షీటీం మహిళలకు అండగా ఉంటుంది
ABN, Publish Date - Jul 10 , 2025 | 12:19 AM
విద్యార్థి నులకు, మహిళలకు షీటీం అండగా ఉంటుందని మహిళ పోలీసు స్టేషన్ సీఐ నరేశ్ అన్నారు. తెలంగాణ సాంఘీక సంక్షేమ గు రుకుల మహిళ డిగ్రీ కళాశాలలో బుదవారం షీటీంపై అవ గాహన సదస్సును భరోసా సెంటర్, సఖీ సెంటర్ సైబర్ నేరాలపై కార్యక్రమం నిర్వ హించారు.
- సీఐ నరేశ్ కుమార్
మంచిర్యాలక్రైం, జూలై9 (ఆంధ్రజ్యోతి): విద్యార్థి నులకు, మహిళలకు షీటీం అండగా ఉంటుందని మహిళ పోలీసు స్టేషన్ సీఐ నరేశ్ అన్నారు. తెలంగాణ సాంఘీక సంక్షేమ గు రుకుల మహిళ డిగ్రీ కళాశాలలో బుదవారం షీటీంపై అవ గాహన సదస్సును భరోసా సెంటర్, సఖీ సెంటర్ సైబర్ నేరాలపై కార్యక్రమం నిర్వ హించారు. ఈసందర్బంగా ఆయన మాట్లాడుతూ పాఠశాలలోకాని ఇతర ప్రాంతాల్లో గాని మ హిళల పట్ల, బాలికల పట్ల ఆకతాయిలు ఇబ్బందులకు గురి చేస్తే తమ దృష్టికి తీసుకరావాలన్నారు. అపరిచిత వ్య క్తుల పట్ల అప్రమత్తంగా ఉండాలని ప్రయాణ సమయం లో టీ షే ప్ యాప్‌ను ఉపయోగించాలన్నారు. సమాజంలో ఎక్కువగా తెలిసినవారితోనే ఎక్కువగా వేధింపులకు గురవు తున్నారని అలాంటి సమయంలో పోలీసులకు సమాచారం అందించాలన్నారు. సైబర్ క్రైం జరిగినప్పుడు 1930 ఫిర్యాదు సమాచారం అందించాలని ఇతర ఇబ్బందులు కలిగినప్పుడు వందకు డయల్ చేయాలని, మహిళల రక్షణ కోసం 6303923700 సమచారం అందిస్తే బాధితు లకు అండగా ఉండి నేరస్తులపై కఠిన చర్యలు తీసుకుంటా మని హెచ్చరించారు. ఈకార్యక్రమంలో ఎస్‌ఐ హైమా, భరోసా సెంటర్, సఖీ సెంటర్ సిబ్బంది పాల్గొన్నారు.
Updated Date - Jul 10 , 2025 | 12:19 AM