ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

వరించిన పదవి.. The position awarded..

ABN, Publish Date - Jun 08 , 2025 | 11:38 PM

రాష్ట్ర ప్రభు త్వం రెండో విడుత మంత్రివర్గ విస్తరణలో మంచిర్యాల జిల్లా చెన్నూర్‌ నియోజకవర్గ ఎమ్మెల్యే గడ్డం వివేక్‌కు చోటు కల్పించింది. ఈ మేరకు గడ్డం వివేకానంద ఆది వారం రాజ్‌భవన్‌లో మంత్రిగా ప్రమాణ స్వీకారం చేశా రు.

-మంత్రిగా వివేక్‌ వెంకటస్వామి ప్రమాణం

-పదవీ బాధ్యతలు స్వీకరించిన చెన్నూరు ఎమ్మెల్యే

-మాల సామాజిక వర్గంలో వరించిన పదవి

-మూడో విడతలో పీఎస్సార్‌కు చాన్స్‌ ?

మంచిర్యాల, జూన్‌ 8 (ఆంధ్రజ్యోతి): రాష్ట్ర ప్రభు త్వం రెండో విడుత మంత్రివర్గ విస్తరణలో మంచిర్యాల జిల్లా చెన్నూర్‌ నియోజకవర్గ ఎమ్మెల్యే గడ్డం వివేక్‌కు చోటు కల్పించింది. ఈ మేరకు గడ్డం వివేకానంద ఆది వారం రాజ్‌భవన్‌లో మంత్రిగా ప్రమాణ స్వీకారం చేశా రు. గవర్నర్‌ జిష్ణుదేవ్‌ శర్మ వివేక్‌ వెంకటస్వామితో ప్రమాణం చేయించారు. రెండో విడుతలో మొత్తం ము గ్గురు కొత్తగా మంత్రివర్గంలో చేరగా మాల సామాజిక వర్గంలో వివేక్‌ వెంకటస్వామిని పదవి వరించింది. దీం తో ఇంతకాలం జిల్లాకు మంత్రి పదవి లభిస్తుందా...? లేదా..? అన్న మీమాంసకు తెరపడింది. 2023 నవంబ రు 30న రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికలు జరిగాయి. ఆ ఎ న్నికల్లో జిల్లాలోని మూడు నియోజకవర్గాల నుంచి బరి లో దిగిన గడ్డం వివేక్‌ వెంకటస్వామి (చెన్నూరు), కొ క్కిరాల ప్రేంసాగర్‌రావు (మంచిర్యాల), గడ్డం వినోద్‌ (బెల్లంపల్లి)లు భారీ మెజార్టీతో ప్రత్యర్థులపై గెలుపొం దారు. అసెంబ్లీ ఎన్నికలు ముగిసిన నాటి నుంచే జి ల్లాకు మంత్రి పదవి లభిస్తుందనే చర్చ జోరుగా సాగిం ది. అయితే ఏడాదిన్నర అనంతరం ఎట్టకేలకు రేవంత్‌ రెడ్డి ప్రభుత్వం మంత్రివర్గ విస్తరణ చేపట్టడంతో జి ల్లాకు చోటు లభించినట్లయింది.

వివేక్‌ రాజకీయ నేపథ్యం....

