ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

kumaram bheem asifabad- కాల్వలకు ముప్పు.. కాలనీలకు ముంపు

ABN, Publish Date - Jun 15 , 2025 | 10:37 PM

- జిల్లాలో లోతట్టు ప్రాంతాలను గుర్తించిన అధికారులు

డ్రైనేజీలో పూడిక తొలగిస్తున్న సిబ్బంది

- ముందస్తు చర్యలకు శ్రీకారం

- శాశ్వత చర్యలు తీసుకోవాలని ప్రజల వినతి

చినుకు పడితే చాలు పురవాసుల్లో వణుకు మొద లవుతుంది. వానొస్తే కాలనీలను వరద ముంచెత్తుతుం ది. వర్షపునీరు వెళ్లేదారి లేక ఎక్కడికక్కడ నిలిచిపో తుంది. నాలాలు ఆక్రమణకు గురై క్రమేణ కుంచించు కుపోవడం, పూడిక తొలగించక పోవడమే ఇందుకు కారణం. వానాకాలం ప్రారంభమైనందున మున్సిపాలి టీలు, గ్రామాల్లో అధికారులు అప్రమత్తమై నివారణ చర్యలు చేపడుతున్నారు.

కాగజ్‌నగర్‌, జూన్‌ 15 (ఆంధ్రజ్యోతి): వర్షాకాలం లో కురిసే భారీ వర్షాలతో వచ్చే వరద ముంపును తప్పించేందుకు అధికారులు ముందస్తు చర్యలకు శ్రీకారం చుట్టారు. జిల్లాలో ఇపాటికే అఽధికార గణం లోతట్టు ప్రాంతాలను గుర్తించారు. ప్రధాన కాల్వలతో ఇండ్లలోకి నీరు వచ్చే అవకాశాలుండటం, ఏటా వర్షాకాలంలో ముంపుకు గురవుతుండటంతో ప్రత్యామ్నాయ చర్యలు తీసుకుంటున్నారు. వారం రోజులు గా కాగజ్‌నగర్‌, ఆసిఫాబాద్‌ మున్సిపాలిటీల్లో స్పెషల్‌ డ్రైవ్‌ కార్యక్రమాన్ని చేపడుతున్నారు. ఈ ప్రక్రియతో భారీ వర్షాలతో ఏర్పడే వరద ముంపు ప్రభావం ఉండకుండా ముందస్తు చర్యలు తీసుకుంటున్నారు.

- మున్సిపాలిటీల్లో స్పెషల్‌ డ్రైవ్‌..

జిల్లాలోని కాగజ్‌నగర్‌, ఆసిఫాబాద్‌ మున్సిపాల్టీలో స్పెషల్‌ డ్రైవ్‌ కార్యక్రమాన్ని చేపట్టారు. వారం రోజుల క్రితం మున్సిపాలిటీలో ప్రత్యేక సమావేశంలో కాగజ్‌నగర్‌ మున్సిపాలిటీలో నాలుగు లోతట్టు ప్రాంతాలను గుర్తించారు. ప్రధాన కాల్వకు అనుసంధానంగా ఉన్న కాలనీలను గుర్తించారు. ఏటా కొద్దిపాటి వర్షాలు కురిస్తే కాల్వలు నిండి రోడ్డుపైకి నీరు ప్రవహిస్తోంది. ప్రధాన కాల్వల్లో చెత్తాచెదారంతో పాటు పిచ్చి మొక్క లు విపరీతంగా పెరిగాయి. వీటిని దృష్టిలో పెట్టుకొని కాగజ్‌నగర్‌ కమిషనర్‌ అంజయ్య ఆధ్వర్యంలో సిబ్బంది స్పెషల్‌ డ్రైవ్‌ కార్యక్రమాన్ని చేపడుతున్నారు. ఉదయం నుంచి ప్రధాన కాల్వలను శుభ్రం చేయిస్తున్నారు. కాగజ్‌నగర్‌ ఎన్టీఆర్‌ చౌరస్తా నుంచి మొదలుకొని మార్కెట్‌ ఏరియా వరకు ఉన్న 30 ఫీట్ల ప్రధాన మురికి కాల్వలో ఉన్న చెత్తాచెదారం, పిచ్చి మొక్కలను తొలగింపు చేపట్టారు. ఈ మార్గంలో ఉన్న అక్రమ నిర్మాణాలను కూడా తొలగించాలని నోటీసులను కూడా అందజేశారు. స్థానిక వసుంధర డిగ్రీ కళాశాలను ఆనుకొని ఉన్న ప్రధాన కాల్వ వీఐపీ పాఠశాల వెనుక వైపు నుంచి ఎల్లాగౌడ్‌ తోట వరకు ఈ కాల్వ ఉంది. ఈ మార్గంలోనే ఫ్రీ జోన్‌ కావడంతో అక్రమ నిర్మాణాలను తొలగించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఎల్లాగౌడ్‌ వంతెన సమీపంలో ఇపాటికే మురికి కాల్వలోనే నిర్మాణాలు జరుగుతున్నాయని వచ్చిన ఫిర్యాదుల మేరకు కమిషనర్‌, టీపీబీవో క్షేత్ర స్థాయిలో విచారణ చేపట్టారు. అక్రమ నిర్మాణాలను తొలగించాలని నోటీసులను అందించారు. అలాగే కన్యాక పరమేశ్వరి ఆలయంలో సమీపంలో కూడా వంతెన ఇరుగ్గా ఉండటంతో శుభ్రం చేస్తున్నారు. భారీ వర్షం కురిసిందంటే కాగజ్‌నగర్‌లోని లోతట్టుప్రాంతాలైన సంజీవయ్య కాలనీ, కన్యాకపరమేశ్వరి ఆలయం, రైల్వే ట్రాక్‌ కాలనీ, సర్‌సిల్క్‌ కాలనీల్లో వర్షం నీరు వచ్చి చేరుతుంది. ఈ సమస్యను పరిష్కరించేందుకు కూడా కురిసిన వర్షం నీరు నేరుగా కాల్వల గుండా పోయేందుకు పూడిక తొలగిస్తున్నారు. ఆసిఫాబాద్‌ మున్సిపాలిటీలో సైతం ఈ సమస్యను పరిష్కరించేందుకు అధికారులు చర్యలు తీసుకుంటున్నారు.

