మానవాళికి టీకాలే సంపూర్ణ రక్ష
ABN, Publish Date - Mar 16 , 2025 | 11:13 PM
మానవా ళికి టీకాల సంపూర్ణ ప్రాణ రక్షణ అని, ప్రతీ గర్భవతి, శిశువు సంపూర్ణ టీకీకరణే మన లక్ష్యమని జిల్లా టీకీ కరణ అధికారి డాక్టర్ రవి కుమార్ నాయక్ అన్నారు.
- జిల్లా టీకీకరణ అధికారి రవి కుమార్ నాయక్
తెలకపల్లి, మార్చి 16 (ఆంధ్రజ్యోతి) : మానవా ళికి టీకాల సంపూర్ణ ప్రాణ రక్షణ అని, ప్రతీ గర్భవతి, శిశువు సంపూర్ణ టీకీకరణే మన లక్ష్యమని జిల్లా టీకీ కరణ అధికారి డాక్టర్ రవి కుమార్ నాయక్ అన్నారు. జాతీయ టీకీకరణ ది నోత్సవం సందర్భంగా ఆయన ఆదివారం తెలకపల్లిలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఆసుపత్రిలో వ్యాక్సి న్ నిల్వలను, రికార్డులను, శీతలీకరణ, మెయిం టనెన్స్‌ను ప్రత్యేకంగా పరిశీలించారు.ప్రతీ చిన్నా రికి 12 ప్రాణాంతక వ్యాధులు రాకుండా టీకీకర ణ చేస్తున్నామని తెలిపారు. శీతలీకరణ స్థితిని ఈ-విన్ ద్వారా ఆన్‌లైన్‌లో పర్యవేక్షణ చేయవ చ్చని తెలియజేశారు. జిల్లాలో ప్రతి బుధ, శనివారం గ్రామాల్లో వ్యాధి నిరోధక టీకా కార్యక్రమాన్ని మహిళా ఆరోగ్య కార్యకర్తలు నిర్వహిస్తున్నారని తెలిపారు. త్వరలో ఆరు రకాల కేటగిరి చెందిన పెద్దవారికి కూడా అడల్ట్ బీసీజీ వ్యాక్సినేషన్ కార్యక్రమం, ఆడవారికి గర్భా శయం ముఖ ద్వారా క్యాన్సర్ రాకుండా నివా రించడానికి హెచ్‌పీవీ 12-17 సంవత్సరాల ఆడ పిల్లలకు టీకీకరణ చేసే కార్యక్రమాన్ని ప్రారం భిస్తామని వివరించారు. ప్రజలు ఈ అవకాశా న్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ చింతపట్ల నీరజ్‌కుమార్, పర్యవేక్షకుడు ఫసియొద్దీన్, మగ ఆరోగ్య కార్య కర్త టి.యాదగిరి, రవీందర్‌రావు, అనురాధ పాల్గొన్నారు.
Updated Date - Mar 16 , 2025 | 11:13 PM