కొనుగోలు చేసిన ధాన్యాన్ని రైసుమిల్లులకు తరలించాలి
ABN, Publish Date - May 27 , 2025 | 11:15 PM
ప్రస్తుతం నెలకొన్న వర్షాల పరిస్థితుల్లో కొనుగోలు కేంద్రాల్లోని ధాన్యాన్ని వెంటనే కేటాయించిన ప్రకారం రైసుమిల్లు లకు తరలించాలని కలెక్టర్ కుమార్ దీపక్ అన్నారు. మంగళవారం చెన్నూరు మండలంలోని కిష్టంపేట, ఆస్నాద్, గంగారం గ్రామాల్లోని ధాన్యం కొనుగోలు కేంద్రాలను సందర్శించి కొనుగోలు ప్రక్రియను పరిశీలించారు.
చెన్నూరు, మే 27 (ఆంధ్రజ్యోతి) : ప్రస్తుతం నెలకొన్న వర్షాల పరిస్థితుల్లో కొనుగోలు కేంద్రాల్లోని ధాన్యాన్ని వెంటనే కేటాయించిన ప్రకారం రైసుమిల్లు లకు తరలించాలని కలెక్టర్ కుమార్ దీపక్ అన్నారు. మంగళవారం చెన్నూరు మండలంలోని కిష్టంపేట, ఆస్నాద్, గంగారం గ్రామాల్లోని ధాన్యం కొనుగోలు కేంద్రాలను సందర్శించి కొనుగోలు ప్రక్రియను పరిశీలించారు. ఈ సందర్భం గా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాల్లో ని బంధనల ప్రకారం రైతుల వద్ద నుంచి నాణ్యమైన ధాన్యాన్ని కొనుగోలు చేస్తు న్నామన్నారు. వర్షాల పరిస్థితుల కారణంగా కొనుగోలు చేసిన ధాన్యాన్ని వెం టనే రైసుమిల్లులకు తరలించాలన్నారు. కొనుగోలు కేంద్రాల్లో రైతులకు తాగు నీరు, నీడ ఓఆర్‌ఎస్ సదుపాయాలు కల్పిస్తున్నామన్నారు. అవసరమైన గోనె సంచులు, టార్పాలిన్‌లను సమకూర్చామన్నారు. జిల్లాలో నిర్ధేశిత లక్ష్యాన్ని పూర్తి చేసిన కొనుగోలు కేంద్రాలను మూసివేశామని తెలిపారు. కొనుగోలు కేంద్రాల నిర్వహకులు వారికి కేటాయించిన లక్ష్యాలను త్వరగా పూర్తి చేయా లని సూచించారు. కలెక్టర్ వెంట ఉప తహసీల్దార్ సనత్, సంబంధిత అధి కారులు, కేంద్రం నిర్వహకులు ఉన్నారు.
Updated Date - May 27 , 2025 | 11:16 PM