ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

సాగర్‌ కుడికాల్వకు నీటి విడుదల నిలిపివేత

ABN, Publish Date - Jun 06 , 2025 | 12:36 AM

నాగార్జునసాగర్‌ ప్రాజెక్టు పరిధిలో కుడికాల్వకు బుధవారం రాత్రి నుంచి నీటి విడుదలను నిలిపివేశారు.

నాగార్జునసాగర్‌, జూన్‌ 5 (ఆంధ్రజ్యోతి): నాగార్జునసాగర్‌ ప్రాజెక్టు పరిధిలో కుడికాల్వకు బుధవారం రాత్రి నుంచి నీటి విడుదలను నిలిపివేశారు. సాగర్‌ కుడికాల్వ పరిఽధిలో ఉన్న గ్రామాలకు తాగునీటి కోసం నీటిని విడుదల చేయాలని ఏపీ రాష్ట్ర నీటిపారుదల శాఖ అధికారులు కృష్ణానదీ యాజమాన్య బోర్డు(కేఆర్‌ఎంబీ)కు ఈ ఏడాది మే 20వ తేదీన లేఖ రాశారు. దీంతో స్పందించిన కేఆర్‌ఎంబీ కుడి కాల్వకు నాలుగు టీఎంసీల నీటిని తాగునీటి అవసరాలకు కేటాయించింది. కుడి కాల్వకు కేటాయించిన నీటి వాటాను గత మే నెల 22వ తేదీ నుంచి రోజుకు సుమారు 4500 క్యూసెక్కుల చొప్పున 14 రోజుల్లో నాలుగు టీఎంసీలను విడుదల చేశారు. కుడికాల్వకు కేటాయించిన నీటి వాటా పూర్తవడంతో బుధవారం రాత్రి నుంచి నీటి విడుదలను నిలిపివేసినట్లు ప్రాజెక్టు అధికారులు తెలిపారు. సాగర్‌ ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటిమట్టం 590 అడుగులు (312.0450టీఎంసీలు) కాగా గురువారం సాయంత్రానికి 511.60 అడుగులుగా(134.4032 టీఎంసీలు) ఉంది. సాగర్‌ నుంచి ఎస్‌ఎల్‌బీసీ ద్వారా జంటనగరాల తాగు నీటి అవసరాలకు 450 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు. సాగర్‌ నుంచి కుడి, ఎడమ, వరద కాల్వలకు, ప్రధాన జలవిద్యుత్‌ కేంద్రానికి ఎలాంటి నీటి విడుదల లేదు. సాగర్‌ నుంచి 450 క్యూసెక్కుల నీరు దిగువకు విడుదల అవుతుండగా, ఎగువ నుంచి నీటి రాక లేదు.

సాగర్‌ 13 క్రస్ట్‌ గేట్లకు మరమ్మతులు పూర్తి

వారం రోజులుగా నాగార్జునసాగర్‌ ప్రాజెక్టు క్రస్ట్‌ గేట్ల మరమ్మతులు నిర్వహిస్తున్నారు. మొత్తం 26 క్రస్ట్‌ గేట్లు ఉండగా అందులో 1వ నెంబర్‌ గేటు నుంచి 13వ నంబర్‌ గేటు వరకు గ్రీసింగ్‌, రబ్బరు సీళ్లు, రోప్‌ల తుప్పును తొలగించడం వంటి పనులు పూర్తయయయ్యాని ప్రాజెక్టు అధికారులు తెలిపారు. 13గేట్లకు సెంట్రల్‌ డ్రైవ్‌ యూనిట్‌లకు, ఎండ్‌ డ్రైవ్‌ యూనిట్లను సర్వీసింగ్‌ చేసి గ్రీసింగ్‌ చేశామని అధికారులు తెలిపారు. రెండు రోజుల్లో మిగిలిన 13క్రస్ట్‌ గేట్ల మరమ్మతులు, సర్వీసింగ్‌ పనులు కూడా పూర్తి చేస్తామని, అన్ని క్రస్ట్‌ గేట్ల మరమ్మతులు, సర్వీసింగ్‌ పూర్తయిన తర్వాత వచ్చే వారంలో ట్రయల్‌ రన్‌ నిర్వహిస్తామని తెలిపారు. సాగర్‌కు వరద రాక మొదలయ్యే నాటికి క్రస్ట్‌ గేట్లు ఎత్తడంలో ఎటువంటి సమస్యలు తలెత్తకుండా, క్రస్ట్‌ గేట్లు మోరాయించకుండా చర్యలు చేపడుతున్నట్లు పేర్కొన్నారు.

Updated Date - Jun 06 , 2025 | 12:36 AM