ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

ప్రజల హృదయాల్లో నిలిచిపోతారు

ABN, Publish Date - Jun 29 , 2025 | 11:31 PM

నిస్వార్థ ప్రజా నాయకుడిగా సేవలందించిన వారు ప్రజల హృదయాల్లో చిర స్థాయిగా నిలిచిపోతారని అచ్చం పేట ఎమ్మెల్యే డాక్టర్‌ వంశీకృష్ణ అన్నారు.

పాండురంగారెడ్డి చిత్రపటానికి పూలమాల వేసి నివాళి అర్పిస్తున్న ఎమ్మెల్యే వంశీకృష్ణ

- ఎమ్మెల్యే వంశీకృష్ణ

వంగూరు, జూన్‌ 29 (ఆంధ్రజ్యోతి) : నిస్వార్థ ప్రజా నాయకుడిగా సేవలందించిన వారు ప్రజల హృదయాల్లో చిర స్థాయిగా నిలిచిపోతారని అచ్చం పేట ఎమ్మెల్యే డాక్టర్‌ వంశీకృష్ణ అన్నారు. ఆదివారం మండలం లోని మిట్టసదగోడులో నిర్వహిం చిన మాజీసర్పంచ్‌, కాంగ్రెస్‌ పార్టీ సీనియర్‌ నాయకుడు పాం డురంగారెడ్డి సంతాపసభలో ఎమ్మెల్యేతో పాటు రాష్ట్ర రైతు సంక్షేమ కమిషన్‌ సభ్యుడు కేవీఎన్‌ రెడ్డి పాల్గొన్నారు. పాండురంగారెడ్డి చిత్రపటా నికి పూలమాలలు వేసి నివాళి అర్పించారు. అనంతరం కుటుంబ సభ్యులను పరామర్శించా రు. వివిధ పార్టీల నాయకులు, అధికారులు, అభిమానులు అధిక సంఖ్యలో వచ్చి నివాళి అర్పించారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ మిట్టసద గోడు గ్రామాభివృద్ధికి, పార్టీకి చేసిన సేవలు చిరస్మరణీయమన్నారు, ఆ కుటుంబానికి పార్టి అండగా ఉంటుందన్నారు. గ్రామంలో పాండు రంగారెడ్డి కౌంస్య విగ్రహాన్ని ఏర్పాటు చేస్తామ ని పేర్కొన్నారు. కార్యక్రమంలో నాయకులు అల్వాల్‌రెడ్డి, పండిత్‌రావు, ముత్యాల లక్ష్మారెడ్డి, గోపాల్‌రెడ్డి, అనంతరెడ్డి, క్యామ మల్లయ్య, రమేష్‌గౌడ్‌, పులిజాల కృష్ణారెడ్డి, సురెందర్‌రెడ్డి, నారాయణరెడ్డి, తిరుమలయ్య, మల్లేష్‌ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Jun 29 , 2025 | 11:31 PM