Minister Seethakka: ములుగు అభివృద్ధికి అటవి శాఖ గ్రీన్ సిగ్నల్
ABN, Publish Date - Aug 04 , 2025 | 03:45 PM
తెలంగాణ కేబినెట్ సమావేశాల్లో మంత్రి సీతక్క సుధీర్ఘ పోరాటానికి ఫలితం దక్కింది. ములుగు అభివృద్ధికి అటవీశాఖ గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది. కేబినెట్ సమావేశంలో మంత్రి సీతక్క తన ప్రతిపాదనలను వినిపించారు. సీతక్క ప్రతిపాదనలను అటవీశాఖ పచ్చజెండా ఊపింది. దీంతో ములుగు జిల్లా అభివృద్ధికి సీతక్క ఆధ్వర్యంలో బీజం పడింది.
ములుగు, ఆగస్టు 4: తెలంగాణ కేబినెట్ సమావేశాల్లో మంత్రి సీతక్క సుధీర్ఘ పోరాటానికి ఫలితం దక్కింది. ములుగు అభివృద్ధికి అటవీశాఖ గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది. కేబినెట్ సమావేశంలో మంత్రి సీతక్క తన ప్రతిపాదనలను వినిపించారు. సీతక్క ప్రతిపాదనలను అటవీశాఖ పచ్చజెండా ఊపింది. దీంతో ములుగు జిల్లా అభివృద్ధికి సీతక్క ఆధ్వర్యంలో బీజం పడింది.
30 పడకల ఆస్పత్రి..
జిల్లా పరిధిలోని కంతనపల్లి, కొండపర్తి, కొడిశెల, ఐలాపురం, పాకాల.. దుబ్బగూడెం వరకు రోడ్ల నిర్మాణానికి అనుమతులు లభించినట్లు మంత్రి సీతక్క తెలిపారు. పాకాల కొత్తగూడెంలో 30 పడకల ఆస్పత్రి నిర్మాణానికి క్లియరెన్స్ వచ్చిందని ఆనందం వ్యక్తం చేశారు. 30 పడకల ఆసుపత్రి నిర్మాణంతో ఎంతోమంది గిరిజన ప్రజలకు వైద్యం దొరుకుతుందని ఆమె సభకు వివరించారు. తాడ్వాయి, ఏటూరు నాగరం ప్రాంతాల్లో ఎకో టూరిజం అభివృద్ధికి ప్రత్యేక సఫారీ వాహనాలు కూడా మంజూరు చేసినట్లు చెప్పుకొచ్చారు.
తెలంగాణ వైల్డ్ లైఫ్ బోర్డు నిర్ణయంతో మంత్రి సీతక్క హర్షం వ్యక్తం చేశారు. తనకు మద్దుతు తెలిపిన అటవీ, పర్యావరణ శాఖ మంత్రి కొండా సురేఖకు, వైల్డ్ లైఫ్ బోర్డు సభ్యులకు మంత్రి సీతక్క కృతజ్ఞతలు కృతజ్ఞతలు తెలిపారు. మంత్రిగా తన బాధ్యతలు నిర్వర్తిస్తూనే.. నియోజకవర్గం అభివృద్ధికి పాటుపడుతానని తెలిపారు. బీఆర్ఎస్, బీజేపీ నాయకులు కావాలనే కాంగ్రెస్ ప్రభుత్వంపై బురద చల్లే ప్రయత్నం చేస్తున్నారని విమర్శించారు. ఎవరు ఎన్ని ప్రయత్నాలు చేసిన కాంగ్రెస్ ప్రభుత్వాన్ని జనాల మనసుల్లో నుంచి తుడిచిపెట్టాలేరని సీతక్క ప్రతిఘటించారు.
Updated Date - Aug 04 , 2025 | 03:50 PM