ట్రాన్స్‌జెండర్‌కు యువకుడి వేధింపులు
ABN, Publish Date - Apr 19 , 2025 | 10:26 PM
ట్రాన్స్‌జెండర్‌కు ఓ యువకుడి నుంచి ప్రేమ పేరుతో వేధింపులు ఎక్కువ కావడంతో మందమర్రి పట్టణంలోని 1వజోన్ సీఈఆర్ క్లబ్ సమీపంలో నివాసం ఉంటున్న అజయ్ అనే యువకుడి ఇంటి ఎదుట శనివారం ట్రాన్స్‌జెండర్లు బైఠాయించి ధర్నా నిర్వహించారు. యువకుడికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.
- చర్యలు తీసుకోవాలని డిమాండ్
మందమర్రిటౌన్, ఏప్రిల్ 19 (ఆంధ్రజ్యోతి) : ట్రాన్స్‌జెండర్‌కు ఓ యువకుడి నుంచి ప్రేమ పేరుతో వేధింపులు ఎక్కువ కావడంతో మందమర్రి పట్టణంలోని 1వజోన్ సీఈఆర్ క్లబ్ సమీపంలో నివాసం ఉంటున్న అజయ్ అనే యువకుడి ఇంటి ఎదుట శనివారం ట్రాన్స్‌జెండర్లు బైఠాయించి ధర్నా నిర్వహించారు. యువకుడికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. దీంతో కాలనీ వా సులంతా వచ్చి వారికి నచ్చజెప్పే ప్రయత్నం చేసినా వారు శాంతించలేదు. విషయం తెలుసుకున్న పోలీసులు ట్రాన్స్‌జెండర్ల వద్దకు వచ్చి ఆరా తీశారు. ఈ సందర్భంగా ట్రాన్స్‌జెండర్లు మాట్లాడుతూ చందన అనే ట్రాన్స్‌జెండర్‌ను ప్రేమ పేరుతో అజయ్ వేధిస్తున్నాడని, అర్ధరాత్రి గోడ దూకి ఇంట్లోకి వస్తు న్నాడని తెలిపారు. ఫోన్‌కాల్స్, వాట్సాప్ వీడియోకాల్స్ చేస్తూ పెళ్లి చేసుకోకపో తే చనిపోతానంటూ బెదిరిస్తున్నాడని పేర్కొన్నారు. తరుచూ వేధిస్తూ మాన సికంగా వేధిస్తున్నాడని, డబ్బులు కావాలని కూడా బెదిరిస్తున్నాడని తెలిపారు. తమకు న్యాయం చేయాలని అజయ్‌పై కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ సందర్భంగా ఎస్‌ఐ రాజశేఖర్ మాట్లాడుతూ ట్రాన్స్‌జెండర్లు తమకు రాత పూర్వకంగా ఎలాంటి ఫిర్యాదు ఇవ్వలేదని, ఫిర్యాదు చేస్తే చర్యలు తీసుకుం టామని తెలిపారు. అయినప్పటికీ ముందస్తు చర్యల్లో భాగంగా అజయ్‌ను స్ధానిక తహసీల్దార్ ముందు బైండోవర్ చేశామని తెలిపారు. అతనికి కౌన్సె లింగ్ కూడా ఇచ్చామని తెలిపారు. ఈ సంఘటనకు సంబంధించి ఆధారాలు సేకరిస్తున్నామని తెలిపారు.
Updated Date - Apr 19 , 2025 | 10:26 PM