- మండలాల్లో పరిస్థితిపై సమీక్ష

మండలాల్లో పరిస్థితిపై ఎంపీడీవోలు సిబ్బందితో సమీక్ష నిర్వహిస్తున్నరు. కాగజ్‌నగర్‌ మండలంలో కూడా నీట మునిగే ప్రాంతాలపై కూడా ఎంపీడీవో ప్రసాద్‌ ఆధ్వర్యంలో సమీక్షా సమావేశం నిర్వహించారు. పెద్దవాగు పరివాహ ప్రాంతాలైన అందవెల్లి, జగన్నాథ్‌ఫూర్‌ తదితర ప్రాంతాలు పలు గ్రామాల్లో ఇళ్లలోకి వరద నీటి వచ్చే అవకాశాలున్నాయి. ఈ విషయంలో సిబ్బందికి పలు సూచనలు, సలహాలను అందజేశారు. భారీ వర్షాలు కురిసిన సమీపంలో పెద్దవాగు ఉప్పొంగి ప్రవహిస్తే పరిసర ప్రాంతాల వాసులతో పాటు జాలర్లను లోనికి పోనీయకుండా పక్కాగా చర్యలు తీసుకోవాలని సూచించారు. వీటితో పాటు భారీ వర్షాలు కురిస్తే కుమరం భీం గేట్లు ఎత్తివేస్తే పెద్దవాగు నీటి ప్రవాహం అధికంగా ఉంటుందని గుర్తించారు. ఈ మేరకు ముందస్తుగా గ్రామస్థులకు అవగాహన కార్యక్రమాలు చేపడుతున్నారు. బెజ్జూరు మండలంలో కుశ్నప్లి, సోమిని ప్రాంతాల్లో రెండు వా గులు ఉప్పొంగే అవకాశాలున్నాయి. ఈ ప్రాంతంలో లోలెవల్‌ వంతెన ఉన్నాయి. ఏటా ఈ సమస్య తో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. కౌటాల మండలంలో కూడా ప్రాణహిత పొంగి ప్రవహిస్తే వీర్ధండి, తాటిపెల్లితో పాటు సమీప గ్రామాల్లోని పంట పొలాలు నీట మునిగే అవకాశాలున్నట్టు అధికారులు అంచనాలు రూపొందించారు. ఇక సిర్పూరు(టి)లో పారిగాం, టోంకిని, వెంకట్రాపేట, కర్జవెల్లి, చీలపెల్లి ప్రాంతాల్లోని చిన్నపాటి వాగులు ఉప్పొంగి ప్రవహించి రాకపోకలు నిలిచే అవకాశాలున్నాయి. వీటితో పాటు కాగజ్‌నగర్‌, సిర్పూరు(టి) రైల్వే అండర్‌ బ్రిడ్జిలు వర్షా కాలంలో నీరు నిండి పోయి గ్రామాలకు రాకపోకలు ఇబ్బందులు వచ్చే అవకాశాలుండటంతో రైల్వే అధికారులు ముందస్తుగా మోటార్లను అందుబాటులో పెట్టారు.

చర్యలు వేగవంతం చేస్తున్నాం..

- అంజయ్య, కాగజ్‌నగర్‌ మున్సిపల్‌ కమిషనర్‌

వర్షాకాలంలో లోతట్టు ప్రాంతాల్లోకి నీరు రాకుండా ముందస్తు చర్యలు తీసుకుంటున్నారు. ప్రధాన ము రికి కాల్వలను శుభ్రం చేయిస్తున్నాం. పిచ్చి మొక్కలు, చెత్తాచెదారం తొలగిస్తున్నాం. నీరు నిల్వ ఉండకుండా నేరుగా పోయేందుకు అన్నీ రకాల చర్యలు తీసుకుంటున్నాం. ప్రీజోన్‌లో నిర్మించిన వాటికి కూడా నోటీసులను పంపించటం జరిగింది. అక్రమ నిర్మాణాలు చేపడితే ఊరుకునేది లేదు. తొలగిస్తాం. వర్షాకాలం ఉన్న నేపథ్యంలో అన్నీ చర్యలు తీసుకుంటున్నాం. వార్డుల వారిగా అవగాహన కల్పిస్తున్నాం.

Updated Date - Jun 15 , 2025 | 10:37 PM