వ్యాధుల కాలం..జర పైలం
ABN, Publish Date - Jul 04 , 2025 | 12:00 AM
అసలే వర్షాకాలం..పైగా సీజనల్ వ్యాధులు పొంచి ఉన్నాయి. ఈ క్రమంలో ప్రజలు అప్రమత్తంగా ఉం డాలని వైద్యులు సూచిస్తున్నారు. జిల్లాలోని గ్రామా లు, పట్టణాల్లో పారిశుధ్య సమస్య కారణంగా మలే రియా, డెంగీ, చికున్ గున్యా, టైఫాయిడ్ సీజనల్ వ్యాధుల వ్యాప్తికి కారణాలు కానున్నాయి.
పొంచి ఉన్న సీజనల్ రోగాలు
అప్రమత్తమైన ఆరోగ్య శాఖ..
అవసరమైన మందులు అందుబాటులో ఉంచేందుకు కృషి
ప్రజలు వ్యాధుల బారిన పడకుండా పకడ్బందీ చర్యలు
==================
నస్పూర్/దండేపల్లి, జూలై 3 (ఆంధ్రజ్యోతి) : అసలే వర్షాకాలం..పైగా సీజనల్ వ్యాధులు పొంచి ఉన్నాయి. ఈ క్రమంలో ప్రజలు అప్రమత్తంగా ఉం డాలని వైద్యులు సూచిస్తున్నారు. జిల్లాలోని గ్రామా లు, పట్టణాల్లో పారిశుధ్య సమస్య కారణంగా మలే రియా, డెంగీ, చికున్ గున్యా, టైఫాయిడ్ సీజనల్ వ్యాధుల వ్యాప్తికి కారణాలు కానున్నాయి. అప్పుడ ప్పుడు కురుస్తున్న వర్షాల వలన వాతావరణంలో భి న్నమైన మార్పులు చోటు చేసుకుంటున్నాయి. దీం తో ప్రజలు వివిధ రకాల వ్యాధుల బారిన పడే ప్ర మాదం ఉన్నందున వైద్య ఆరోగ్య శాఖ అప్రమత్త మైంది. ముందస్తు చర్యలను చేపట్టి ప్రజలకు అవ గాహన కార్యక్రమాలు నిర్వహిస్తోంది. డెంగీ పరీక్షల కోసం అవసరమైన కిట్స్ కోసం ప్రభుత్వానికి వైద్య ఆరోగ్య శాఖ అధికారులు ప్రతిపాదనలు పంపారు. ఇంకా పూర్తి స్థాయిలో కిట్లు రాలేదు. ప్రస్తుతం అం దుబాటులో ఉన్న కిట్లను అత్యవసరమైతే వినియోగి స్తున్నారు. సీజనల్ వ్యాధుల నియంత్రణకు కలెక్టర్ కుమార్ దీపక్ ఆధ్వర్యంలో టాస్క్‌ఫోర్స్ ఏర్పాటు చే శారు. అధికార యంత్రాంగం పారిశుధ్య సమస్యతో పాటు కలుషిత నీటిపై దృష్టి సారించింది.
ఫ పారిశుధ్య సమస్యే కారణం....
జిల్లాలోని గ్రామీణ ప్రాంతాలు, మున్సిపాలిటీలో సీజనల్ వ్యాధులకు పారిశుధ్య సమస్యే కారణమ వుతోంది. రోజుల తరబడి ఎక్కడి చెత్త అక్కడే ఉండి పోవడం, డ్రైనేజీలు పూడికతో నిండిపోవడం, మురు గు నీటి గుంతలు నిండిపోవడం వలన దోమలు వృ ద్ధి చెందుతున్నాయి. దోమలు నివారణకు ఫాగింగ్, మురుగు నీటి గుంతల్లో బ్లీచింగ్ పౌడర్ చల్లడం వంటి పనులు మందకొడిగా సాగుతున్నాయి. వ్యా ధుల నివారణతో పారిశుధ్య సమస్య పరిష్కారానికి జిల్లా అధికార యంత్రాంగం అప్రమత్తమైంది. ము ఖ్యంగా డ్రైనేజీ వ్యవస్థలు అధ్వానంగా మారడం, పూడిక తొలగించకపోవడం, ఇళ్ల సమీపంలోనే ము రుగు నీటి గుంతలు నిలిచి ఉండడం దోమలు వ్యా ప్తికి కారణాలౌవుతున్నాయి. జిల్లాలో గతేడాది మలే రియా-2, డెంగీ-224 కేసులు నమోదు కాగా ఈ ఏడాది ఇప్పటి వరకు మలేరియా-1, డెంగీ-1 కేసులు నమోదైయ్యాయి.
