Vangapalli Srinivas: మాదిగలను ప్రత్యేక గ్రూప్‌లో చేర్చాలి
ABN, Publish Date - Jan 07 , 2025 | 05:23 AM
సుప్రీంకోర్టు ధర్మాసనం ఎస్సీ వర్గీకరణకు సానుకూల తీర్పునిచ్చిన నేపథ్యంలో మాదిగలను ప్రత్యేక గ్రూప్‌లో చేర్చి 10 శాతం రిజర్వేషన్
10 శాతం రిజర్వేషన్ కల్పించాలి: వంగపల్లి శ్రీనివాస్
హైదరాబాద్, జనవరి 6 (ఆంధ్రజ్యోతి) : సుప్రీంకోర్టు ధర్మాసనం ఎస్సీ వర్గీకరణకు సానుకూల తీర్పునిచ్చిన నేపథ్యంలో మాదిగలను ప్రత్యేక గ్రూప్‌లో చేర్చి 10 శాతం రిజర్వేషన్ కల్పించాలని రాష్ట్ర ఎస్సీ వర్గీకరణ ఏకసభ్య కమిషన్ చైర్మన్ జస్టిస్ షమీమ్ అక్తర్‌ను ఎమ్మార్పీఎస్ రాష్ట్ర అధ్యక్షుడు వంగపల్లి శ్రీనివాస్ కోరారు. ఈమేరకు జస్టిస్ అక్తర్‌ను కలిసి వినతిపత్రం సమర్పించారు.
అత్యంత వెనుకబడిన కులాలకు మొదటి ప్రాధాన్యం కల్పించాలని, మాస్ర్టి, డక్కలి, చెందు మొదలైన కులాలను ఎస్సీ జాబితాలో చేర్చి వారి జనాభా నిష్పత్తి ప్రకారం రిజర్వేషన్ కేటాయించాలని కోరారు. మాదిగల జనాభా ప్రకారం ప్రత్యేక గ్రూపుగా చేర్చి 10 శాతం రిజర్వేషన్ కల్పించాలని ఈ సందర్భంగా ఆయన కోరారు.
Updated Date - Jan 07 , 2025 | 05:23 AM