై విద్యార్థులకు అవగాహన కల్పించారు. ఆయన మాట్లాడుతూ గంజాయి, డ్రగ్స్ నిర్మూలనలో ప్రతి ఒక్కరు భాగస్వాములై భావి తరాలకు మంచి భవిష్యత్ అందించాలన్నారు. ఒక మంచి ఉద్దేశ్యంతో మత్తు పదార్థాల నిర్మూలన వారోత్సవాల్లో భాగంగా రామగుండం కమీషనరేట్ పరిధిలో అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తు న్నామన్నారు. విద్యార్థుల దృష్టి అంతా జీవిత లక్ష్యంపై మాత్రమే ఉండాలని, నిషేధిత గంజాయి, డ్రగ్స్, ఇతర మత్తు పదార్ధాలకు విద్యార్ధులు ఆకర్షితులు కావద్దని సూచిం చారు. గంజాయి, డ్రగ్స్‌కు అలవాటు పడితే మానసిక, శారీరక ఆరోగ్యాన్ని పాడు చే స్తుందన్నారు. విద్యార్థులు చెడు అలవాట్లకు దూరంగా ఉండాలన్నారు. మాదక ద్ర వ్యాల నిర్మూలన, గంజాయి రహిత సమాజమే లక్ష్యంగా పోలీసు శాఖ కృషి చేస్తుం దన్నారు. ఇందులో భాగంగానే విద్యాసంస్థలు, గ్రామాల్లో అవగాహన కార్యక్రమాలు నిరంతరం నిర్వహిస్తామన్నారు. మత్తుకు బానిస కావడానికి అనేక కారణాలు ఉంటా యని, పరిసరాల ప్రభావం, చెడు స్నేహితులు, సన్నిహితుల వల్ల చెడు మార్గా ల వైపు వెళ్లవద్దన్నారు. మత్తు పదార్థాలను అరికట్టేందుకు యువత, విద్యార్థులు యాంటీ డ్రగ్స్ కమిటీల్లో సభ్యులుగా చేరి యాంటి డ్రగ్స్ సోల్జర్లుగా సహకరించాలన్నారు. వి ద్యార్థులు ఎక్కువ సమయం స్కూళ్లు, హాస్టళ్లలోనే ఉంటారని, ఉపాధ్యాయులు విద్యా ర్థుల ప్రవర్తనను గమనిస్తూ వారు ఎలాంటి చెడు అలవాట్లకు బానిసలు కాకుండా గమనిస్తూ ఉండాలని సూచించారు. ఎక్కడైనా గంజాయి, ఇతర మత్తు పదార్థాలు వి క్రయిస్తున్నట్లు, తాగుతున్నట్లు తెలిస్తే వెంటనే పోలీసులకు సమాచారం అందించా లన్నారు. ఈ సందర్భంగా విద్యార్థులు అధికారులతో కలిసి మాదక ద్రవ్యాలు, గంజాయి వాడకం వల్ల జరిగే నష్టాలకు సంబంధించిన పోస్టర్లను విడుదల చేసి విద్యార్థులతో ప్రతిజ్ఞ చేయించారు. అనంతరం విద్యార్థులకు పరీక్ష ప్యాడ్‌లను అందజేశారు. అలాగే కేజీబీవీ విద్యార్ధినీలు డ్రగ్స్ వల్ల కలిగే అనర్ధాలపై నాటికను ప్రద ర్శించారు. ఈ కార్యక్రమంలో మంచిర్యాల డీసీపీ భాస్కర్, జైపూర్ ఏసీపీ వెంకటేశ్వర్, స్పెషల్ బ్రాంచ్ ఏసీపీ మల్లారెడ్డి, ట్రాఫిక్ ఏసీపీ శ్రీనివాస్, శ్రీరాంపూర్ సీఐ వేణు చందర్, నార్కోటిక్ ఇన్‌స్పెక్టర్ రాజ్‌కుమార్, జైపూర్ ఎస్‌ఐ శ్రీధర్, శ్వేత, సంతోష్, కేజీబీవీ ఎస్‌వో ఫణిబాల, సాంఘీక సంక్షేమ పాఠశాల ప్రిన్సిపాల్ కోల నాగేశ్వర్‌రావు, రమేష్‌బాబు తదితరులు పాల్గొన్నారు.
Updated Date - Jun 24 , 2025 | 11:16 PM