తన తండ్రి, కేంద్ర మాజీ మంత్రి గడ్డం వెంకట స్వామి (కాకా) వారసుడుగా గడ్డం వివేక్‌ తొలిసారిగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో కాంగ్రెస్‌ పార్టీ తరుపున 2009 లో పెద్దపల్లి లోక్‌సభ స్థానం నుంచి ఎంపీగా గెలుపొం దారు. 2009 నుంచి 2014 మధ్యకాలంలో పార్లమెంట్‌ సభ్యుడిగా ప్రాతినిథ్యం వహించారు. అనంతరం తెలం గాణ ప్రత్యేక రాష్ట్రం కోసం కాంగ్రెస్‌ను వీడి టీఆర్‌ఎస్‌ లో చేరారు. టీఆర్‌ఎస్‌ తరుపున 2014లో పెద్దపల్లి పా ర్లమెంట్‌ స్థానం నుంచి బరిలో నిలవాలన్న ఆయన ఆకాంక్షకు పార్టీ అధిష్టానం చెక్‌ పెట్టింది. వివేక్‌ను కా దని, బాల్క సుమన్‌కు ఎంపీ టికెట్‌ ఇచ్చింది. దీంతో తిరిగి 2014లో కాంగ్రెస్‌లో చేరిన వివేక్‌, పార్టీ టికెట్‌పై పార్లమెంట్‌ బరిలో నిలిచారు. ఆ ఎన్నికల్లో ఓటమిపా లైన వివేక్‌ అనంతరం వ్యక్తిగత కారణాల వల్ల కాంగ్రె స్‌ను వీడి తిరిగి 2016లో టీఆర్‌ఎస్‌లో చేరారు. అనం తరం 2017లో హైద్రాబాద్‌ క్రికెట్‌ అసోసియేషన్‌ అధ్య క్షుడిగా ఎన్నికయ్యారు. ఆ తరువాత టీఆర్‌ఎస్‌ను వీడి న వివేక్‌ 2019లో బీజేపీలో చేరారు. 2023 అసెంబ్లీ ఎ న్నికల ముందు నవంబరు 21న బీజేపీని వీడి తిరిగి కాంగ్రెస్‌లో చేరారు. అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్‌ టికెట్‌ పై చెన్నూరు నియోజకవర్గం నుంచి బరిలో దిగి విజ యం సాధించారు. ఆ తరువాత పార్లమెంట్‌ ఎన్నికల్లో పెద్దపల్లి పార్లమెంటు స్థానం నుంచి తన కుమారుడు గడ్డం వంశీకృష్ణను బరిలో దింపి ఎంపీగా గెలవడంలో ప్రధాన పాత్ర పోషించారు. వివేకానంద సోదరుడు గడ్డం వినోద్‌ (మాజీ మంత్రి) ప్రస్తుతం బెల్లంపల్లి ఎమ్మెల్యేగా కొనసాగుతున్నారు.

మూడో విడతపై పీఎస్సార్‌ ఆశలు...

వాస్తవానికి జిల్లా నుంచి ఎన్నికైన ముగ్గురు కాం గ్రెస్‌ ఎమ్మెల్యేలు వివేకానంద, ప్రేంసాగర్‌రావు, వినో ద్‌లు మంత్రి పదవిపై మొదటి నుంచీ ఆశలు పెట్టుకు న్నారు. ఏడాదిన్నరగా మంత్రి పదవి కోసం ఎవరి ప్ర యత్నాలు వారు చేస్తూనే ఉన్నారు. రెండో విడుత మంత్రివర్గ విస్తరణ జరుగబోతుందంటూ ప్రచారం జ రిగినప్పుడల్లా జిల్లా నుంచి మంత్రి పదవి ఎవరికి ద క్కుతుందోనన్న చర్చ ప్రజల్లోనూ హాట్‌ టాపిక్‌గా మా రేది. కొంతకాలంగా వివేక్‌, ప్రేంసాగర్‌రావు మధ్యనే పో టీ అన్న ప్రచారం ఊపందుకుంది. వివేక్‌ వైపే ఢిల్లీ పె ద్దలు మొగ్గు చూపుతున్నారనే ప్రచారం జరుగగా, ప్రేం సాగర్‌రావు కూడా గట్టి ప్రయత్నమే చేస్తున్నారనే వాద నలూ వినిపించాయి. చివరికి ఏఐసీసీ పెద్దలు చెన్నూ రు ఎమ్మెల్యే వివేకానందకే పట్టం కట్టగా, మూడో విడుత మంత్రివర్గ విస్తరణలో తనకు తప్పకుండా చో టు లభిస్తుందన్న గట్టి నమ్మకంతో ప్రేంసాగర్‌రావు ఉ న్నారు. రేవంత్‌ ప్రభుత్వంలో మొత్తం ఆరు మంత్రి స్థా నాలు ఖాళీగా ఉండగా, ప్రస్తుతం మూడు భర్తీ చేశా రు. మరో ముగ్గురిని భర్తీ చేయాల్సి ఉండగా, వెల్మ సా మాజిక వర్గంలో తనకు అవకాశం వస్తుందనే భావన లో పీఎస్సార్‌ ఉన్నారు. కాగా బీఆర్‌ఎస్‌ హయాంలో రా ష్ట్రంలో కాంగ్రెస్‌ పార్టీ పూర్తిగా నిర్జీవ స్థితికి చేరుకోగా, ఉమ్మడి జిల్లాలో మాత్రం సజీవంగా ఉండటానికి ప్రేం సాగర్‌రావు కారణమని ప్రజలు బలంగా నమ్ముతారు. 10 సంవత్సరాలుగా ఎలాంటి ముఖ్యమైన పదవులు లే కపోయినా ప్రేంసాగర్‌రావు పార్టీని నడిపిస్తూ వచ్చారు.

Updated Date - Jun 08 , 2025 | 11:39 PM