సదస్సులను సద్వినియోగం చేసుకోవాలి
ABN, Publish Date - Jun 04 , 2025 | 11:01 PM
రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన భూ భారతి చట్టాన్ని వినియోగించుకొని రైతులు భూ సమ స్యల పరిష్కారం చేసుకోవాలని అచ్చంపేట ఎమ్మెల్యే డాక్టర్ వంశీకృష్ణ అన్నారు.
- ఎమ్మెల్యే డాక్టర్ వంశీకృష్ణ
మన్ననూర్, జూన్ 4 (ఆంధ్రజ్యోతి) : రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన భూ భారతి చట్టాన్ని వినియోగించుకొని రైతులు భూ సమ స్యల పరిష్కారం చేసుకోవాలని అచ్చంపేట ఎమ్మెల్యే డాక్టర్ వంశీకృష్ణ అన్నారు. అమ్రాబాద్ మండలం మన్ననూరు రైతువేదిక వద్ద బుధవా రం నిర్వహించిన భూభారతి రెవెన్యూ సదస్సు లో ఎమ్మెల్యే మాట్లాడారు. అనంతరం స్థానికం గా ఉండే డాక్టర్ కృష్ణగోపాల్ రచించిన సింగిడి సిరులు అనే పుస్తకాన్ని ఎమ్మెల్యే ఆవిష్కరించా రు. కార్యక్రమంలో ఆర్డీవో మాధవి, తహసీల్దార్ శైలేంద్ర కుమార్, పంచాయతీ కార్యదర్శి భాము డు నాయక్, జిల్లా గ్రంథాలయ చైర్మన్ రాజేంద ర్, మాజీ ఎంపీపీ శ్రీనివాసులు, మాజీ ఎంపీటీ సీ సభ్యులు దాసరి శ్రీనివాసులు, మంతటి బాల మ్మ, కాంగ్రెస్ నాయకులు రహీం, సంభు వెంక ట్‌రమణ, బుచ్చయ్య, సురేష్, రమణగడ్, జూ లూరి సత్యనారాయణ, రాజేంద్ర ప్రసాద్, రాజా రాం, రవి కుమార్, గోపాల్ పాల్గొన్నారు.
పలువురు కాంగ్రెస్‌లో చేరిక
ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి చేపడుతున్న పథ కాలకు ఆకర్షితులై అమ్రాబాద్ మండలం మన్న నూరు గ్రామంలో పలువురు బీఆర్‌ఎస్ పార్టీ కార్యకర్తలు బుధ వారం ఎమ్మెల్యే డా క్టర్ వంశీకృష్ణ సమ క్షంలో కాంగ్రెస్ పార్టీ లో చేరారు. ఎమ్మె ల్యే వారికి కాంగ్రెస్ కండువాలు కప్పి ఆ హ్వానించారు. కార్య క్రమంలో కాంగ్రెస్ నాయకులు రహీం, సంభు వెంకట్ రమ ణ, కొండపల్లి వెంకట య్య, కప్పెర శ్రీను, గోపాల్, రాజారాం, యశ్వంత్ పాల్గొన్నారు.
ప్రతీ ఉద్యోగికి పదవీ విరమణ తప్పదు
అచ్చంపేట టౌన్ : ప్రతీ ఉద్యోగికి పదవీ విర మణ తప్పదని ఎమ్మెల్యే డాక్టర్ చిక్కుడు వంశీకృష్ణ అన్నారు. ఉపాధ్యాయుడు రామకృష్ణ ఉద్యోగ పదవీ విరమణ సభకు మాజీఎంపీ రా ములు, బీజేపీ నాగర్‌కర్నూల్ పార్లమెంట్ నియో జకవర్గ ఇన్‌చార్జి భరత్ ప్రసాద్‌తో కలిసి ఎమ్మె ల్యే ముఖ్యఅతిథిగా పాల్గొని మాట్లాడారు. కార్య క్రమంలో జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ రాజేందర్, మునిసిపల్ చైర్మన్ శ్రీనివాసులు, నాయ కులు పాల్గొన్నారు.
అర్హులైన ప్రతీ ఒక్కరికి ఇందిరమ్మ ఇల్లు
ఉప్పునుంతల : పైరవీలకు తావు లేకుండా ప్రతీ ఒక్క లబ్ధిదారినికి ఇల్లు మంజారు చేస్తా మని ఎమ్మెల్యే డాక్టర్ వం శీకృష్ణ అన్నారు. బుధ వారం మండల కేంద్రంలో ఇళ్ల లబ్ధిదారులకు ఇళ్ల పట్టాలు పంపిణీ చేశారు. ఇందిరమ్మ ఇళ్లు నిర్మించుకోవడానికి ఉచితంగా ఇసుక రవాణా చేస్తున్నామన్నారు. కార్యక్రమంలో జిల్లా గ్రంథాల య చైర్మన్ రాజేందర్, పార్టీ మండల అధ్యక్షుడు కట్ట అనంతరెడ్డి, ఎంపీడీవో మోహన్‌లాల్, నా యకులు మల్లేష్, నర్సింహ రావు పాల్గొన్నారు.
Updated Date - Jun 04 , 2025 | 11:01 PM