ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

kumaram bheem asifabad- ఉపాధ్యాయుల పదోన్నతులకు రంగం సిద్ధం

ABN, Publish Date - Aug 01 , 2025 | 11:03 PM

ప్రభుత్వ ఉపాధ్యాయులకు పదోన్నతులు కల్పించాలని నిర్ణయించిన రాష్ట్ర ప్రభుత్వం గురువారం అందుకు షెడ్యూల్‌ జారీ చేసింది. ఖాళీలను ప్రకటించి అర్హులైన ఉపాధ్యా యులకు పదోన్నతులు ఇచ్చే ప్రక్రియ పూర్తి చేసేందుకు చర్యలు తీసుకుంటున్నది.

లోగో

ప్రభుత్వ ఉపాధ్యాయులకు పదోన్నతులు కల్పించాలని నిర్ణయించిన రాష్ట్ర ప్రభుత్వం గురువారం అందుకు షెడ్యూల్‌ జారీ చేసింది. ఖాళీలను ప్రకటించి అర్హులైన ఉపాధ్యా యులకు పదోన్నతులు ఇచ్చే ప్రక్రియ పూర్తి చేసేందుకు చర్యలు తీసుకుంటున్నది.

ఆసిఫాబాద్‌రూరల్‌, ఆగస్టు 1 (ఆంధ్రజ్యోతి): జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలల ఉపాధ్యా యులకు పదోన్నతులకు రంగం సిద్ధమైంది. స్కూల్‌ అసిస్టెంట్లకు గెజిటెడ్‌ ప్రధానోపాధ్యా యులుగా, ఎస్జీటీలు స్కూల్‌ అసిస్టెంట్లుగా పదోన్నతులు పొందనున్నారు. సంబంధిత షెడ్యూల్‌ను రాష్ట్ర విద్యాశాఖ గురువారం ప్రకటించింది. శనివారం నుంచి ఈ ప్రక్రియ ప్రారంభంకానుంది. ఈ నేపథ్యంలో జిల్లా విద్యాశాఖ అధికారులు పదోన్నతులకు సంబంఽ దించిన పోస్టుల వివరాలు, సీనియారిటీ జాబితాను సిద్ధం చేశారు. జిల్లాలో గెజిటెడ్‌ హెచ్‌ఎంలుగా పదోన్నతికి అర్హులైన స్కూల్‌ అసిస్టెంట్ల సీనియారిటీ జాబితాను వరంగల్‌ ఆర్జేడీకి ఇప్పటికే పంపించారు. ఆగస్టు 6న ఆన్‌లైన్‌లో వెబ్‌ ఆప్షన్లు పెట్టుకోవల్సి ఉంది. ఎస్జీటీల సీనియారిటీ జాబితాలు కూడా జిల్లా విద్యాశాఖ సిద్ధం చేసింది. షెడ్యూల్‌ వెలువ డడంతో వారికి స్కూల్‌ అసిస్టెంట్లుగా పదోన్నతులు కల్పించేందుకు అర్హులైన ఎస్జీటీలు తుది జాబితాను ఆగస్టు 8న జిల్లా విద్యాశాఖ ప్రకటించనుంది. 10న వారు పదోన్నతులకు వెబ్‌ ఆప్షన్లను ఎంచుకోవల్సి ఉంది. 11న స్కూల్‌ అసిస్టెంట్లకు, 12న ఎస్జీటీలకు పదోన్నతుల ఉత్తర్వులు జిల్లా కలెక్టర్‌ అనుమతితో అందించనున్నారు.

- పీజీ హెచ్‌ఎంలు..

జిల్లాలో స్థానిక సంస్థల ఉన్నత పాఠశాలల్లో ఐదు, ప్రభుత్వ ఉన్నత పాఠశాలల్లో రెండు రెండు పీజీ హెచ్‌ఎం పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఆసిఫాబాద్‌ మండలంలోని జడ్పీ బాలికల ఉన్నత పాఠశాల, బూరుగూడ జడ్పీ ఉన్నత పాఠశాల, జడ్పీ ఉర్దూ మాధ్యమ పాఠశాల, బెజ్జూరు మండల పాపన్‌పేట, సల్గుపల్లి, దహెగాం, ఈస్‌గాం నంబరు ఐదు ప్రభుత్వ ఉన్నత పాఠశాలల్లో గెజిటెడ్‌ ప్రధానోపాధ్యాయుల పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఎస్‌ఏ గణితం ఆరు, ఫిజికల్‌ సైన్స్‌ ఐదు, బయోసైన్స్‌ నాలుగు, సాంఘికశాస్త్రం 15, తెలు గు 12, హిందీ 11, ఇంగ్లీష్‌ మూడు, ఉర్దూ ఒకటి, పీడీ ఒకటి పోస్టులు ఖాళీగా ఉన్నాయి.

- అన్ని కేడర్లలో కలిసి..

జిల్లాలో అన్ని కేడర్లలో కలిసి మొత్తం 2,295 పోస్టులు మంజూరు ఉండగా ప్రస్తుతం 1,921 మంది పని చేస్తున్నారు. 374 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. వీటిలో ఏడు పీజీ హెచ్‌ఎం, 24 పీఎస్‌ హెచ్‌ఎం పోస్టులు పోను స్కూల్‌ అసిస్టెంటు పోస్టుల ఖాళీల్లో 70 శాతం ఎస్జీటీలకు పదోన్నతులు కల్పించడం ద్వారా భర్తీ చేస్తారు. ఈ లెక్కన మొత్తం 92 స్కూల్‌ అసిస్టెంట్ల ఖాళీల్లో సుమారు 64 పదోన్నతుల ద్వారా భర్తీకి అవకాశం ఉంది. ఏడు పీజీ హెచ్‌ఎం, 24 పీఎస్‌ హెచ్‌ఎం పోస్టులతో కలుపుకుంటే మొత్తం 95 పోస్టుల్లో ఉపాధ్యాయులకు పదోన్నతులు లభించనున్నాయి.

Updated Date - Aug 01 , 2025 | 11:03 PM