విద్యాబోధన పటిష్టం చేయడానికే శిక్షణ
ABN, Publish Date - May 21 , 2025 | 11:04 PM
ఉపాధ్యా యుల విద్యాబోధన పటిష్టం చేయడం కోసమే శిక్షణ తరగతులు నిర్వహిస్తున్నట్లు కలెక్టర్ బదావత్ సంతోష్ అన్నారు.
- ఉపాధ్యాయుల శిక్షణలో కలెక్టర్ బదావత్ సంతోష్
పెంట్లవెల్లి, మే 21 (ఆంధ్రజ్యోతి) : ఉపాధ్యా యుల విద్యాబోధన పటిష్టం చేయడం కోసమే శిక్షణ తరగతులు నిర్వహిస్తున్నట్లు కలెక్టర్ బదావత్ సంతోష్ అన్నారు. బుధవారం స్థానిక జిల్లా పరిషత్ బాలుర పాఠశాలలో ఉపాధ్యా యులకు జరుగుతున్న వృత్తి నైపుణ్య శిక్షణ కా ర్యక్రమాన్ని కలెక్టర్ సందర్శించి, మాట్లాడారు. ప్రతీ ఉపాధ్యాయుడు ఉత్తమ బోధకుడిగా ఎదిగితేనే విద్యార్థులు విజేతలుగా మారగలరని అన్నారు. బోధన నైపుణ్యాలు మెరుగుపడితే పఠన లెక్కింపు, విశ్లేషణాత్మక ఆలోచన, సామ ర్థ్యాలు విద్యార్థుల్లో లక్ష్య నిర్ధారణ అలవాటు చేయాలని, మారుతున్న కాలానికి అనుగుణంగా నూతన పద్ధతులను అవలంభించాలన్నారు. కలెక్టర్ వెంట అకాడమిక్ మానిటరింగ్ అధికారి షర్ఫుద్దీన్, ఎంఈవో ఇమ్మానుయేల్ ఉన్నారు.
నాయకత్వ లక్షణాలు పెంపొందించుకోవాలి
కల్వకుర్తి : ఉపాధ్యాయులు నాయకత్వ లక్ష ణాలను పెంపొందించుకుని ప్రభుత్వ పాఠశాల ల బలోపేతానికి కృషి చేయాలని జిల్లా విద్యాశా ఖ అధికారి ఏ.రమేష్‌కుమార్ అన్నారు. కల్వకుర్తి పట్టణంలోని సత్యసాయి సమావేశ మందిరంలో జిల్లాలోని కల్వకుర్తి, ఊర్కొండ, వంగూరు, చార కొండ మండలాల హెచ్‌ఎంలకు ఉపాధ్యాయు లకు నాయకత్వ లక్షణాలపై నిర్వహించిన ఐదు రోజుల శిక్షణ తరగతుల శిబిరాన్ని బుధవారం వందేమాతరం ఫౌండేషన్ వ్యవస్థాపక అధ్యక్షు డు రవీందర్‌తో కలిసి డీఈవో పరిశీలించారు. ఉపాధ్యాయులు నిత్య విద్యార్థిగా, ఎప్పటికప్పుడు కొత్త విషయాలను నేర్చుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో సెక్టోరియల్ అధికారి బరపటి వెంకటయ్య, ఆయా మండ లాల ఎంఈవోలు, హెచ్ ఎంలు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.
తరగతుల పర్యవేక్షణ
కొల్లాపూర్ : కొల్లాపూర్ పట్టణంలోని ప్రభుత్వ బా లికల ఉన్నత పాఠశాలలో రెండవ రోజు కొనసాగుతున్న ప్రాథమిక స్థాయి ఉపాధ్యాయుల ఎఫ్‌ఎల్‌ఎన్ శిక్షణ తరగతులను జిల్లా అకాడమిక్ మానిట రింగ్ అధికారి షర్ఫుద్దీన్ బుధవారం పర్యవేక్షిం చారు. ప్రభుత్వ పాఠశాలల్లో ప్రభుత్వం కల్పిస్తు న్న వసతులను విద్యార్థులు తల్లిదండ్రులకు వివరించి పాఠశాలల్లో విద్యార్థులను చేర్చించేలా ఉపాధ్యాయులు కృషి చేయాలన్నారు. ఎంఈవో ఇమ్మానుయేల్, రిసోర్స్ పర్సన్లు, ఉపాధ్యాయులు సీఆర్‌పీలు, ఎమ్మార్సీ, సిబ్బంది పాల్గొన్నారు.
