ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

kumaram bheem asifabad- అర్హులందరికీ రైతు భరోసా అందించాం

ABN, Publish Date - Jun 24 , 2025 | 10:51 PM

అర్హులందరికీ రైతు భరోసా కింద రైతుల ఖాతా ల్లో నగదు జమ చేశామని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అన్నారు. హైదరాబాద్‌లోని సచివాలయం ఆవరలో గల రాజీవ్‌ గాంధీ విగ్రహం వద్ద మంగళవారం ఏర్పాటు చేసిన కార్యక్రమం ద్వారాఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విగ్రమార్క, వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర్‌రావు, ఇతర మంత్రులు, అధికారులతో కలిసి రాష్ట్రంలోని 1031 రైతు వేదికలలో రైతు నేస్తం కార్యక్రమంలో పాల్గొన్నారు.

రైతు నేస్తం కార్యక్రమంలో పాల్గొన్న జిల్లా కలెక్టర్‌, అదనపు కలెక్టర్‌లు, అధికారులు, ప్రజాప్రతినిధులు

ఆసిఫాబాద్‌, జూన్‌ 24 (ఆంధ్రజ్యోతి): అర్హులందరికీ రైతు భరోసా కింద రైతుల ఖాతా ల్లో నగదు జమ చేశామని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అన్నారు. హైదరాబాద్‌లోని సచివాలయం ఆవరలో గల రాజీవ్‌ గాంధీ విగ్రహం వద్ద మంగళవారం ఏర్పాటు చేసిన కార్యక్రమం ద్వారాఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విగ్రమార్క, వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర్‌రావు, ఇతర మంత్రులు, అధికారులతో కలిసి రాష్ట్రంలోని 1031 రైతు వేదికలలో రైతు నేస్తం కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ రైతు భరోసా పథకంలో రాష్ట్రంలోని 1.49 కోట్ల ఎకరాలకు దాదాపు 70 లక్షల మంది రైతుల ఖాతాల్లో 9 వేల కోట్ల రూపాయలు విజయవంతంగా జమ చేశామని అన్నారు. తెలంగాణ రైతు జీవితం భూమితో ముడిపడి ఉందని చెప్పారు. గత సంవత్సరం ఆగస్టు 15వ తేదీన రైతు రుణ మాఫీ ద్వారా 25,33,964 మంది రైతులకు రూ.20,617 కోట్లు అందించి రుణ విముక్తులను చేశామని తెలిపారు. రాష్ట్రంలో 2.80 కోట్ల లక్షల మెట్రిక్‌ టన్నుల వరి ధాన్యం ఉత్పత్తి జరిగిందని, కొనుగోలు కేంద్రాల ద్వారా కనీస మద్దతు ధఱతో రైతుల వద్ద నుంచి ధాన్యం కొనుగోలు చేసి 48 గంటల్లోగా సంబంధిత రైతుల ఖాతాల్లో నగదు జమ చేశామని తెలిపారు. సన్నరకం వడ్డు పండించిన రైతులకు మద్దతు ధరతో పాటు రూ.500 బోనస్‌ అందించడం జరిగిందని తెలిపారు. జిల్లా కేంద్రంలోని జన్కాపూర్‌ రైతు వేదికలో నిర్వహించిన రైతు నేస్తం కార్యక్రమంలో కలెక్టర్‌ వెంకటేష్‌ దోత్రే, అదనపు కలెక్టర్‌ దీపక్‌ తివారి, జిల్లా వ్యవసాయాధికారి శ్రీనివాసరావు, వ్యవసాయాధకారి మిలింద్‌తో పాటు జిల్లా విద్యుత్‌ శాఖ ఎస్‌ఈ శేషారావు, ఇతర అధికారులు పాల్గొన్నారు.

కాగజ్‌నగర్‌, (ఆంధ్రజ్యోతి): వంజిరిలోని రైతు వేదికలో మంగళవారం రైతు భరోసా సంబరాలు ఘనంగా జరిపారు. ఈ సందర్భంగా పలువురు రైతులు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం తమ ఖాతాల్లో రైతు భరోసా చేసినట్టు తెలిపారు. ఎలాంటి ఆంక్షలు లేకుండా రైతు భరోసా సహాయం చేస్తున్నట్టు తెలిపారు. కార్యక్రమంలో వ్యవసాయాధికారి రామకృష్ణ, రైతులు పాల్గొన్నారు.

రెబ్బెన, (ఆంధ్రజ్యోతి): మండలంలో రైతు భరోసా సంబరాలు నిరమవహించారు. కార్యక్రమంలో కాంగ్రెస్‌ పార్టీ మండల అధ్యక్షుడు లావుడ్య రమేష్‌, బ్లాక్‌ కాంగ్రెస్‌ అధ్యక్షులు దుర్గం దేవాజీ, మాజీ సర్పంచ్‌లు చెన్న సోమశేఖర్‌, ముంజం రవీందర్‌, మాజీ ఎంపీటీసీ రఘుపతి, మోడెం చిరంజీవితో పాటు తదితరులు పాల్గొన్నారు.

సిర్పూర్‌(టి), (ఆంధ్రజ్యోతి): సిర్పూర్‌(టి) మండలంలోని వెంపల్లి రైతు వేదిక లో మంగళవారం సీఎం రేవంత్‌రెడ్డి వీసీ ద్వారా ఏర్పాటు చేసి రైతు భరోసా విజయోత్సవ కార్యక్రమం రైతులు, అధికారులు వీక్షించారు. ఈ సందర్భంగా సీఎం ఇచ్చిన సందేశంను విన్నారు. కార్యక్రమంలో ఏవో గిరీష్‌కుమార్‌, తహసీల్దార్‌ రహీముద్దీన్‌, ఎంపీడీవో సత్యనారాయణ, ఏఈవోలు నేహాతబసుం, శోభ, రవికుమార్‌, విశాల్‌ పాల్గొన్నారు.

చింతలమానేపల్లి, (ఆంధ్రజ్యోతి): మండలంలోని రుద్రాపూర్‌, బాలాజీఅనుకోడ రైతు వేదికల్లో రైతు నేస్తం కార్యక్రమంలో మంగళవారం వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. సీఎం రేవంత్‌రెడ్డి, ఇతర మంత్రులు ప్రత్యక్షంగా మాట్లాడడాన్ని రైతులు, అధికారులు విన్నారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్‌ రమేష్‌, ఏఈవో వెంకటేష్‌, గిర్దావర్‌ విజయ్‌ తదితరులు పాల్గొన్నారు.

దహెగాం, (ఆంధ్రజ్యోతి): దహెగాం, కొంచవెల్లి గ్రామాల్లో రైతు వేదికల్లో మంగళవారం రైతు భరోసా విజయోత్సవాలను వీడియో కాన్ఫరెన్స్‌ యూనిట్‌ ద్వారా ప్రత్యక్ష ప్రసారం వీక్షించారు. కార్యక్రమంలో ఏఈవోలు ఆనంద్‌, వంశీ, సుస్మీత పాల్గొన్నారు.

Updated Date - Jun 24 , 2025 | 10:51 PM