ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Kodaada: వైద్యుడి సమయస్ఫూర్తితో ‘క్యాట్‌ వాక్‌’

ABN, Publish Date - Feb 11 , 2025 | 04:53 AM

ఓ వైద్యుడి ఉపాయంతో పిల్లి కూన దీనావస్థ నుంచి బయటపడింది. సూ ర్యాపేట జిల్లా కోదాడలో మెస్‌ నిర్వహించే రాజు కొన్ని రోజులుగా ఓ పిల్లి కూనను పెంచుకుంటున్నారు.

  • కోదాడలో నడుము విరిగిన పిల్లి కూనకు కృత్రిమ నడక

కోదాడ రూరల్‌, ఫిబ్రవరి 10 (ఆంధ్రజ్యోతి): ఓ వైద్యుడి ఉపాయంతో పిల్లి కూన దీనావస్థ నుంచి బయటపడింది. సూ ర్యాపేట జిల్లా కోదాడలో మెస్‌ నిర్వహించే రాజు కొన్ని రోజులుగా ఓ పిల్లి కూనను పెంచుకుంటున్నారు. ఇటీవల ఆ పిల్లి కూన వీపుపై ఏదో వస్తువు పడటంతో నడుము విరిగి వెనుక కాళ్లు చచ్చుబడిపోయాయి. దాని దీనావస్థను చూసి చలించిన రాజు వైద్యం కోసం కోదాడ పశువైద్యశాలకు తీసుకెళ్లారు. పశు వైద్యశాఖ అసిస్టెంట్‌ డైరెక్టర్‌ పెంటయ్య ఆ పిల్లి పిల్లను పరీక్షించి.. చిన్న వయసే అయినందున వైద్యం చేస్తే భవిష్యత్తులో కాళ్లకు పటుత్వం వచ్చి నడిచే అవకాశం ఉందని చెప్పారు.


బొమ్మల దుకాణం నుంచి రెండు చక్రాల ట్రాలీ బొమ్మను తెప్పించి, పిల్లి కూనకు ఒరుసుకోకుండా స్పాంజ్‌ బెడ్‌ ఏర్పాటు చేసి వెనుక కాళ్లకు సరిపోయే ఎత్తులో దాన్ని అమర్చారు. చక్రాల బొమ్మ అమర్చాక ముందు కాళ్లతో పిల్లి కూన అలవోకగా నడవడం చూసి అందరూ ఆశ్చర్యానికి లోనయ్యారు. రెండు రోజులు పరీక్షించి ప్లాస్టిక్‌ పైపులతో చక్రాల బండిని శాశ్వత ప్రాతిపదికన ఏర్పాటు చేస్తానని అసిస్టెంట్‌ డైరెక్టర్‌ పెంటయ్య తెలిపారు.

Updated Date - Feb 11 , 2025 | 04:53 AM