ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

పరిహారం కోసం ఎదురు చూపులు..

ABN, Publish Date - Jun 15 , 2025 | 10:49 PM

ప్రకృతి వైప రీత్యం కారణంగా అన్నదాతకు ఎనలేని నష్టం వా టిల్లగా ప్రభుత్వపరం సాయం అందించడంలో తీవ్ర జాప్యం జరుగుతోంది. ఇటీవల కురిసిన భారీ వర్షాలకు జిల్లాలో పెద్ద మొత్తంలో పంట నీటి పాలుకావడంతో రైతులు దిక్కు తోచని స్థితిలో ఆందోళనకు గురవుతు న్నారు.

-జిల్లాలో నేలరాలిన 3713 ఎకరాల మామిడి

-862 ఎకరాల్లో నీట మునిగిన వరి పంటలు

-45 రోజులు దాటినా పైసా విదిల్చని ప్రభుత్వం

-నష్టం అంచనా రిపోర్టు తయారీలో జాప్యం

-వానాకాలం సాగుకు అందని నష్టపరిహారం

మంచిర్యాల, జూన్‌ 15 (ఆంధ్రజ్యోతి): ప్రకృతి వైప రీత్యం కారణంగా అన్నదాతకు ఎనలేని నష్టం వా టిల్లగా ప్రభుత్వపరం సాయం అందించడంలో తీవ్ర జాప్యం జరుగుతోంది. ఇటీవల కురిసిన భారీ వర్షాలకు జిల్లాలో పెద్ద మొత్తంలో పంట నీటి పాలుకావడంతో రైతులు దిక్కు తోచని స్థితిలో ఆందోళనకు గురవుతు న్నారు. వేలకు వేలు అప్పులు చేసి పెట్టుబడులు పెట్టి సాగు చేసిన పంట చేతికందే సమయంలో నీట మున గడంతో కనీసం పెట్టుబడులు కూడా రాని పరిస్థితులు నెలకొన్నాయి. ముఖ్యంగా మామిడి, వరి పంటలకు భా రీ స్థాయిలో నష్టం వాటిల్లింది. అకాల వర్షాల కారణం గా కోత దశకు వచ్చిన వరి పంట పూర్తిగా నీటిపాలు కాగా, మామిడి నేలరాలి రైతులకు తీరని నష్టం మిగిలింది.

జిల్లాలో 4,574 ఎకరాల్లో పంటకు నష్టం...

భారీగా కురిసిన అకాల వర్షాల కారణంగా జిల్లాలో ని పలు మండలాల్లో వరి, మామిడి కలిపి మొత్తం 4574 ఎకరాల్లో పంట పూర్తిగా తుడిచి పెట్టుకుపో యింది. ఇందులో 490 మంది రైతులకు చెందిన వరి పంట 862 ఎకరాల్లో వరి నీట మునగగా, 3713 ఎక రాల మామిడి పంటను రైతులు కోల్పోయారు. అకాల వర్షాల కారణంగా ప్రధానంగా నెన్నెల, భీమారం మం డలాల్లో విపరీతమైన నష్టం వాటిల్లింది. నెన్నెల మండ లంలోని 345 రైతులకు చెందిన 462 ఎకరాల వరిపం ట నీటిపాలుకాగా భీమారం మండలంలో 145 మంది రైతులకు చెందిన 400 ఎకరాల పంట నీట ము నిగింది. అలాగే మే 1న కురిసిన వర్షానికి నెన్నెల మం డలంలో 174 ఎకరాల వరిపంట నీటిపాలైంది. మండ లంలోని ఆవడం గ్రామంలో 60 మంది రైతులకు చెం దిన 50 ఎకరాలు నీటిపాలుకాగా, చిత్తాపూర్‌ గ్రామం లో 30 మందికి చెందిన 20 ఎకరాలు, పొటియాలలో 39 మందికి చెందిన 30 ఎరాలు, చిన్న వెంకటా పూ ర్‌లో 20 మందికి 20 ఎకరాల్లో, నెన్నెలలో ఇద్దరికి చెం దిన 7 ఎకరాలు, నర్వాయిపేటలో 7గురికి చెందిన 12 ఎకరాలు, గుండ్ల సోమారంలో 4గురికి చెందిన 15 ఎక రాలు, గొల్లపల్లిలో 7గురికి చెందిన 10 ఎకరాలు, మై లారంలో 7 గురికి చెందిన 10 ఎకరాల్లో వరిపంట ధ్వంసమైంది. ఇదిలా ఉండగా ఏప్రిల్‌ 30 నుంచి మే 6వ తేదీ వరకు కురిసిన వర్షాల కారణంగా పలు మం డలాల్లోని 3713 ఎకరాల మామిడి నేల రాలింది. నెన్నె ల మండలంలో 762 మంది రైతులకు చెందిన 1763 ఎకరాల్లో మామిడి నేలరాలగా, జైపూర్‌ మండలంలో 113 మందికి చెందిన 330 ఎకరాలు, భీమారం మండ లంలో 592 మందికి చెందిన 1215 ఎకరాలు, బెల్లంపల్లి మండలంలో 185 మందికి చెందిన 222 ఎకరాలు, తాం డూరు మండలంలో 132 మందికి చెందిన 103 ఎకరా లు, మందమర్రి మండలంలో 30 మందికి చెందిన 80 ఎకరాల్లో మామిడి నేల రాలింది.