ఉపాధ్యాయులు నిరంతరం నేర్చుకోవాలి
కోడేరు : ఉపాధ్యాయులు నిరంతరం కొత్త విషయాలను నేర్చుకుంటూ విద్యార్థులకు బోధిం చి ఉత్తమ విద్యార్థులుగా తీర్చిదిద్దాలని ఎంఈవో భాస్కర్‌శర్మ అన్నారు. బుధవారం స్థానిక జడ్పీహెచ్ పాఠశాలలో ఉపాధ్యాయుల శిక్షణ శిబిరం రెండవ రోజు కొనసాగింది. కార్యక్రమం లో జిల్లా మానిటరింగ్ అధికారి షర్ఫుద్దీన్, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.
విద్యార్థి భవిష్యత్‌కు ప్రాథమిక విద్య కీలకం
తిమ్మాజిపేట : విద్యార్థి భవిష్యత్‌కు ప్రాథ మిక విద్య కీలకమని ఎంఈవో సత్యనారాయ ణశెట్టి అన్నారు. ఉపాధ్యాయుల్లో బోధన సామ ర్థ్యాలను పెంపొందించడానికి రెండు రోజులుగా స్థానిక జడ్పీహెచ్‌ఎస్‌లో జరుగుతున్న శిక్షణ తరగతులను ఎంఈవో పరిశీలించి, మాట్లాడారు. విద్యార్థికి చదవడం, రాయడం, చతుర్విద ప్రక్రి యలు చేయడం, పరిసరాలపై అవగాహన క ల్పించాలని అన్నారు. శిక్షణ ఉపాధ్యాయులు జ యపాల్‌రెడ్డి, సుధీర్, సుధాకర్‌గౌడ్, విజయలక్ష్మి, కార్తిక్, ఎల్లయ్య పాల్గొన్నారు.
విద్యార్థుల భవితకు బాటలు వేయండి
పెద్దకొత్తపల్లి : విద్యార్థుల భవితకు బాటలు వేయాలని జిల్లా అకాడమిక్ మానిటరింగ్ అధి కారి షర్ఫుద్దీన్ ఉపాధ్యాయులకు సూచించారు. పెద్దకొత్తపల్లి జడ్పీ బాలుర ఉన్నత పాఠశాలలో జరుగుతున్న ఉపాధ్యాయ వృత్యంతర శిక్షణను ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా ఏఎంవో షర్ఫుద్దీన్ మాట్లాడుతూ ఉపాధ్యాయులందరూ సమయపాలన పాటించి ఈ శిక్షణలో రిసోర్స్ పర్సన్‌లు చెప్పిన విషయాలను, మెళకువలను శ్రద్ధగా విని మీ మీ పాఠశాలల్లో విద్యార్థులకు చక్కగా బోధించి వారి విద్యాభివృద్ధికి బాటలు వేయాలని సూచించారు. ఎంఈవో కే.శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ ఈ శిక్షణలో ప్రతీ ఉపాధ్యా యుడు చర్చలో పాల్గొని తమకున్న సందేహా లను నివృత్తి చేసుకోవాలన్నారు. కార్యక్రమంలో రిసోర్స్ పర్సన్లు సాయిప్రకాశ్‌రెడ్డి, మహేష్‌బాబు, సువర్ణ, లక్ష్మీపతి, శివ, భారతి, లోకేశ్వరి, ప్రమీల, సీఆర్పీలు ఈశ్వర్, రాము, మురళి, ఎంఐఎస్ కో ఆర్డినేటర్ స్వామి తదితరులు పాల్గొన్నారు.
Updated Date - May 21 , 2025 | 11:04 PM