ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

సాగర్‌ను సందర్శించిన ట్రైనీ ఐఏఎస్‌లు

ABN, Publish Date - Jun 18 , 2025 | 12:01 AM

ప్రపంచ పర్యాటక కేంద్రం నాగార్జునసాగర్‌ను ట్రైనీ ఐఏఎస్‌లు మంగళవారం సందర్శించారు.

నాగార్జునసాగర్‌ బుద్ధవనంలో ట్రైనీ ఐఏఎస్‌లు

నాగార్జునసాగర్‌, జూన్‌ 17 (ఆంధ్రజ్యోతి): ప్రపంచ పర్యాటక కేంద్రం నాగార్జునసాగర్‌ను ట్రైనీ ఐఏఎస్‌లు మంగళవారం సందర్శించారు. తెలంగాణకు కేటాయించిన ఐఏఎస్‌లు హైదరాబాద్‌లోని మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి సంస్థలో శిక్షణ పొందుతున్నారు. తెలంగాణ దర్శినిలో భాగంగా వారు సాగర్‌ సందర్శనకు వచ్చారు. సాగర్‌ బుద్ధవనానికి చేరుకున్న ట్రైనీ ఐఏఎస్‌లు సౌరబ్‌శర్మ, క్యారోలిన్‌ చింగ్‌తీ అమ్మావై మిర్యాలగూడ సబ్‌ కలెక్టర్‌ అమిత్‌ నారాయణ్‌తో సమావేశమయ్యారు. అనంతరం బుద్ధవనంలో బుద్ధుని పాదాల వద్ద పుష్పాంజలి ఘటించారు. ఆ తర్వాత బుద్ధ చరిత వనం, ధ్యాన వనం, జాతక వనం, స్థూప వనం, మహాస్థూపాలను తిలకించారు. మహాస్థూపంలోని ధ్యాన మందిరంలో జ్యోతి వెలిగించారు. బుద్ధవనం సమావేశ మందిరంలో బుద్ధవనం డాక్యుమెంటరీని తిలకించారు. వారికి బుద్ధవనం ఎస్టేట్‌ మేనేజర్‌ రవిచంద్ర, ఈవో శాసన బుద్ధవనం బ్రోచర్‌లతో పాటు పంచశీల కండువాలు అందజేశారు. అనంతరం జలాశయం మధ్యలో ఉన్న నాగార్జునకొండ, సాగర్‌ ప్రధాన డ్యాం, ప్రధాన జలవిద్యుత్‌ కేంద్రాలను తిలకించారు. పర్యాటక శాఖ గైడ్‌ సత్యనారాయణ వారికి సాగర్‌ చరిత్రను వివరించారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ దర్శన్‌ ప్రోగ్రాం ఆఫీసర్‌ శ్రీనివాస్‌, ఆర్‌ఐ దండా శ్రీనివాస్‌రెడ్డి, విజయ విహార్‌ మేనేజర్‌ కిరణ్‌కుమార్‌ తదితరులు ఉన్నారు.

Updated Date - Jun 18 , 2025 | 12:01 AM