లక్షలు వెచ్చించి పంట సాగు...

భారీ వర్షాల కారణంగా జిల్లాలోని రైతులకు తీరని నష్టమే వాటిల్లింది. వరి సాగు సమయంలో ఎకరాకు రూ. 40 వేలు వెచ్చించినట్లు రైతులు తెలిపారు. భూ ములు దున్నడం మొదలుకొని విత్తనాలు వేయడం ఎ రువులు, కలుపు తీయడం, కూలీలకు లక్షలు వెచ్చిం చారు. సీజన్‌లో వరి, మామిడి పంటలు ఆశాజనకంగా ఉండటంతో సంబంధిత రైతులు ఆనందంలో ఉన్నారు. ఆశించిన మేర పంటలు పండితే తమ కష్టాలు తీరు తాయనుకున్న సమయంలో ఆకాల వర్షాలు వారి ఆశ లపై నీళ్లు చల్లాయి. పంట మొత్తం తుడిచి పెట్టుకు పోవడంతో రెక్కల కష్టం కూడా మిగలక పోగా, సాగు కోసం చేసిన అప్పు ఎలా తీర్చాలో తెలియక తీవ్ర మనస్థాపానికి గురవుతున్నారు.

నెలలు గడుస్తున్నా అందని పరిహారం....

జిల్లాలో భారీ వర్షాల కారణంగా వివిధ రకాల పం టలకు జరిగిన నష్టాన్ని అంచనా వేసిన అధికారులు తుది జాబితా తయారు చేయడంలో జాప్యం చేస్తున్న ట్లు తెలుస్తోంది. దాదాపు రెండు నెలలు గడుస్తున్నా సంబంధిత నివేధిక ఇంతవరకు ప్రభుత్వానికి అందజే యలేదని సమాచారం. నివేదిక ప్రభుత్వానికి సకాలం లో అందితే రైతులకు పరిహారం అందించడం ద్వారా ప్రభుత్వం వారిని ఆదుకొనేందుకు అవకాశం ఉంటుం ది. నివేదిక అందిన తరువాత ప్రభుత్వం పరిహారం అందజేసేందుకు మరికొంత సమయం పడుతుంది. వా నాకాలం సీజన్‌ ఇప్పటికే ప్రారంభం కాగా, ప్రభుత్వ సాయం పెట్టుబడులకు అందితే కొంతమేర రైతులకు ఉపశమనం కలిగేది. అయితే రెండు నెలలు గడుస్తు న్నా పరిహారం అందకపోవడంతో రైతులు ఆందోళనకు గురవుతున్నారు. భారీ వర్షాల కారణంగా రైతులు నష్ట పోయిన పంటలకు ఎకరాకు రూ. 10వేలు పరిహారం చెల్లిస్తామని ఇప్పటికే ప్రభుత్వం ప్రకటించింది. ఈ మే రకు నష్టపరిహారం చేతికి అందినా కనీసం పెట్టుబడు లు తిరిగొస్తాయన్న ఆశతో రైతులు ఉన్నారు.

Updated Date - Jun 15 , 2025 | 10:49 PM