YV Subba Reddy: మా భూమిలో జోక్యం చేసుకోకుండా ఆదేశించండి
ABN, Publish Date - May 23 , 2025 | 04:13 AM
రంగారెడ్డి జిల్లా శేరిలింగంపల్లి మండలం కొండాపూర్ గ్రామ పరిధిలోని 87/2 సర్వే నంబర్‌లోని తమ 2.08ఎకరాల భూమిలోకి ప్రైవేటు వ్యక్తులు
వైవీ సుబ్బారెడ్డి భార్య స్వర్ణలతారెడ్డి పిటిషన్
హైదరాబాద్, మే 22 (ఆంధ్రజ్యోతి): రంగారెడ్డి జిల్లా శేరిలింగంపల్లి మండలం కొండాపూర్ గ్రామ పరిధిలోని 87/2 సర్వే నంబర్‌లోని తమ 2.08ఎకరాల భూమిలోకి ప్రైవేటు వ్యక్తులు ప్రవేశించకుండా రక్షణ కల్పించేలా పోలీసులను ఆదేశించాలని టీటీడీ మాజీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి భార్య స్వర్ణలతారెడ్డి తెలంగాణ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. చట్టబద్ధమైన టైటిల్ ఉన్న తమ భూమిని ఆక్రమించుకోవాలని జి.నర్సింహారెడ్డి, షేక్ ఇస్లాముద్దీన్, కొప్పుల మల్లారెడ్డి చూస్తున్నారని... దీనిపై గచ్చిబౌలి పోలీసులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదని పేర్కొన్నారు.
ఈ పిటిషన్‌ను పరిశీలించిన జస్టిస్ జె.శ్రీనివాసరావు ధర్మాసనం.. ప్రతివాదులకు నోటీసులు జారీచేసింది. పిటిషనర్‌తోపాటు ప్రైవేటు ప్రతివాదుల వాదన విని రెండువారాల్లో తగిన నిర్ణయం తీసుకోవాలని సైబరాబాద్ పోలీస్ కమిషనర్‌ను ఆదేశించింది. విచారణను జూన్ 23కు వాయిదా వేసింది.
Updated Date - May 23 , 2025 | 04:13 AM