Share News

Hyderabad: గుడ్డు, చికెన్‌లో పుష్కలంగా పోషకాలు..

ABN , Publish Date - Feb 27 , 2025 | 10:05 AM

ప్రతిరోజూ గుడ్డు తినడం వల్ల శరీరానికి కావాల్సిన పోషక విలువలు అందుతాయని పలువురు అన్నారు. జూబ్లీహిల్స్‌లో ఇండియన్‌ పౌల్ర్టీ ఎకిప్‏మెంట్‌ మ్యానుఫాక్చరర్స్‌ అసోసియేషన్‌(Indian Poultry Equipment Manufacturers Association in Jubilee Hills) ఆధ్వర్యంలో బుధవారం ప్రపంచ ప్రొటీన్‌ దినోత్సవాన్ని నిర్వహించారు.

Hyderabad: గుడ్డు, చికెన్‌లో పుష్కలంగా పోషకాలు..

హైదరాబాద్: ప్రతిరోజూ గుడ్డు తినడం వల్ల శరీరానికి కావాల్సిన పోషక విలువలు అందుతాయని పలువురు అన్నారు. జూబ్లీహిల్స్‌లో ఇండియన్‌ పౌల్ర్టీ ఎకిప్‏మెంట్‌ మ్యానుఫాక్చరర్స్‌ అసోసియేషన్‌(Indian Poultry Equipment Manufacturers Association in Jubilee Hills) ఆధ్వర్యంలో బుధవారం ప్రపంచ ప్రొటీన్‌ దినోత్సవాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా సంస్థ అధ్యక్షుడు ఉదయ్‌సింగ్‌ బిగాస్‌ మాట్లాడుతూ.. కడుపు నింపుకుంటే శక్తి దానంతట అదే వస్తుందనే భ్రమలో చాలా మంది కార్బొహైడ్రేట్స్‌ తీసుకుంటున్నారని, ఈ ఆలోచన సరికాదన్నారు.

ఈ వార్తను కూడా చదవండి: Vikarabad: అనంతగిరికి అందాల భామలు..


శరీరానికి కావాల్సిన పోషక విలువలు గుడ్డు, చికెన్‌(Egg, chicken)లో పుష్కలంగా ఉన్నాయన్నారు. కణజాలాలను నిర్మించడానికి, మరమ్మతులు చేయడానికి, ఎంజైమ్‌లు, హార్మోన్లను ఉత్పత్తి చేయడానికి, ఆరోగ్యకరమైన రోగనిరోధక వ్యవస్థ కోసం ప్రొటీన్‌ చాలా అవసరమన్నారు. ఈ కార్యక్రమంలో పోషకాహార నిపుణులు పూజా మఖిజా తదితరులు పాల్గొన్నారు.

city7.2.jpg


ఈవార్తను కూడా చదవండి: KTR: సీఎంకు సిగ్గనిపించడం లేదా..?

ఈవార్తను కూడా చదవండి: ఉప్పల్‌ కేవీలో ఖాళీల భర్తీకి మార్చి 4 ఇంటర్వ్యూ

ఈవార్తను కూడా చదవండి: వేం నరేందర్‌రెడ్డికి మండలి లేదా రాజ్యసభ?

ఈవార్తను కూడా చదవండి: CM Revanth Reddy: మిస్టరీగా మరణాలు!

Read Latest Telangana News and National News

Updated Date - Feb 27 , 2025 | 10:05 AM