కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు
ABN, Publish Date - May 08 , 2025 | 11:26 PM
ఆపరేషన్ సింధూర్ నేపథ్యంలో కమిషనరేట్ పరిధిలో కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేస్తున్నట్లు రామగుండం సీపీ అంబర్‌కిషోర్‌ఝా అన్నా రు. రామగుండం కమిషనరేట్ పరిధిలో భద్రతా ఏర్పాట్లపై అధికారులతో సీపీ సమీక్షా సమావేశం నిర్వహించారు. సింగరేణి, ఎన్టీపీసీ, ఆర్‌ఎఫ్‌సీఎల్, ఇండస్ర్టియల్ సంస్థల అఽధికారులు, భద్రత అధికారులతో కలిసి సీపీ సమీక్షా సమావేశం నిర్వహించారు.
రామగుండం సీపీ అంబర్‌కిషోర్‌ఝా
మంచిర్యాలక్రైం ,మే8 (ఆంధ్రజ్యోతి): ఆపరేషన్ సింధూర్ నేపథ్యంలో కమిషనరేట్ పరిధిలో కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేస్తున్నట్లు రామగుండం సీపీ అంబర్‌కిషోర్‌ఝా అన్నా రు. రామగుండం కమిషనరేట్ పరిధిలో భద్రతా ఏర్పాట్లపై అధికారులతో సీపీ సమీక్షా సమావేశం నిర్వహించారు. సింగరేణి, ఎన్టీపీసీ, ఆర్‌ఎఫ్‌సీఎల్, ఇండస్ర్టియల్ సంస్థల అఽధికారులు, భద్రత అధికారులతో కలిసి సీపీ సమీక్షా సమావేశం నిర్వహించారు. ప్రజ లకు భద్రతపై అవగాహన కల్పించడంతో పాటు ప్రధానమైన ప్రాంతాల్లో అప్రమత్తంగా ఉండాలని భద్రత వ్యవస్థను కట్టుదిట్టం చేయాలని అధికారులను ఆదేశించారు. అత్యవసర సర్వీ సులు అందించే విభాగాల ఉద్యోగులు అన్ని శాఖలు పూర్తి సమన్వయంతో పని చే యాలని, ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చూడాలని, సమాచార వ్యవస్థను ఏర్పాటు చేసి నిరంతర నిఘా పర్యవేక్షణ చేపట్టాలన్నారు. ఎక్కడ అవాంఛనీయ సంఘ టనలు జరుగకుండా నిర్వహించడానికి అవసరమైన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో మంచిర్యాల డీసీపీ భాస్కర్, పెద్దపల్లి డీసీపీ కరుణాకర్, అడిషనల్ డీసీపీ అడ్మిన్ రాజు, కమాండెంట్ ఎస్‌ఏ రాజు, డిప్యూటి కమాండెంట్ చందన్ కుమార్ సమత, ఎన్టీపీసీ ఈడి లలిత్ కుమార్, ఆర్‌జీ1ఏ జీఎం రాముడు పాల్గొన్నారు.
Updated Date - May 08 , 2025 | 11:27 PM