గుట్ట ఈవోగా వెంకట్రావ్ బాధ్యతల స్వీకరణ
ABN, Publish Date - May 01 , 2025 | 12:38 AM
యా దగిరిగుట్ట ఆలయ కార్యనిర్వాహణ అధికారి (ఈవో)గా ఐఏఎస్ అధికారి ఎస్. వెంకట్రావ్ బుధవారం బాధ్యతలు స్వీకరించారు.
యాదగిరిగుట్ట, ఏప్రిల్ 30 (ఆంధ్రజ్యోతి): యా దగిరిగుట్ట ఆలయ కార్యనిర్వాహణ అధికారి (ఈవో)గా ఐఏఎస్ అధికారి ఎస్. వెంకట్రావ్ బుధవారం బాధ్యతలు స్వీకరించారు. అంతకు ముందు ఆయన గర్భాల యంలో స్వామి అమ్మవారిని దర్శించుకొని పూజల్లో పాల్గొన్నారు. ప్రధాన పూజారులు ఆయనకు ఆశీర్వచనం చేశారు. వెంకట్రావ్ ఉమ్మడి నల్లగొండ జేసీ, యాదాద్రి జిల్లా ఆర్డీడీఏ పీడీగా పనిచేసిన సమయంలో పదోన్నతిపై మహబూబ్‌నగర్ కలెక్టర్‌గా వెళ్లారు. అక్కడి నుంచి నారాయణపేట, సూర్యాపేట జిల్లాల కలెక్టర్‌గా సేవలందించారు. ప్రస్తుతం ఈవోగా బాధ్యతలు చేపట్టిన వెంకట్రావ్ రాష్ట్ర ప్రభుత్వ ప్రొటోకాల్ డైరెక్టర్ జాయింట్ కార్యదర్శిగా పనిచేశారు. గుట్ట ఈవోగా పనిచేసిన ఏ. భాస్కర్‌రావుకు ఉద్యోగులు వీడ్కోలు పలికారు. ఈ కార్యక్రమంలో అనువంశిక ధర్మకర్త భాస్కరాయణీ నరసింహమూర్తి, భద్రాచలం ఆలయ ఈవో రమాదేవి, డీఈవో దోర్భల భాస్కరశర్మ, సివిల్ ఈఈ జిల్లెల దయా కర్‌రెడ్డి, ఎలక్ట్రికల్ ఈఈ ఊడెపు వెం కటరామరావు, ప్రధాన అర్చకుడు నల్లందీగల్ లక్ష్మీనరసింహాచార్యులు, పర్యవేక్షకుడు మాచర్ల రాజన్‌బాబు, దాసోజు నరేష్, వేముల వెంకటేశ్, ముద్దసాని నరేష్, యాస రాకేష్‌రెడ్డి పాల్గొన్నారు.
Updated Date - May 01 , 2025 | 12:38 AM