ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

kumaram bheem asifabad- బీఆర్‌ఎస్‌ హయాంలోనే టైగర్‌ రిజర్వు ప్రతిపాదనలు

ABN, Publish Date - Jul 23 , 2025 | 11:14 PM

టైగర్‌ రిజర్వు ప్రతిపాదనలు బీఆర్‌ఎస్‌ హయాంలోనే జరిగాయని, ప్రస్తుతం ఉన్న కాంగ్రెస్‌ ప్రభుత్వం గిరిజనులసంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకొని జీవో49ని రద్దు చేసిందని ఆదిలాబాద్‌ ఎమ్మెల్సీ దండే విఠల్‌ అన్నారు. తన నివాసంలో బుధవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు.

మాట్లాడుతున్న ఎమ్మెల్సీ దండే విఠల్‌

కాగజ్‌నగర్‌, జూలై 23 (ఆంధ్రజ్యోతి): టైగర్‌ రిజర్వు ప్రతిపాదనలు బీఆర్‌ఎస్‌ హయాంలోనే జరిగాయని, ప్రస్తుతం ఉన్న కాంగ్రెస్‌ ప్రభుత్వం గిరిజనులసంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకొని జీవో49ని రద్దు చేసిందని ఆదిలాబాద్‌ ఎమ్మెల్సీ దండే విఠల్‌ అన్నారు. తన నివాసంలో బుధవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఈ జీవో అమలు జరిగితే తన ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేస్తానని ప్రజలకు స్పష్టమైన హామీ ఇస్తున్నానని చెప్పారు. ఉమ్మడి ఆదిలాబాద్‌ ఆదివాసీల హక్కులను కాలరాసేందుకు గతంలో ఉన్న బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం, బీజేపీ ప్రభుత్వం కలిసి నేషనల్‌ టైగర్‌ జోన్‌కు ప్రతిపాదనలు చేశాయని అన్నారు. ఈ ప్రతిపాదనల్లో కూడా బీఆర్‌ఎస్‌ నాయకుల సంతకాలు కూడా ఉన్నాయని సాక్ష్యాలను కూడా చూపారు. ఈ జీవో రద్దు చేయాలని ఉమ్మడి జిల్లా ప్రజాప్రతినిధులు తీవ్రంగా కృషి చేశారని తెలిపారు. మాజీ ఎంపీ సోయం బాపురావు మాట్లాడుతూ ప్రతిపక్ష పార్టీల నాయకులు ఆదివాసీలను మోసగించాలనే కుట్రలు మానుకోవాలని తెలిపారు. డీసీసీ అధ్యక్షుడు విశ్వ ప్రసాద్‌ మాట్లాడుతూ జిల్లా ప్రజాప్రతినిధుల కృషితోనే జీవో49 రద్దు చేయడంలో జరిగినట్టు పేర్కొన్నారు. జీవో 49 రద్దయిం దని తెలిపారు. సమావేశంలో మాజీ జడ్పీ చైర్మన్‌ సిడాం గణపతి, మాజీ మున్సిపల్‌ చైర్మన్‌ దస్తగీర్‌తో పాటు మాజీ కౌన్సిలర్లు, కార్యకర్తలు పాల్గొన్నారు.

Updated Date - Jul 23 , 2025 | 11:14 PM