ఆదివాసీ గిరిజనులు రాజకీయాల్లో రాణించాలి
ABN, Publish Date - May 11 , 2025 | 11:08 PM
తెలంగాణలోని ఆదివాసీ గిరిజనులు రాజకీయంగా మెరుగు పడాలని రాజ్యపాలనతో ముందుండాలని కాం గ్రెస్‌పార్టీ జాతీయ ఆదివాసీ గిరిజన శిక్షణ కన్వీనర్ రాహుల్‌బల్ అన్నా రు. ఆదివారం మండల కేంద్రంలోని హరిత రిసార్ట్‌లో రిసార్ట్‌లో తెలం గాణ ఆదివాజీ గిరిజనులకు మూడు రోజుల శిక్షణ తరగతులో భాగంగా మొదటి రోజు అట్టహాసంగా ప్రారంభించారు.
కాం గ్రెస్‌పార్టీ జాతీయ ఆదివాసీ గిరిజన శిక్షణ కన్వీనర్ రాహుల్‌బల్
జన్నారం, మే11(ఆంధ్రజ్యోతి): తెలంగాణలోని ఆదివాసీ గిరిజనులు రాజకీయంగా మెరుగు పడాలని రాజ్యపాలనతో ముందుండాలని కాం గ్రెస్‌పార్టీ జాతీయ ఆదివాసీ గిరిజన శిక్షణ కన్వీనర్ రాహుల్‌బల్ అన్నా రు. ఆదివారం మండల కేంద్రంలోని హరిత రిసార్ట్‌లో రిసార్ట్‌లో తెలం గాణ ఆదివాజీ గిరిజనులకు మూడు రోజుల శిక్షణ తరగతులో భాగంగా మొదటి రోజు అట్టహాసంగా ప్రారంభించారు. మొదటగా యుద్దభూ మి లో అమరులైన మురళీనాయక్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివా ళులు ఆర్పించి జ్యోతి ప్రజ్వళన చేశారు. ఈ సందర్భంగా ఆయన మా ట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ నాయకులు రాహుల్‌గాంధీ సూచనల మేరకు దేశంలో ఆదివాసి గిరిజనులు అన్ని రంగాల్లో వెనుకబడి ఉన్నారని వారి అభ్యున్నతికి వారు రాజ్య పాలనలో ముందుండాలన్నారు. గతంలో నిర్వహించిన మేదోమదన సమావేశంలో రాహుల్ గాంధీ సూచనల మే రకు కమిటీ ఏర్పాటు చేశారని, అందులో భాగంగా ఛత్తీస్‌గఢ్, మధ్య ప్రదేశ్, తెలంగాణ రాష్ర్టాల్లో ఈ శిక్షణ తరగతులు నిర్వహిస్తున్నామని అందులో భాగంగా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని ఆదివాసీ గిరిజను ల కు మూడు రోజుల పాటు శిక్షణ నిర్వహిస్తామన్నారు. ఇందులో రాజకీ యంగా సమన్వయం గ్రామాల అభివృద్ధి పార్టీ బలోపేతం, సామాన్యు లకు అందే విద్య, వైద్యం, సంక్షేమ పథకాలను గ్రామ స్థాయిలో ప్రజల వద్దకు తీసుకెళ్తు గ్రామాల్లో ఉన్న సమస్యలను ప్రభుత్వాలకు తెలియజె ప్తూ ప్రజా పక్షాన పోరాడే విధంగా ప్రతి నాయకుడు ఎదగాలని అన్నా రు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ప్రతి నియోజకవర్గం నుంచి మగ్గురు చొప్పున ఎంపిక చేసి ఈ శిక్షణ తరగతుల్లో పాల్గొనే విధంగా ఏర్పాట్లు చేశామని ఈ మూడు రోజుల్లో ప్రతి ఒక్కరిని నాయకులుగా తీర్చిదిద్ది ప్రజా పాలనలో నాయకులుగా ఉండే విధంగా ప్రతి నాయకుడికి క్రమ శిక్షణ, అంకిత భావం, సేవా బావం ఉండాలని అప్పుడే ఉన్నత నాయ కుడిగా ముందుకు వస్తారని అన్నారు. అనంతరం ఖానాపూర్ ఎమ్మెల్యే ఎడ్మ బొజ్జు పటేల్ మాట్లాడుతూ దేశంలో ఆదివాసీ గిరిజనులు అన్ని విధాలుగా వెనుకబడి ఉన్నారని వారి సంఖ్య అధికంగా ఉన్నప్పటికీ నా యకులుగా మాత్రం కొద్ది మంది మాత్రమే ఉన్నారని రాజ్యపాలనకు దీ టైన నాయకులుగా ఎదగాలని అందులో మహిళలు, విద్యార్థులు మేధా వులుగా ముందుకు రావాలన్నారు. నియోజకవర్గ స్థాయి నుంచి ముగ్గు రికి శిక్షణను ఇప్పించి రెండవ దశలో నియోజకవర్గ స్థాయిలో శిక్షణ త రగతులు నిర్వహిస్తామన్నారు. ప్రతి గ్రామానికి ఒకరిని ఎంపిక చేసి శిక్షణను ఇస్తామన్నారు. ఈ కార్యక్రమంలో జాతీయ ఆదివాసీ గిరిజన చైర్మన్ బెల్య నాయక్, జీసీసీ చైర్మన్ కొట్నాక తిరుపతి, మాజీ ఎమ్మెల్యే రేఖా శ్యాంనాయక్, పార్లమెంట్ కాంగ్రెస్ నాయకురాలు ఆత్రం సుగుణ, రాజుతో పాటు మండల నాయకులు ముజాఫర్ అలీ, సయ్యద్ ఫసి యుల్లా, లక్ష్మీనారాయణతో పాటు మండల కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు.
Updated Date - May 11 , 2025 | 11:08 PM