Share News

Instagram: ఇన్‌స్టాలో చిన్నారుల అశ్లీల వీడియోల పోస్ట్‌

ABN , Publish Date - Jan 24 , 2025 | 08:53 AM

చిన్నారుల అశ్లీల (చైల్డ్‌ పోర్నోగ్రఫీ) వీడియోలను ఇన్‌స్టాగ్రామ్‌(Instagram)లో షేర్‌ చేస్తున్న ముగ్గురిని హైదరాబాద్‌ సైబర్‌ క్రైం పోలీసులు(Hyderabad Cyber ​​Crime Police) గురువారం అరెస్టు చేశారు.

Instagram: ఇన్‌స్టాలో చిన్నారుల అశ్లీల వీడియోల పోస్ట్‌

- ముగ్గురి అరెస్టు

హైదరాబాద్‌ సిటీ: చిన్నారుల అశ్లీల (చైల్డ్‌ పోర్నోగ్రఫీ) వీడియోలను ఇన్‌స్టాగ్రామ్‌(Instagram)లో షేర్‌ చేస్తున్న ముగ్గురిని హైదరాబాద్‌ సైబర్‌ క్రైం పోలీసులు(Hyderabad Cyber ​​Crime Police) గురువారం అరెస్టు చేశారు. నేషనల్‌ సెంటర్‌ ఫర్‌ మిస్సింగ్‌ అండ్‌ ఎక్స్‌ప్లాయిటెడ్‌ చిల్డ్రన్‌ (ఎన్‌సీఎంఈసీ) అనే స్వచ్ఛంద సంస్థ ఇచ్చిన ఫిర్యాదు మేరకు రంగంలోకి దిగిన సైబర్‌ క్రైం పోలీసులు.. ఐపీ అడ్రస్‌, మొబైల్‌ నంబర్‌, ఈ- మెయిల్‌ ఆధారంగా నిందితులను గుర్తించి అదుపులోకి తీసుకున్నారు.

ఈ వార్తను కూడా చదవండి: Kite: బాలున్ని బలిగొన్న గాలిపటం..


city5.2.jpg

నగరానికి చెందిన ఇద్దరు ప్రైవేటు ఉద్యోగులు(25), (32), ఓ వ్యాపారి(26) ఆన్‌లైన్‌లో పలు సైట్ల ద్వారా చైల్డ్‌ పోర్నోగ్రఫీ వీడియోలు డౌన్‌లోడ్‌ చేసి చూసేవారు. అంతేకాకుండా వారు రూపొందించిన నకిలీ ఇన్‌స్టాగ్రామ్‌ ఐడీలలో ఈ వీడియోలను పోస్ట్‌ చేశారు. దీంతో ముగ్గురు నిందితులపై కేసులు నమోదు చేసి అరెస్ట్‌ చేసినట్లు సైబర్‌ క్రైం డీసీపీ కవిత తెలిపారు.


ఈవార్తను కూడా చదవండి: కిడ్నీ మార్పిడి జరిగిందెక్కడ?

ఈవార్తను కూడా చదవండి: నేనే చంపాను.. మీ వద్ద సాక్ష్యాలున్నాయా?

ఈవార్తను కూడా చదవండి: భర్త దొంగ అని తెలిసి షాక్‌.. బిడ్డల్ని చంపి.. తల్లి ఉరి

ఈవార్తను కూడా చదవండి: CM Revanth Reddy: దావోస్ ధమాకా!

Read Latest Telangana News and National News

Updated Date - Jan 24 , 2025 | 10:22 AM