ప్రయాణం.. ప్రాణసంకటం
ABN, Publish Date - Jul 28 , 2025 | 12:57 AM
మండలంలో రహదారులు అస్తవ్యస్తంగా మారాయి. కనగల్ మండలంలోని బుడమర్లపల్లి గ్రామం వద్ద కనగల్ - చండూరు ప్రధాన రహదారిపై ఏర్పడిన గోతుల్లో వర్షం నీరు చేరి చిన్నపాటి కుంటలను తలపిస్తున్నవి.
ప్రయాణం.. ప్రాణసంకటం
రహదారులపై గుంతలు
పట్టించుకోని అధికారులు
కనగల్, జూలై27(ఆంధ్రజ్యోతి): మండలంలో రహదారులు అస్తవ్యస్తంగా మారాయి. కనగల్ మండలంలోని బుడమర్లపల్లి గ్రామం వద్ద కనగల్ - చండూరు ప్రధాన రహదారిపై ఏర్పడిన గోతుల్లో వర్షం నీరు చేరి చిన్నపాటి కుంటలను తలపిస్తున్నవి. వాహనాలు ఈ గుంతల్లో పడి ప్రమాదాలు జరుగుతున్నాయి. ఈ మార్గంలో ప్రయాణమంటేనే ప్రాణ సంకటంగా మారింద ని వాహనదారులు వాపోతున్నారు. ముఖ్యంగా రాత్రి సమయంలో ఇక్కడ ప్రమాదాలు ఎక్కువ గా జరుగుతున్నాయని గ్రామస్థులు చెబుతున్నా రు. సంబంధిత ఆర్‌అండ్‌బీ అధికారులు గుంతలను పూడ్చి మరమ్మతులు చేయకుండా అలస త్వం వహిస్తున్నారని వారు ఆవేదన వ్యక్తం చే స్తున్నారు. ఇదే రీతిలో దర్వేశిపురం గ్రామానికి వెళ్లే రహదారి కూడా నాలుగు రోజులుగా కురుస్తున్న వర్షాలకు పూర్తిగా దెబ్బతిన్నది. రోడ్డంత బురదమయంగా మారి వాహనాలు ప్రమాదానికి గురవుతున్నాయని స్థానికులు ఆవేదన వ్య క్తం చేస్తున్నారు.
Updated Date - Jul 28 , 2025 | 12:57 AM