ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

kumaram bheem asifabad- గుట్టుగా గంజాయి దందా

ABN, Publish Date - Jun 29 , 2025 | 10:34 PM

జిల్లాలో మత్తు పదార్థాల దందా యథేచ్ఛగా కొనసాగుతోంది. పోలీసు అధికారులు పటిష్ఠ నిఘా ఏర్పాటు చేసినా గంజాయి అక్రమ రవాణాకు అడ్డుక ట్ట పడడం లేదు.

టాస్క్‌ఫోర్సు సిబ్బంది స్వాధీనం చేసుకున్న గంజాయి(ఫైల్‌)

- పోలీసుల పటిష్ఠ నిఘా

- అడ్డుకట్ట పడని విక్రయాలు

- ఏటా పెరుగుతున్న కేసులు

జిల్లాలో మత్తు పదార్థాల దందా యథేచ్ఛగా కొనసాగుతోంది. పోలీసు అధికారులు పటిష్ఠ నిఘా ఏర్పాటు చేసినా గంజాయి అక్రమ రవాణాకు అడ్డుక ట్ట పడడం లేదు.

కాగజ్‌నగర్‌, జూన్‌ 29 (ఆంధ్రజ్యోతి): జిల్లాలో మత్తు పదార్ధాల దందా యధేచ్ఛగా కొనసాగుతోంది. గంజాయి సరఫరా మహారాష్ట్ర కేంద్రంగా సాగుతోంది. కుమరం భీం జిల్లా ఆసిఫాబాద్‌, సిర్పూరు నియోజకవర్గాల్లో గ్రామీణ ప్రాంతాలకు కొంత మంది యధేచ్ఛగా తరలించి సొమ్ము చేసుకుంటున్నారు. గంజాయికి కొంత మంది యువత అలవాటు పడి బానిసలవుతున్నారు. కాని ఈ దందా చేసే వారు మాత్రం అనతి కాలంలోనే లక్షలు గడిస్తున్నారు. గంజాయి నియంత్రణకు అధికార యంత్రాంగం పలు రకాల సమావేశాలు, అవగాహన సదస్సులు నిర్వహిస్తున్నా అడ్డుకట్ట పడడం లేదు. ఒకప్పుడు మారుమూల ప్రాంతాల్లో అంతర్‌పంటగా గంజాయి సాగు చేసే వా రు. అధికారులు పకడ్బందీ చర్యలు తీసుకుని దీనికి అ డ్డుకట్ట వేయగలిగారు. దీంతో స్మగ్లర్లు ఇతర ప్రాంతా ల నుంచి రవాణా చేస్తూ విక్రయిస్తున్నారు.

- వివిధ మార్గాల్లో తరలింపు..

మహారాష్ట్ర నుంచి రైళ్ల ద్వారా కాగజ్‌నగర్‌కు, రోడ్డు మార్గం గుండా ఆసిఫాబాద్‌ నియోజకవర్గంలోని పలు ప్రాంతాల్లో తరలిస్తున్నారు. పది గ్రాముల గంజా యి ప్యాకెట్‌కు రూ.600, గంజాయి నింపిన సిగరేట్‌కు రూ.150 వరకు ధరతో విక్రయిస్తున్నారు. గంజాయి విక్రయించే ప్రాంతాలపై ఇటు ఎక్సైజ్‌ అధికారులు, అటు పోలీసులు సంయుక్తంగా దాడులు చేస్తున్నారు. వీరితో పాటు టాస్క్‌ఫోర్సు టీం కూడా జల్లెడ పడుతోంది. ఎవరిని కూడా వదిలి పెట్టడం లేదు. గతంలో గంజాయి అమ్మకాలు చేసిన వారిపై కూడా నిఘా పెడుతున్నారు. కొంత మందిని తహసీల్దార్‌ ఎదుట కూడా బైండోవర్‌ చేస్తున్నారు. గంజాయి తీసుకోవడంతో ఊపిరితిత్తుల సమస్యలతో పాటు న్యూరో సమస్యలు అధికంగా వస్తున్నాయని వైద్యులు సూచిస్తున్నారు. గంజాయి నిత్యం తీసుకోవటంతో ఆందోళ న, డిప్రెషన్‌, మనోవికారాలు, శ్రద్ద, జాపకశక్తి తగ్గిపోవటం, గుండెవేగం పెరుగుతుండటంతో గుండెపోటుకు దారి తీసే సమస్యలు అధికంగా వస్తున్నాయని డాక్టర్లు చెబుతున్నారు. గంజాయి తీసుకోవటంతో తాత్కాలిక రిలీఫ్‌ వచ్చినా కూడా శారీరక ఆరోగ్య సమస్యలు అధికంగా వస్తాయని చెబుతున్నారు. జిల్లాలో 2022లో 22 కేసులు నమోదయ్యాయి. ఈ సందర్భంగా 8.5 కిలోల గంజాయిని పట్టుకున్నారు. 203 గంజాయి మొక్కలను ధ్వంసం చేశారు. 2023లో 32 కేసులు నమోదయ్యాయి. 2024లో 39 కేసులు నమోదు చేశారు. అలాగే 298.8 కిలోల గంజాయిని, 121 మొక్కలను స్వాధీనం చేసుకొని ధ్వంసం చేశారు.

