Vajra buses: ముషీరాబాద్ ఆర్టీసీ ఖాళీస్థలంలో నిరుపయోగంగా పడిఉన్న వజ్ర బస్సులు వజ్రాలకు తుప్పు!
ABN, First Publish Date - 2025-01-22T05:02:52+05:30
ప్రజలకు చక్కని ప్రయాణ అనుభూతిని ఇచ్చేందుకు ఏడేళ్ల క్రితం 100 బస్సులను టీజీఎ్‌సఆర్టీసీ కొనుగోలు చేసింది. ఈ బస్సుల కోసం రూ.22 కోట్లు వెచ్చించారు. వీటిలో ఓ యాభై బస్సులు ముషీరాబాబాద్ ఆర్టీసీకి చెందిన ఖాళీ స్థలంలో చాన్నాళ్ల నుంచి వృథాగా పడిఉన్నాయి. సంరక్షణకు ఎలాంటి చర్యలు తీసుకోకపోవడంతో తప్పుపడుతున్నాయి. 2017లో వజ్ర బస్సుల సేవలను ఆర్టీసీ ప్రారంభించింది.
నిరుపయోగంగా 50 వజ్ర బస్సులు
రూ.22 కోట్లు వెచ్చించి కొనుగోలు
చార్జీలు ఖరీదు.. ఆక్యుపెన్సీ 50శాతంలోపే
అందుకే పక్కన.. ఆ బస్సులు ఇక తుక్కుకే?
హైదరాబాద్ సిటీ, జనవరి 21 (ఆంధ్రజ్యోతి): వజ్ర బస్సులు! ఏసీ, అద్భుతమైన సీటింగ్ సౌకర్యంతో విలాసవంతమై ప్రయాణం! ప్రజలకు చక్కని ప్రయాణ అనుభూతిని ఇచ్చేందుకు ఏడేళ్ల క్రితం 100 బస్సులను టీజీఎ్‌సఆర్టీసీ కొనుగోలు చేసింది. ఈ బస్సుల కోసం రూ.22 కోట్లు వెచ్చించారు. వీటిలో ఓ యాభై బస్సులు ముషీరాబాబాద్ ఆర్టీసీకి చెందిన ఖాళీ స్థలంలో చాన్నాళ్ల నుంచి వృథాగా పడిఉన్నాయి. సంరక్షణకు ఎలాంటి చర్యలు తీసుకోకపోవడంతో తప్పుపడుతున్నాయి. 2017లో వజ్ర బస్సుల సేవలను ఆర్టీసీ ప్రారంభించింది. మెహిదీపట్నం, కూకట్‌పల్లి, దిల్‌సుఖ్‌నగర్ నుంచి కరీంనగర్, వరంగల్, గోదావరఖని తదితర చోట్లకు తప్పింది. అయితే రెండేళ్లు కూడా నడుపకుండానే పక్కన పెట్టింది. ఆన్‌లైన్ బుకింగ్ ద్వారానే టికెట్లు ఉండటం, చార్జీలూ భారీగా ఉండటం, 50శాతానికి మించి ఆక్యుపెన్సీ లేకపోవడంతో సర్వీసులను నిలిపివేశారు. కొంతకాలం ఈ బస్సులను శుభకార్యాలయాల కోసం అద్దెకిచ్చారు. ఆ తర్వాత ప్రయాణికుల నుంచి పెద్దగా అదరణ రావడం లేదంటూ డిపోలకే పరిమితం చేశారు. మిగతా యాభై బస్సుల్లో పదింటిని కార్గో సేవలకోసం వినియోగించుకుంటుండగా మిగిలిన 40 బస్సులు జిల్లాల డిపోల్లో ఉన్నాయి.
అప్పుడే అమ్మితే సగం డబ్ములైనా వచ్చేవి
వజ్ర బస్సులు కండిషన్‌లో ఉన్నప్పుడే అమ్మితే సగం డబ్బులైన ఆర్టీసీ ఖాతాలోకి వచ్చేవి కదా అంటూ కార్మికసంఘాల నేతలు ప్రశ్నిస్తున్నారు. ఆ బస్సులను అమ్మకుండా మూలన పడేయడంతో ఇవాళ అవి ఎందుకూ పనికిరాకుండా పోయాయని అంటున్నారు.
ఈ వార్తలు కూడా చదవండి
Palla Srinivas: టీడీపీ కోటి సభ్యత్వం.. ఆ ముగ్గురిదే ఘనత
Chandrababu: వీర జవాన్ కార్తీక్ మృతి పట్ల సీఎం చంద్రబాబు సంతాపం..
CM Chandrababu: దిగ్గజ కంపెనీల అధిపతులతో సమావేశాలు.. చంద్రబాబు షెడ్యూల్ ఇదే
Updated Date - 2025-01-22T07:03:05+05:30 IST