ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

రందిలేని కంది

ABN, Publish Date - Jul 12 , 2025 | 12:00 AM

ఏక పంట విధానాన్ని నమ్ముకున్న రైతులు కనీస దిగుబడులు సాధించలేక అప్పుల పాలవుతున్నారు. ఒకే పంట సాగు చేసి ప్రకృతి వైపరిత్యాలతో ఆ పంట దెబ్బతింటే తీవ్రంగా నష్టపోతున్నారు. మిశ్రమ పంటలు సాగు చేస్తే వ్యవసాయంలో ఆశాజనక ఫలితాలు సాధించవచ్చని నిఫుణులు సూచిస్తున్నారు.

అంతరపంటగా వేస్తే అదనపు ఆదాయం

మిశ్రమ సాగుతో బహుళ ప్రయోజనాలు

-విత్తనాలు అందజేసి ప్రభుత్వం ప్రోత్సాహం

నెన్నెల, జూలై 11 (ఆంధ్రజ్యోతి) : ఏక పంట విధానాన్ని నమ్ముకున్న రైతులు కనీస దిగుబడులు సాధించలేక అప్పుల పాలవుతున్నారు. ఒకే పంట సాగు చేసి ప్రకృతి వైపరిత్యాలతో ఆ పంట దెబ్బతింటే తీవ్రంగా నష్టపోతున్నారు. మిశ్రమ పంటలు సాగు చేస్తే వ్యవసాయంలో ఆశాజనక ఫలితాలు సాధించవచ్చని నిఫుణులు సూచిస్తున్నారు. అంతర పంటలతో రైతులు నికర ఆదాయం పొందవచ్చని అంటున్నారు. వర్షాధారంగా పండించే పత్తి, సోయా, జొన్న, మక్క, వేరుశనగ పంటల్లో కందిని అంతర పంటగా వేసుకుంటే లాభాలు గడించవచ్చు. ఏక కాలంలో రెండు పంటల ద్వారా అదనపు ఆదాయాన్ని పొందే వీలుంటుంది. మిశ్రమ పంటల విదానం వల్లా ఒక పంటకు నష్టం వాటిల్లినా రెండో పంటతో కనీస దిగుబడులను దక్కించుకోవచ్చు. కాలం కలిసివచ్చి రెండు పంటల్లో నాన్యమైన దిగుబడులు సొంతమైతే మంచి లాభాలు పొందే అవకాశం ఉంటుంది. పప్పుదినుసుల సాగుతో సహజ సస్యరక్షణ జరిగి భూసారం పెరుగుతుంది. కలుపు సమస్య తీరుతుంది. కాబట్టి ఈ వానాకాలం సీజన్‌లో ప్రధాన పంటతో పాటు బహుళప్రయోజనకారిగా నిలిచే కందిని అంతర పంటగా వేసుకోవాలని సూచిస్తున్నారు. జాతీయ ఆహార భద్రత పథకం కింద రైతులకు కంది విత్తనాలను ఉచితంగా అందజేసి కంది సాగును ప్రభుత్వం ప్రొత్సహిస్తోంది. ప్రస్తుతం జిల్లాలో విత్తన ప్యాకెట్ల పంపిణీ కొనసాగుతోంది.

-ధీమా పంటగా...

వర్షాధారంగా పత్తి, సోయాచిక్కుడు, జొన్న, మక్క పంటలు వేసినప్పుడు ఒక్కోసారి కీలక దశలో వర్షాలు మొఖం చాటేస్తాయి. అలాంటప్పుడు పంట బెట్ట పరిస్థితికి గురై కనీస దిగుబడి రాక రైతులు నష్టపోతారు. ఇలాంటి పరిస్థితుల్లో అంతరపంటగా కందిని 4ః1 నిష్పత్తిలో సాగుచేస్తే కంది ఎక్కువ దిగుబడి నిస్తుంది. ప్రధాన పంట దెబ్బతిన్నప్పటికి కందులు రెండు నుంచి మూడు క్వింటాళ్ల దిగుబడి రావడంతో రైతులు ధీమాగా ఉండవచ్చు. కంది పంటను పెసర మినుములో 1ః4 నిష్పత్తిలో మక్క, జొన్నలో 1ః2 లేదా 1ః4, పత్తిలో 1ః4 లేదా 1ః6 వేరుశనగలో 1ః7, సోయాచిక్కుడులో 1ః7 నిష్పత్తిలో విత్తుకోవచ్చు. సోయాచిక్కుడు, వేరుశనగలో కందిని అంతర పంటగా 7ః1 నిష్పత్తిలో వేస్తే ఉత్పాదకత, రాబడులతో పాటు నేల సారం పెరుగుతుంది. మక్క, కంది, చిక్కుడు పంటలను 2ః1ః1 నిష్పత్తిలో సాగు చేస్తే అధిక ఆదాయం వస్తుంది. కంది అన్ని మెట్టపంటల్లో ఉత్పాదకత, నికర ఆదాయాన్ని పెంచతుంది. ఇంతే కాకుండా నేలలో సారాన్ని పెంచడానికి దోహద పడుతుంది.

