కేసుల పరిష్కారంలో పారదర్శకంగా ఉండాలి
ABN, Publish Date - Jun 28 , 2025 | 11:20 PM
శాంతిభద్రత, నేరాల నియంత్ర ణలో, కేసుల పరిశోధనలో పోలీసు అధికారులు పారదర్శకంగా ఉండాలని రామగుండం సీపీ అంబర్‌కిషోర్‌ఝా అన్నారు. నెలవారి సమీక్షలో భాగంగా వారు మంచిర్యాల, రామగుండం, పరిధిలో సమీక్ష సమావేశాన్ని నిర్వహిం చా రు.
రామగుండం సీపీ అంబర్‌కిషోర్‌ఝా
మంచిర్యాలక్రైం, జూన్28 (ఆంధ్రజ్యోతి): శాంతిభద్రత, నేరాల నియంత్ర ణలో, కేసుల పరిశోధనలో పోలీసు అధికారులు పారదర్శకంగా ఉండాలని రామగుండం సీపీ అంబర్‌కిషోర్‌ఝా అన్నారు. నెలవారి సమీక్షలో భాగంగా వారు మంచిర్యాల, రామగుండం, పరిధిలో సమీక్ష సమావేశాన్ని నిర్వహిం చా రు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నేరస్తుల అరెస్టు, దర్యాప్తు సాక్షాధారాల సేకరణ, చార్జిషీట్లకు సంబంధించిన ప్రస్తుత కేసుల స్థితిగతులపై అ ధికారులను అడిగి తెలుసుకున్నారు. నమోదైన కేసులు, మహిళలపై నేరాలు, ఆస్తినేరాలు, ఫోక్సోకేసులు, మిస్సింగ్, గంజాయి, రోడ్డు ప్రమాదాలతో పాటు కేసుల పరిష్కారం కోసం ఏ విధమైన చర్యలు తీసుకోవాలి, ఎలాంటి చర్యలు తీసుకున్నారు. అనే విషయాలపై సమీక్షించారు. బెల్లంపల్లి పట్టణంలోని కాల్ టెక్స్ ఏరియాలో ఏటీఎం దొంగతనానికి యత్నం చేసిన దొంగలను చాకచ క్యంగా పట్టుకున్న నెన్నెల ఎస్‌ఐ ప్రసాద్, బ్లూకోట్ సిబ్బంది హెడ్‌కానిస్టేబుల్ రవి, కానిస్టేబుల్ సాయి, హోంగార్డు సంపత్‌లు క్యాష్ రివార్డు అందించి అభి నందించారు. ఈ కార్యక్రమంలో మంచిర్యాల డీసీపీ భాస్కర్, పెద్దపల్లి డీసీపీ కరుణాకర్, అడిషనల్ డీసీపీ రాజు, ఏసీపీలు, ఎస్‌ఐలు, సీఐలు పాల్గొన్నారు.
Updated Date - Jun 28 , 2025 | 11:25 PM