ఇటీవల దాడుల్లో..

- కాగజ్‌నగర్‌ నజ్రూల్‌నగర్‌లో ఏప్రిల్‌ 12న ఐదు గ్రాముల గంజాయిని స్వాధీనం చేసుకొని నలుగురిపై కూడా కేసు నమోదు చేశారు.

- వాంకిడి మండలం ఆర్లి గ్రామానికి చెందిన రాజును మే 18న పోలీసులు తనిఖీ రూ.6వేల విలువైన గంజాయి ప్యాకెట్లు పట్టుబడ్డాయి.

- బెజ్జూరు మండలం కుశ్నపల్లి సమీపంలో మే 24న గంజాయి తరలిస్తున్న వ్యక్తి పోలీసు పట్టుకొని కేసు నమోదు చేశారు.

- బెజ్జూరు మండలం సులుగుపల్లిలోమే 24న రూ.3.లక్షల విలువైన 3 కిలోల గంజాయి స్వాధీనం చేసుకున్నారు.

- ఆసిఫాబాద్‌ మండలం దాంపూర్‌లో జూన్‌ 13న అన్నాజీ అనే వ్యక్తి ఇంట్లో సోదాలు నిర్వహించగా గంజాయి మొక్కలు పెంచినట్లు గుర్తించారు. 295 గ్రాముల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు.

- కాగజ్‌నగర్‌ రూరల్‌ పరిధిలోని చారిగాంలో ఎస్‌కె సమీర్‌ ఇంటి వద్ద జూన్‌ 25న తనిఖీ చేపట్టగా, రూ.3000 విలువగల గంజాయి లభ్యమైంది. రెబ్బెనకు చెందిన దుర్గం సిద్ధార్థ్‌, ఈసుగాంలోని మిధున్‌ మండల్‌, రాహుల్‌, అబ్బు, శేఖర్‌ అనే వ్యక్తులపై పోలీసులు కేసు నమోదు చేశారు.

గంజాయి నియంత్రణకు చర్యలు..

- రామానుజం, కాగజ్‌నగర్‌ డీఎస్పీ

జిల్లాలో గంజాయి నియత్రంణకు చర్యలు తీసు కుంటున్నాం. అనుమానిత ప్రాంతాల్లో దాడులు చే స్తూ పట్టుబడిన వారిపైకేసులు నమోదు చేస్తున్నాం. చట్టపరంగా శిక్ష పడేలా చుర్యలు తీసుకుంటున్నాం. గంజాయి తీసుకోవడం వల్ల తలెత్తే అనార్థాలపై కళాశాలల్లో అవగాహన సదస్సులు పెడుతున్నాం. ప్రజ లు ఎక్కడైనా గంజాయి విక్రయిస్తున్నట్లు గుర్తిస్తే పోలీసు లకు సమాచారం ఇస్తే చర్యలు తీసుకుంటాం. యువత వ్యసనాల బారిన పడకుండా తల్లిదండ్రులు అప్రమత్తంగా ఉండాలి.

Updated Date - Jun 29 , 2025 | 10:34 PM