-భూభౌతిక స్థితిలో మార్పు...

కంది మొక్క వేర్లు ఆమ్లాన్ని విడుదల చేస్తాయి. ఆ ఆమ్లం నేలలోని భాస్వరాన్ని కరిగించి మొక్కకు అందుబాటులోకి తెస్తుంది. దీంతో నాన్యమైన అధిక దిగుబడులు వస్తాయి. కంది పంట భూసారాన్ని పెంచి నేలను గుల్ల చేస్తుంది. ఒక ఎకరం భూమిలో కందిని సాగు చేస్తే సుమారుగా నాలుగు టన్నుల ఆకు భూమిలోకి చేరుతుంది. పప్పుధాన్యం పంటలతో రైజోబియం సహజీవనం చేయడం వల్ల వేర్లపై చిన్నపాటి బుడిపెలు ఏర్పడి గాలిలోని నత్రజనిని వేర్ల ద్వారా స్థిరీకరిస్తుంది. ఇతర పంటలు భూసారాన్ని పీల్చివేస్తే పప్పు జాతి పంటలు నేలకు బలనిచ్చి సుస్థిర వ్యవసాయినికి తోడ్పాటునందిస్తాయి. ఇంతే కాకుండా కంది వేర్లు నేల లోనికి చొచ్చుకొనిపోయి తేమను గ్రహించి బెట్టను తట్టు కుంటాయి. ఆ వేర్లు ఎండి క్షినించినప్పుడు నేలలో ఖాళీలు ఏర్పడి నేల గుల్లగా మారుతుంది. వర్షపునీరు నేలలోనికి ఇంకిపోయేందుకు ఉపయుక్తంగా ఉంటుంది. తెలంగాణలో ని కొన్ని ప్రాంతాల్లో పసుపు, అల్లం సాగు చేసే రైతులు సాగుకు ముందు కంది పంట వేస్తారు. ఇలా చేయడం వల్ల మంచి దిగుబడులు సాధిస్తున్నారు.

-వనరుల సద్వినియోగం

నేల, నీరు, సూర్యరశ్మి లాంటి సహజవనరులను కంది పంట సంపూర్ణంగా ఉపయోగించుకుంటుంది. వేరుశనగ, సోయాచిక్కుడు, పెసర, మినుము లాంటి పంటల్లో కంది ని 7:1 అంతర పంటగా వేసినప్పుడు ప్రధాన పంట వి త్తిన రెండు లేదా మూడు నెలల్లో ముగుస్తుంది. అంత వ రకు నెమ్మదిగా పెరిగే కంది ఆ తర్వతా నిలువు, అడ్డంగా బాగా విస్తరించి వనరులను బాగా ఉపయోగించుకొని మంచి దిగుబడులు వస్తాయి. సారవంతమైన నేలలో కం ది అయిదారు అడుగుల ఎత్తు పెరిగి చుట్టూ విస్తరించి భూమిని కప్పి వేస్తుంది. ఆహారంలో మాంసకృత్తుల లోపా న్ని సంవరించేందుకు కంది ఉపయో గపడుతుంది. ఇంతే కాకుండా కంది పొట్టు, కంది కట్టెను పొడి చేసి పశువుల కు దాణాగా వేసుకుంటే మేత ఖర్చు తగ్గడంతో పాటు పా ల ఉత్పత్తి పెరుగుతుంది.

కంది సాగును ప్రొత్సహించేందుకు ఉచితంగా విత్తనాలు

-సురేఖ, ఏడీఏ, భీమిని

జాతీయ ఆహార భద్రత పథకంలో భాగంగా రైతులకు ఉచితంగా కంది విత్తనాలు పంపిణీ చేస్తూ రైతులను ప్రోత్సహిస్తున్నాం. ప్రస్తుతం విత్తనాల పంపిణీ కార్యక్రమం కొనసాగుతోంది. గ్రామాల్లో సదస్సులు ఏర్పాటు చేసి రైతుల్లో అవగాహన పెంపొందిస్తున్నాం. వర్షాధారంగా సాగుచేసే పత్తి, సోయాచిక్కుడు, జొన్న, మక్క, వేరుశనగ లాంటి పైర్లలో కందిని అంతర పంటగా వేయడం మంచిది. ప్రధాన పంట దెబ్బతిన్న కందితో నష్టాలను పూడ్చుకోవచ్చు. కంది సాగుతో రైతుకు లాభం కలగడంతో పాటు భూమికి బోలెడు ప్రయోజనాలు కలుగుతాయి.

Updated Date - Jul 12 , 2025 | 12:00 AM