Website: వాటర్‌బోర్డు వెబ్‌సైట్ హ్యాకింగ్
ABN, Publish Date - Jan 24 , 2025 | 09:13 AM
వాటర్‌బోర్డు వెబ్‌సైట్‌ను సైబర్ నేరగాళ్లు హ్యాక్ చేశారు. బోర్డు అధికారులకు సంబంధించిన వివరాలన్నీ మాయం చేశారు. ఇది జరిగి పది రోజులు గడుస్తున్నా ఇప్పటి వరకు ఐటీ విభాగం అధికారులెవ్వరూ వెబ్‌సైట్‌ను పునరుద్ధరించకపోవడం విస్మయానికి గురి చేస్తోంది.
- ఓపెన్ చేయగానే ప్రైవేటు ప్రకటనలు
- కీలక డేటా కూడా మాయం..?
- రికవరీలో ఐటీ విభాగం విఫలం
హైదరాబాద్ సిటీ: వాటర్‌బోర్డు వెబ్‌సైట్‌ను సైబర్ నేరగాళ్లు హ్యాక్ చేశారు. బోర్డు అధికారులకు సంబంధించిన వివరాలన్నీ మాయం చేశారు. ఇది జరిగి పది రోజులు గడుస్తున్నా ఇప్పటి వరకు ఐటీ విభాగం అధికారులెవ్వరూ వెబ్‌సైట్‌ను పునరుద్ధరించకపోవడం విస్మయానికి గురి చేస్తోంది.
నగరవాసులకు మెరుగైన సేవలు అందించేందుకు వాటర్‌బోర్డు ఆన్‌లైన్‌లో వెబ్‌సైట్, యాప్(Website, app)ను నిర్వహిస్తోంది. సైబర్ నేరగాళ్లు పది రోజుల క్రితం దీనిని హ్యాక్ చేయడంతో వెబ్‌సైట్ మొరాయించింది. ఆ తర్వాత ప్రైవేటు ప్రకటనలు మొదలయ్యాయి.
ఈ వార్తను కూడా చదవండి: Instagram: ఇన్‌స్టాలో చిన్నారుల అశ్లీల వీడియోల పోస్ట్
వెబ్‌సైట్ ప్రారంభం నుంచి బోర్డు మేనేజింగ్ డైరెక్టర్, వివిధ విభాగాల అధికారులు, ఉద్యోగుల వివరాలు, వారిని సంప్రదించే ఫోన్లు నెంబర్లు, మెయిల్ ఐడీలను ఇందులో పొందుపరిచారు. కానీ ప్రస్తుతం ఆ వివరాలేవి వాటర్‌బోర్డు వెబ్‌సైట్‌లో లేవు. వెబ్‌సైట్‌లో కాంటాక్ట్ డేటాతో పాటు కీలకమైన డేటాను కూడా సైబర్ నేరగాళ్లు పూర్తిగా మాయం చేసినట్లు తెలిసింది. అయినా, ఇప్పటి వరకు ఐటీ విభాగం అధికారులు రికవరీ చేయలేదు. కానీ ఆ విషయాలు బయటకు రాకుండా గోప్యతను ప్రదర్శిస్తున్నారు.
వాటర్‌బోర్డు వెబ్‌సైట్‌ను, యాప్‌ను మెరుగుపరిచే చర్యలు లేకపోగా.. ఐటీ సేవల పేరుతో కోట్ల రూపాయలను పక్కదారి పట్టిస్తున్నారనే ఆరోపణలున్నాయి. ఐటీ విభాగం నిర్వహణ ఓ కీలక డైరెక్టరే పర్యవేక్షిస్తుండగా.. ఈ తప్పిదాలు చోటు చేసుకోవడంపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇప్పటికైనా ఉన్నతాధికారులు దృష్టి సారించి వాటర్‌బోర్డు వెబ్‌సైట్‌లో చోరీ అయిన డేటాను రికవరీ చేయాలని, వినియోగదారులకు మెరుగైన సేవలు అందించేవిధంగా చర్యలు చేపట్టాలని పలువురు కోరుతున్నారు.
ఈవార్తను కూడా చదవండి: కిడ్నీ మార్పిడి జరిగిందెక్కడ?
ఈవార్తను కూడా చదవండి: నేనే చంపాను.. మీ వద్ద సాక్ష్యాలున్నాయా?
ఈవార్తను కూడా చదవండి: భర్త దొంగ అని తెలిసి షాక్.. బిడ్డల్ని చంపి.. తల్లి ఉరి
ఈవార్తను కూడా చదవండి: CM Revanth Reddy: దావోస్ ధమాకా!
Read Latest Telangana News and National News
Updated Date - Jan 24 , 2025 | 09:13 AM