kumaram bheem asifabad- గ్రామస్థులకు సీపీఆర్‌పై అవగాహన
ABN, Publish Date - Jun 15 , 2025 | 10:41 PM
బెజ్జూరు మండలంలోని సలుగుపల్లి గ్రామంలో ఆదివారం బెజ్జూరు ఎస్సై ప్రవీణ్‌కుమార్ ఆధ్వర్యంలో గ్రామస్థులకు సీపీఆర్‌పై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా అయన మాట్లాడుతూ అకస్మత్తుగా ఎవరైనా కింద పడిపో యిన, గుండె నొప్పితో బాధ పడుతున్న వారిని సీపీఆర్ ఎలా చేయాలో వివరించారు
బెజ్జూరు, జూన్ 15 (ఆంధ్రజ్యోతి): బెజ్జూరు మండలంలోని సలుగుపల్లి గ్రామంలో ఆదివారం బెజ్జూరు ఎస్సై ప్రవీణ్‌కుమార్ ఆధ్వర్యంలో గ్రామస్థులకు సీపీఆర్‌పై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా అయన మాట్లాడుతూ అకస్మత్తుగా ఎవరైనా కింద పడిపో యిన, గుండె నొప్పితో బాధ పడుతున్న వారిని సీపీఆర్ ఎలా చేయాలో వివరించారు. సీపీఆర్ చేయడం వల్ల ప్రాణాలు నిలబడే అవకాశాలు ఉంటాయిన తెలిపారు. ప్రతి ఒక్కరికి సీపీఆర్‌పై అవగాహన కలిగి ఉండాలన్నారు. సీపీఆర్ చేసిన తర్వాత వెంటనే సమీపంలోని ఆసుపత్రికి తీసుకు వెళ్లినట్లయితే ప్రాణాలు నిలదొక్కుకునే అవకాశం ఉంటుందన్నారు. అనంతరం నకిలీ విత్తనాలు, సైబర్‌క్రైం నేరాలపై అవగాహన కల్పిం చారు. నకిలీ పత్తి విత్తనాలు కొనుగొలు చేసి మోస పోవద్దని సూచించారు. అనవసరమైన లింకులు ఓపెన్ చేసి అకౌంట్‌లో డబ్బులు పొగొట్టుకొవద్దని ప్రజలకు అవగాహన కల్పించారు. కార్యక్రమంలో ఏఎస్సై మోహన్‌నాయక్, పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.
తిర్యాణి, (ఆంధ్రజ్యోతి): సీపీఆర్‌పై ప్రతి ఒక్కరూ అవగాహన కలిగి ఉండాలని ఎస్సై శ్రీకాంత్ అన్నారు. మండల కేంద్రంలోని కుమరంభీం చౌరస్తాలో ఆదివారం గ్రామస్ధులకు సీపీఆర్‌పై అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా అయన మాట్లాడుతూ గుండెపోటు వచ్చిన వ్యక్తికి తక్షణమే ప్రథమ చికిత్స అందించడం వల్ల ప్రాణాలను కాపాడవచ్చన్నారు. 108 వాహనం వచ్చే వరకు సీపీఆర్ చేయడంతో నిండు జీవితాన్ని కాపాడిన వారమవుతామని చెప్పారు.. బారీ వర్షాలు కురిసినపుడు లోతట్టు ప్రాంతాలకు వెళ్లకుండా ప్రజలు అప్రమత్తంగా ఉండి తగు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.
Updated Date - Jun 15 , 2025 | 10:41 PM