ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

పౖవేటు వర్సిటీలను ప్రోత్సహించేలా ఉన్నాయ్‌

ABN, Publish Date - Jan 28 , 2025 | 05:24 AM

విశ్వవిద్యాలయాల్లో సంస్కరణల కోసం యూనివర్సిటీ గ్రాంట్స్‌ కమిషన్‌ (యూజీసీ) రూపొందించిన కొత్త మార్గదర్శకాలు సమాఖ్య స్ఫూర్తికి విరుద్ధంగా ఉన్నాయని రాష్ట్ర ఉన్నత విద్యా మండలి చైర్మన్‌ ప్రొఫెసర్‌ బాలకిష్టారెడ్డి చెప్పారు.

  • యూజీసీ మార్గదర్శకాలపై ఉన్నత విద్యా మండలి నివేదిక

హైదరాబాద్‌, జనవరి 27 (ఆంధ్రజ్యోతి): విశ్వవిద్యాలయాల్లో సంస్కరణల కోసం యూనివర్సిటీ గ్రాంట్స్‌ కమిషన్‌ (యూజీసీ) రూపొందించిన కొత్త మార్గదర్శకాలు సమాఖ్య స్ఫూర్తికి విరుద్ధంగా ఉన్నాయని రాష్ట్ర ఉన్నత విద్యా మండలి చైర్మన్‌ ప్రొఫెసర్‌ బాలకిష్టారెడ్డి చెప్పారు. ఈ మార్గదర్శకాలను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నట్లు ప్రకటించారు. ఈ విధానం ప్రైవేట్‌ వర్సిటీలను ప్రోత్సహించేలా ఉందన్నారు. వీసీలుగా ఉన్నతాధికారులను నియమించే విధంగా ఈ చర్యలు ఉన్నాయని స్పష్టం చేశారు. యూనివర్సిటీల్లో వీసీల నియామకం, ప్రొఫెసర్ల నియామకాల్లో పలు మార్పులను తీసుకొస్తూ యూజీసీ కొత్త మార్గదర్శకాల ముసాయిదాను రూపొందించిన విషయం తెలిసిందే. సోమవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఉన్నత విద్యా మండలి చైర్మన్‌ బాలకిష్టారెడ్డి ఈ అంశంపై స్పందించారు.


యూజీసీ ప్రతిపాదించిన మార్గదర్శకాలపై అధ్యయనానికి కమిటీని ఏర్పాటు చేశామని, ఆ కమిటీ గుర్తించిన అంశాల ఆధారంగా ప్రభుత్వానికి ప్రత్యేక నివేదికను సమర్పించామని ఆయన చెప్పారు. ఈ మార్గదర్శకాలను వ్యతిరేకిస్తున్నట్లు నివేదికలోనూ పేర్కొన్నామన్నారు. ఈ మార్గదర్శకాలు అమల్లోకి వస్తే.. రాష్ట్రంలోని ప్రభుత్వ వర్సిటీలు దెబ్బతింటాయన్నారు. యూజీసీ మార్గదర్శకాలను వ్యతిరేకించాల్సిన అవసరం ఉందన్నారు. కాగా, ఫిబ్రవరి 15లోపు రాష్ట్రంలోని అన్ని వర్సిటీల సమాచారాన్ని ఆన్‌లైన్‌లో అందుబాటులోకి తీసుకొస్తున్నట్లు బాలకిష్టారెడ్డి చెప్పారు. వర్సిటీ నోడల్‌, సెక్టోరియల్‌ అధికారులతో సోమవారం వర్క్‌షాప్‌ నిర్వహించారు. రాష్ట్రంలోని ప్రైవేట్‌, ప్రభుత్వ వర్సిటీలు ఈ డేటాబే్‌సలోకి రావాలని సూచించారు. దేశంలోని అన్ని వర్సిటీలు ఈ డేటాబే్‌సలోకి వస్తున్నాయని చెప్పారు.


ఈ వార్తలు కూడా చదవండి:

Bank Holidays: ఫిబ్రవరి 2025లో బ్యాంకు సెలవులు ఎన్ని రోజులంటే.. పూర్తి జాబితా..

Ajay Missing: హుస్సేన్‌సాగర్‌లో జరిగిన అగ్ని ప్రమాదంలో యువకుడు మిస్సింగ్

Updated Date - Jan 28 , 2025 | 05:24 AM