ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

kumaram bheem asifabad- పశు వైద్యం.. గగనం

ABN, Publish Date - Jul 16 , 2025 | 11:20 PM

మండలంలో పశువైద్యంపై పట్టింపు కరువైంది. మండల కేంద్రంలోనే పశువైద్యశాలలో గత కొన్ని నెలల క్రితం వైద్యుడిని నియమించి నప్పటికీ కేవలం కెరమెరి పశువైద్య శాలలో మాత్రమే వైద్యం చేస్తున్నారని పశువుల పెంపకందారు లు చెబుతున్నారు. కెరమెరి పశువైద్యశాలలో డాక్టర్‌, ఇద్దరు అటెండర్లు, ఒక వెటర్నరీ అసిస్టెంట్‌ ఉండాల్సి ఉండగా డాక్టర్‌తో పాటు ఇద్దరు అటెండర్లు మాత్రమే ఉన్నారు

శిథిలావస్థకు చేరిన పశువైద్యశాల

- గ్రామీణ ప్రాంతాల్లో అందని సేవలు

కెరమెరి, జూలై 16 (ఆంధ్రజ్యోతి): మండలంలో పశువైద్యంపై పట్టింపు కరువైంది. మండల కేంద్రంలోనే పశువైద్యశాలలో గత కొన్ని నెలల క్రితం వైద్యుడిని నియమించి నప్పటికీ కేవలం కెరమెరి పశువైద్య శాలలో మాత్రమే వైద్యం చేస్తున్నారని పశువుల పెంపకందారు లు చెబుతున్నారు. కెరమెరి పశువైద్యశాలలో డాక్టర్‌, ఇద్దరు అటెండర్లు, ఒక వెటర్నరీ అసిస్టెంట్‌ ఉండాల్సి ఉండగా డాక్టర్‌తో పాటు ఇద్దరు అటెండర్లు మాత్రమే ఉన్నారు. ఒక వెటర్నరీ అసిస్టెంట్‌ డిప్యూటేషన్‌పై ఆసిఫాబాద్‌ పశువైద్యశాలలో విధులు నిర్వహిస్తున్నారు. వైద్యశాల కూలి పోయే దశకు చేరడంతో ఎంపీడీవో కార్యాల యం పక్కన భవనాన్ని అధికారులు తాత్కాలిక పశువుల ఆసుపత్రికి కేటా యించారు. పాత ఆసుపత్రి భవనంలోనే ప్రస్తుతం పశువైద్యం నిర్వహిస్తున్నారు. నూతన ఆసుపత్రిలో వ్యాక్సిన్‌ ఇతర సామగ్రి నిలువ చేస్తున్నారు.

- సరిపడా సిబ్బంది లేక..

మండలంలో 31 గ్రామా పంచాయతీలు ఉండడంతో సరిపడా సిబ్బంది లేక వైద్యం అందడం లేదని చెబుత ున్నారు. మండలం విశాలంగా ఉండడం వల్ల పశువై ద్యం గ్రామాల్లో అందడం లేదని ఆయా గ్రామాల ప్రజలు తెలుపుతున్నారు. మండలంలో పశు సంపద ఇలా ఉంది. మేకలు 33,273, గొర్రెలు 986, ఆవులు 18,057, గేదెలు 613, కోళ్లు 25,212 ఉన్నాయి. కాగా గోయగాం, అనార్‌పల్లి గ్రామాల్లో పశువైద్య సబ్‌ సెంట ర్‌లు ఏర్పాటు చేయాలని గ్రామీణ ప్రాంత ప్రజలు చెబుతున్నారు. పై గ్రామాల్లో సబ్‌ సెంటర్లు ఏర్పాటు చేసినట్లయితే పశువైద్యం అందుబాటులో ఉంటుంది. గోయగాం సబ్‌ సెంటర్‌ ఏర్పాటు వల్ల కోటారి, కోలాం గూడ, రింగన్‌ఘాట్‌, కల్లెగాం, పిట్టగూడ, ధనోర, పార్డ, రాంజీగూడ, సావర్‌ఖేడ తదితర గ్రామాల పశువులకు సబ్‌ సెంటర్‌ అందుబాటులో ఉంటుంది. అలాగే అనార్‌పల్లిలో సబ్‌ సెంటర్‌ ఏర్పాటు చేయడం వల్ల అనార్‌పల్లి, కరంజీవాడ, జన్కాపూర్‌, శంకర్‌లొద్ది, బొగుడగూడ, సోమ్లాగూడ, దేవాపూర్‌, పెద్ద కరంజీవాడ, తదితర గ్రామాలకు అందుబాటులో ఉంటుంది. ఆయా గ్రామాల పశువుల పెంపకందారులు తెలుపుతున్నారు. ఆయా గ్రామాల ప్రజలు తమ పశువులకు వైద్యం చేయించడానికి సుమారు 20 కిలో మీటర్ల పశువులని తీసుకు వెళ్లి వైద్యం చేయించడం చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్లు రైతులు చెబుతున్నారు.

సబ్‌సెంటర్‌ ఏర్పాటు చేయాలి..

- శ్రీకాంత్‌, గోయగాం గ్రామస్థుడు

గోయగాంలో పశువైద్య సబ్‌ సెంటర్‌ ఏర్పాటు చేయాలి. మండలంలో ఒకే పశువైద్య శాల ఉండడం వల్ల గ్రామాల్లో పశువైద్యం అందడం లేదు. దీంతో మేకలు, గొర్రెలు, గేదెలకు ప్రైవేటు వైద్యాన్ని ఆశ్రయి స్తున్నాం. వెంటనే పశువుల సబ్‌ సెంటర్‌ గోయగాంలో ఏర్పాటు చేయాలి. పశు వైద్యం అనేది రైతుల జీవనోప ాధికి చాలా ముఖ్యం. పశువులకు సకాలంలో వైద్యం అందేలా చూడాల్సిన అవసరం ఉంది.

Updated Date - Jul 16 , 2025 | 11:20 PM