kumaram bheem asifabad-డ్రైనేజీ నిర్మించాలని గ్రామస్థుల రాస్తారోకో
ABN, Publish Date - Jun 24 , 2025 | 10:49 PM
బంబార గ్రామంలోని గిరిజన మాడల్ స్కూల్ పక్కన కాలనీలో డ్రైనేజీ నిర్మించాలని మంగళవారం గ్రామస్థులు జాతీయ రహదారిపై రాస్తారోకో చేపట్టారు. గ్రామంలోని మాడల్ స్కూల్ పక్క కాలనీలో మురుగు నీరు వెళ్లే దారిలేక గత కొంత కాలంగా తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నామని కాలనీవాసులు ఆందోళనగు దిగారు
వాంకిడి, జూన్ 24 (ఆంధ్రజ్యోతి): బంబార గ్రామంలోని గిరిజన మాడల్ స్కూల్ పక్కన కాలనీలో డ్రైనేజీ నిర్మించాలని మంగళవారం గ్రామస్థులు జాతీయ రహదారిపై రాస్తారోకో చేపట్టారు. గ్రామంలోని మాడల్ స్కూల్ పక్క కాలనీలో మురుగు నీరు వెళ్లే దారిలేక గత కొంత కాలంగా తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నామని కాలనీవాసులు ఆందోళనగు దిగారు. ఇళ్ల మధ్య మురుగు నీరు చేరుతుండడంతో ఇళ్ల పరిసర ప్రాంతం దుర్గంధంగా మారా యని, అధికారులకు ఎన్ని సారు విన్నవించినా ఫలితం లేకుండా పోతుందని వాపాయారు. ఇటీవల కురిసిన వర్షాలకు ఇళ్లల్లోకి మురుగునీరు చేరిందని చెప్పారు. గంట పాటు రోడ్డుపై గ్రామస్థులు రాస్తారోకో చేయడంతో వాహనాల రాకపోకల కు తీవ్ర అంతరాయం ఏర్పడింది. తహసీల్దార్ కవిత, ఎస్సై ప్రశాంత్, గిర్దావార్ మాజీద్‌లు బంబార గ్రామానికి చేరుకొని గ్రామస్థులతో మాట్లాడారు. సంబంధిత అధికారులతో చర్చించి చర్యలు తీసుకుంటామని హామీ ఇవ్వడంతో గ్రామస్థులు ఆందోళన విరమించారు. అనంతరం గ్రామంలోని మాడల్ స్కూల్ పక్కన కాలనీని సందర్శించి ఇళ్లల్లో చేరిన మురుగునీటికి పరిశీలించారు. ప్రస్తుతం ఇళ్లల్లో నీరు చేరకుండా మురుగుకాలువ నిర్మించేవరకు ప్రత్యమ్నయ ఏర్పాటు చేయాలని కాలనీవాసులు తహసీల్దార్‌ను కోరారు. ఇళ్ల పక్కన నిల్వఉన్న నీటిని తొలగించేందుకు తాత్కలికంగా చర్యలు తీసుకోవాలని కార్యదర్శిని ఆదేశించేశారు. ఎక్స్‌కావేటర్‌తో మురుగునీరు వెళ్లేందుకు చర్యలు తీసుకున్నారు.
Updated Date - Jun 24 , 2025 | 10:49 PM