Mahesh Kumar Goud: నేటి నుంచి పీసీసీ చీఫ్ జిల్లాల పర్యటన
ABN, Publish Date - Jan 05 , 2025 | 04:15 AM
స్థానిక సంస్థల ఎన్నికల కోసం కార్యకర్తలను సమాయత్తం చేయడంతో పాటు ప్రచార కార్యక్రమాలకు టీపీసీసీ ఆదివారం శ్రీకారం చుడుతోంది.
హైదరాబాద్, జనవరి 4 (ఆంధ్రజ్యోతి): స్థానిక సంస్థల ఎన్నికల కోసం కార్యకర్తలను సమాయత్తం చేయడంతో పాటు ప్రచార కార్యక్రమాలకు టీపీసీసీ ఆదివారం శ్రీకారం చుడుతోంది. అలాగే ప్రజాపాలన మొద టి వార్షికోత్సవాలను ఆయా స్థాయుల్లో నిర్వహించనుంది. ఆదివారం నల్లగొండ జిల్లా నాగార్జునసాగర్ నుంచి జిల్లాల పర్యటనను టీపీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ ప్రారంభించనున్నారు. ఈనెల 6న ఆదిలాబాద్, 7న నిజామాబాద్ జిల్లాల్లో ఆయన పర్యటించనున్నట్టు పీసీసీ వర్గాలు పేర్కొన్నాయి. కాగా, స్థానిక సంస్థల్లో బీసీలకు 42ు రిజర్వేషన్లు పెంచేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని కాంగ్రెస్ సీనియర్ నేత వి.హన్మంతరావు చెప్పారు.
గాంధీభవన్‌లో టీపీసీసీ చేనేత విభాగం చైర్మన్ శ్రీనివా్‌సతో కలిసి వీహెచ్ మీడియాతో మాట్లాడారు. కాగా, బీఆర్‌ఎస్ నేత హరీశ్‌రావు ‘ప్రజావాణి’ కార్యక్రమంపై బురద జల్లడం మానుకోవాలని, తన గౌరవాన్ని కాపాడుకోవాలని రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు, ప్రజావాణి ఇన్‌చార్జి జి.చిన్నారెడ్డి హితవు పలికారు. సచివాలయ మీడియా సెంటర్‌లో ఆయన మాట్లాడుతూ.. ఇప్పటివరకు 92 సదస్సులు నిర్వహించి, 92,115 ఆర్జీలను స్వీకరించామని, అందులో 63 శాతం సమస్యలను పరిష్కరించామని చెప్పారు.
Updated Date - Jan 05 , 2025 | 04:15 AM