ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

Transport Department: దళారుల పిన్‌కోడ్‌

ABN, Publish Date - Jul 17 , 2025 | 05:09 AM

రవాణా శాఖలో అవినీతి దందాకు ఇప్పుడు స్టాప్లర్‌ పిన్ను కీలకంగా మారింది. దాన్నే ‘కోడ్‌’గా వాడుతూ అక్రమార్కులు యథేచ్ఛగా పనులు చక్కబెట్టేస్తున్నారు.

Pins Code
  • స్టాప్లర్‌ పిన్ను రంగును బట్టే అక్కడ పనులు

  • రవాణా కార్యాలయాల్లో అవినీతి కొత్త పుంతలు

  • అధికార్లు, దళారుల ఎత్తుగడ

  • ప్రతి రోజూ ఉదయం పిన్ను రంగుపై నిర్ణయం

హైదరాబాద్‌, జూలై 16 (ఆంధ్రజ్యోతి): రవాణా శాఖలో అవినీతి దందాకు ఇప్పుడు స్టాప్లర్‌ పిన్ను కీలకంగా మారింది. దాన్నే ‘కోడ్‌’గా వాడుతూ అక్రమార్కులు యథేచ్ఛగా పనులు చక్కబెట్టేస్తున్నారు. డ్రైవింగ్‌ లైసెన్సు, ఆర్సీ, ఫిట్‌నెస్‌, వాహన బదిలీ తదితర సేవల కోసం వాహనదారుడు నేరుగా దరఖాస్తు చేసుకుంటే రోజులు, నెలల తరబడి కార్డు కోసం వేచి చూడాల్సిందే. నిత్యం రవాణా శాఖ కార్యాలయాలకు వందల సంఖ్యలో ప్రజలు వస్తుంటారు. నేరుగా వచ్చేవారు చాలా కొద్ది మంది మాత్రమే ఉంటారు. ఎక్కువశాతం ప్రజలు తప్పనిసరి పరిస్థితుల్లో దళారుల్ని ఆశ్రయిస్తుంటారు. దందా ఇక్కడే ప్రారంభమవుతుంది.

డబ్బులు తీసుకునే దళారులు ఆ దరఖాస్తుపై స్టాప్లర్‌ పిన్నును కొడతారు. ఆ దరఖాస్తు ఎంతవేగంగా ముందుకు కదలాలనేది దానిపై ఉండే ఆ ‘పిన్ను’ నిర్ణయిస్తుంది. అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ)కు చిక్కకుండా ఉండేందుకు రవాణా శాఖలో కొందరు అధికారులు, దళారులు సరికొత్త ఆలోచనతో ఇలా స్టాప్లర్‌ పిన్‌ను కోడ్‌గా మార్చుకున్నారు. ఇదివరకు దరఖాస్తుపై పెన్సిల్‌తో కోడ్‌ రాసేవారు. కానీ, ఇటీవల ఏసీబీ నిఘా పెరగడంతో రూటు మార్చా రు. రంగు రంగుల స్టాప్లర్‌ పిన్నుల్ని ఉపయోగించి పనులు చక్కబెట్టుకుంటున్నారు.

పని పూర్తయిన తర్వాత కలర్‌ పిన్ను తొలగించి సాధారణ పిన్నును కొట్టేస్తున్నారు. దరఖాస్తుపై ఏ కలర్‌ స్టాప్లర్‌ పిన్ను వాడాలనేది దళారులు ఆ రోజు ఉదయమే నిర్ణయిస్తారు. ఆ రంగును ఆ రోజు కౌంటర్‌లో ఉండే సిబ్బం ది, అధికారులకు చేరవేస్తారు. దరఖాస్తుపై ఉండే కలర్‌ పిన్ను ఆధారంగానే దరఖాస్తు ముందుకు వెళ్లడమో లేదా తిరస్కరించడమో జరుగుతుంది. డ్రైవింగ్‌ లైసెన్సు, రెన్యువల్‌, ఆర్సీ, వాహనం బదిలీ, ఫిట్‌నెస్‌ సర్టిఫికెట్‌... పని ఏదైనా అడిగినంత ఇవ్వాల్సిందే. లేదు, కాదు అని నేరుగా దరఖాస్తు చేసుకుని అధికారుల వద్దకు వెళ్తే కొర్రీలు పెడుతూ దరఖాస్తుదారుడ్ని ఇబ్బందులకు గురిచేస్తుంటారు.

ఇలా కౌంటర్ల చుట్టూ చక్కర్లు కొట్టడం ఎందుకని వినియోగదారులు దళారుల్ని ఆశ్రయిస్తున్నారు. ఒక్కో పనికి ఒక్కో ధర నిర్ణయిస్తున్న దళారులు తమ వాటా తము తీసుకుని మిగ తా మొత్తాన్ని అధికారులు, సిబ్బందికి పంచుతుంటారు. కాగా, ప్రజల నుంచి లంచాలు తీసుకుంటున్న ప్రభుత్వ విభాగాల్లో రవాణా శాఖ టాప్‌-5లో ఉన్నట్లు ఏసీబీ తాజా నివేదికలో వెల్లడైంది. ‘దరఖాస్తు ఫారాలకు రంగుల స్టాప్లర్‌ పిన్నులు ఉపయోగిస్తున్న అంశం మా దృష్టికి రాలేదు. ఎక్కడైనా ఎవరైనా ఈ తరహా చర్యలకు పాల్పడుతున్నట్లు తేలితే వారిపై చర్యలు తీసుకుంటాం’ అని రవాణా శాఖ ఉన్నతాధికారి ఒకరు తెలిపారు.

డబ్బులు చేతులు మారేదిలా!

రవాణా శాఖ కార్యాలయాల్లో ఉదయం నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకే పని జరుగుతుంది. ఆ తర్వాత టీం లీడర్‌గా వ్యవహరించే ఒక దళారి... మిగతా దళారుల నుంచి డబ్బులు వసూలు చేస్తాడు. అధికారుల వాటాలంటూ కవర్‌లో భద్రపరుస్తాడు. కార్యాలయంలో కాకుండా అధికారులు ఇంటికి తిరిగి వెళ్లే సమయంలో రోడ్డు మార్గంలో ఎక్కడో ఒక పాయింట్‌లో ఈ మొత్తాన్ని వారికి అందజేస్తుంటారు. రోజూ ఒకే పాయింట్‌లో కాకుండా ముందుగా అనుకున్న ప్రకారం ఒక్కో రోజు ఒక్కో పాయింట్‌ నుంచి ఇలా డబ్బులు చేతులు మారుతుంటాయి.

Updated Date - Jul 17 , 2025 | 10:39 AM