Hyderabad: రెండేళ్ల సమస్య.. ఒక్క రోజులోనే పరిష్కారం
ABN, Publish Date - Feb 27 , 2025 | 10:44 AM
అడ్డగుట్ట డివిజన్ కార్పొరేటర్ ప్రసన్నలక్ష్మి(Addagutta Division Corporator Prasannalakshmi) పేరుకే కార్పొరేటర్ కానీ ప్రజా సమస్యల్ని పట్టించుకోకపోవంపై కార్పొరేటర్‌పై అడ్డగుట్ట ప్రజలు తీవ్రంగా మండిపతుడుతున్నారు.
- కాంగ్రెస్ నేత సంతోష్ కుమార్ చొరవతో డ్రైనేజీ పనులు ప్రారంభం
హైదరాబాద్: అడ్డగుట్ట డివిజన్ కార్పొరేటర్ ప్రసన్నలక్ష్మి(Addagutta Division Corporator Prasannalakshmi) పేరుకే కార్పొరేటర్ కానీ ప్రజా సమస్యల్ని పట్టించుకోకపోవంపై కార్పొరేటర్‌పై అడ్డగుట్ట ప్రజలు తీవ్రంగా మండిపతుడుతున్నారు. రెండేళ్ల క్రితం అడ్డగుట్ట డివిజన్ కార్పొరేటర్ ప్రసన్నలక్ష్మి ఆధ్వర్యంలో అడ్డగుట్ట డివిజన్‌లో ని నందనార్‌నగర్ కాలనీలో డ్రైనేజీ మంచినీటి పైప్‌లైన్‌ల కోసం రోడ్లను తవ్వి అర్థంతరంగా నిలిపివేశారు.
ఈ వార్తను కూడా చదవండి: Hyderabad: గుడ్డు, చికెన్‌లో పుష్కలంగా పోషకాలు..
రెండేళ్ల నుంచి పనులు చేయాలని ఆ కాలనీవాసులు కార్పొరేటర్ ఇంటికి చెప్పులు అరిగిలా తిరిగినా ఫలితం లేకపోయింది. ఫోన్ చేస్వే స్వీచ్ ఆఫ్, అదికారం భార్యది, పెత్తనం భర్తది కావడంతో కార్పొరేటర్ భర్త లింగాని శ్రీనివాస్(Lingani Srinivas)ను కలుద్దామంటే కలువడూ, ఉదయాన్నే ఇంటికి వెళితే లేడని చెప్పేస్తారు. నందానర్‌నగర్ లో సమస్య పరిష్కారం కావాలంటే ఆ కాలనీ వాసులు ప్రత్యేకంగా సమావేవం ఏర్పాటు చేసుకుని మంగళవారం కాంగ్రెస్ పార్టీ సికింద్రాబాద్ ఇంచార్జీ సికింద్రాబాద్ కంటెస్టెడ్ ఎమ్మెల్యే ఆదం సంతోష్ కుమార్ ఇంటికి వెళ్లిన ఆ కాలనీ వాసులు నందనార్‌నగర్‌లో సమస్యపై విన్నవించుకున్నారు.
ఆదం సంతోష్ కుమార్ అప్పటికప్పుడు జీహెచ్‌ఎంసి ఉన్నతాధికారులకు ఫోన్ చేసి వెంటనే కాలనీలో డ్రైనేజీ, జలమండలి పైప్‌లైన్ పనులు వెంటనే పూర్తికావాలని అధికారులను ఆదేశించడంతోనే శివరాత్రి పండుగ(Shivaratri festival) అనేది లేకుండా వెను వెంటనే అధికారులు రంగంలోకి దిగి కాలనీలో అర్థంతరంగా ఆగిపోయిన పనులను కొత్త పైప్‌లైన్‌లను ఏర్పాటు చేసే ప్రక్రియలో ఉన్నారు. నలబై ఎనిమిది గంటల్లో పాచ్ వర్క్స్ పనులు పూర్తి అవుతుందని కాంగ్రెస్ నేత మాజీ అడ్డగుట్ట డివిజన్ అధ్యక్షుడు గంటరాజు సాగర్ తెలిపారు. వెనువెంటనే సమస్య పరిష్రించిన ఆదంనను ఆ కాలనీ వాసులు ప్రత్యేక అభినందనలు తెలిపారు.
ఈవార్తను కూడా చదవండి: KTR: సీఎంకు సిగ్గనిపించడం లేదా..?
ఈవార్తను కూడా చదవండి: ఉప్పల్ కేవీలో ఖాళీల భర్తీకి మార్చి 4 ఇంటర్వ్యూ
ఈవార్తను కూడా చదవండి: వేం నరేందర్‌రెడ్డికి మండలి లేదా రాజ్యసభ?
ఈవార్తను కూడా చదవండి: CM Revanth Reddy: మిస్టరీగా మరణాలు!
Read Latest Telangana News and National News
Updated Date - Feb 27 , 2025 | 10:44 AM