ఫ నివారణ చర్యలే ముఖ్యం...
జిల్లాలో సీజనల్ వ్యాధులు వ్యాప్తి చెందకుండా పారిశుధ్య సమస్యను నివారిస్తే వ్యాధులను వ్యాప్తిని నియంత్రించవచ్చు. అప్పుడప్పుడు కురుస్తున్న వర్షా లకు చాలా చోట్ల నీరు నిలిచి ఉండడంతో దోమలు వృద్ధి చెంది విజృంభించడం మూలంగా ప్రజలు వ్యా ధుల బారిన పడుతున్నారు. పల్లెలు, పట్టణాల్లో పరిసర ప్రాంతాలు పరిశుభ్రతను పాటిస్తే వ్యాధుల స మస్యను అరికట్టే అవకాశం ఉంటుంది. గ్రామాల్లో, పట్టణాల్లో ఫాగింగ్ సక్రమంగా జరగడం లేదనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
ఫ దోమల నివారణ...
దోమ కాటుకు గురి కాకుండా ఇంటిలో దోమ తెర లు, ఇంటి కిటికిలకు జాలీలు, దోమలను చంపే స్ర్ఫే లు, వివిధ రసాయనాలతో పొగ పెట్టడం లాంటివి చేయాల్సి ఉంటుంది. ఇళ్ల పరిసరాల్లో నీళ్ల కుండీలు, బావులు, నీటి గుంతలు ఉండకుండా జాగ్రత్తలు చే పట్టాలి. నీటి ఆవాసాలు, కుండీల్లో దోమలు ఆవా సాలు ఏర్పాటు చేసుకుని గుడ్లు పెట్టుతాయి. అలాం టి ఆవాసాలు ఇంటి పరిసరాల్లో లేకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. వారంలో ఒక రోజు డ్రై డేను పాటించాలి. ఇంటిపై ట్యాంకులు, పైపులు, ఇనుప డబ్బాలల్లో దోమలు గ్రుడ్లు పెట్టకుండా మూతలు పెట్టాలి.
ఫ అప్రమత్తంగా ఉన్నాం-- జిల్లా కీటక జనిత నియంత్రణ అధికారి డాక్టర్ అనిత
జిలాల్లో వ్యాధులు ప్రబలకుండా ముందస్తుగా చ ర్యలను చేపట్టాం. ప్రతి శుక్రవారం అన్ని శాఖల అధి కారుల, సిబ్బందితో సమన్వయంతో డ్రైడే నిర్వ హి స్తున్నాం. సీజనల్ వ్యాధులు ప్రబల కుండా అన్ని ప్రాంతాలపై దృష్టి సారించాము. సరిపడా మందు లు అందుబాటులో ఉన్నాయి. ప్రభావిత ప్రాంతాల ను గుర్తించి వైద్య శిబిరాలను ఏర్పాటు చేస్తాం. ము ఖ్యంగా హాస్టల్స్‌లో రాఫిడ్ రెస్పాన్స్ బృందాలచే తనిఖీలు చేస్తారు. పరిసర ప్రాంతాల పరి శుభ్రతపై చర్యలు తీసుకోవాలని సూచనలు ఇచ్చాం. ప్రస్త్తుతం సరిపడే డెంగీ కిట్లు ఉన్నాయి. ఇంకా కావాలని ప్రభుత్వానికి ప్రతిపాధనలు పంపాం.
Updated Date - Jul 04 , 2025 | 12:00 AM