ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

రాజీ మార్గమే రాజమార్గం

ABN, Publish Date - Jun 14 , 2025 | 11:23 PM

రాజీ మార్గమే రాజ మార్గమని ల క్షెట్టిపేట జూనియర్‌ సివిల్‌ జడ్జి సాయికిరణ్‌ కసమల అన్నారు. పట్టణ న్యాయస్థానంలో శనివారం న్యాయ సేవాధికార సంస్థ ఆదేశాల మేరకు ఏర్పాటు చేసిన జాతీయ లోక్‌ అదాలత్‌లో ముఖ్య అథితిగా పాల్గొని మా ట్లాడారు.

లక్షెట్టిపేట జూనియర్‌ సివిల్‌ జడ్జి సాయికిరణ్‌

లక్షెట్టిపేట, జూన్‌ 14(ఆంధ్రజ్యోతి): రాజీ మార్గమే రాజ మార్గమని ల క్షెట్టిపేట జూనియర్‌ సివిల్‌ జడ్జి సాయికిరణ్‌ కసమల అన్నారు. పట్టణ న్యాయస్థానంలో శనివారం న్యాయ సేవాధికార సంస్థ ఆదేశాల మేరకు ఏర్పాటు చేసిన జాతీయ లోక్‌ అదాలత్‌లో ముఖ్య అథితిగా పాల్గొని మా ట్లాడారు. ఈసందర్భంగా జడ్జి మాట్లాడుతూ క్షణికావేశంలో ఒకరిపై ఒక రు కేసులు పెట్టుకుని కోర్టుల చుట్టు తిరుగుతూ విలువైన సమయాన్ని వృథా చేసుకోకూడదని న్యాయ సేవాదికార సంస్థ మంచి అవకాశాన్ని క ల్పించిందని ఆ అవకాశమే లోక్‌ అదాలత్‌ అన్నారు. లోక్‌ ఆదాలత్‌లో తీ ర్పు అంతిమ తీర్పు అని లక్షెట్టిపేట న్యాయస్థానం పరిధిలో రాజీ పడిన పలు కేసులను పరిష్కరించారు. ఈకార్యక్రమంలో బార్‌ అసోసియేషన్‌ అధ్యక్షుడు కొమిరెడ్డి సత్తన్న, ఏజీపీ సత్యం, లక్షెట్టిపేట, జన్నారం, దం డేపల్లి, హాజీపూర్‌ ఎస్సైలు సురేష్‌, అనూష తహసీయోద్దీన్‌, స్వరూప్‌ రాజ్‌, సీనియర్‌ న్యాయవాదులు రాజేశ్వర్‌రావు, భూంరెడ్డి, పాల్గొన్నారు.

చెన్నూరు : పెండింగ్‌లో ఉన్న కేసుల పరిష్కారం కోసమే నేషనల్‌ లోక్‌ అదాలత్‌ నిర్వహిస్తున్నట్లు చెన్నూరు మున్సిఫ్‌ కోర్టు జూనియర్‌ సివిల్‌ జడ్జి పర్వతపు రవి అన్నారు. శనివారం కోర్టు ఆవరణలో ఏర్పాటు చేసిన నేషనల్‌ లోక్‌ అదాలత్‌ కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడా రు. లోక్‌ అదాలత్‌లో మొత్తం కేసులు 1458 కాగా 1354 కేసులు పరి ష్కారమయ్యాయని పేర్కొన్నారు. డ్రంకెన్‌డ్రైవ్‌ కేసులు రూ. 6,36,420 జరిమానా విధించగా బ్యాంకు ఇతర కేసుల్లో రూ. 23,96,813 వచ్చాయ న్నారు. అలాగే 44 క్రిమినల్‌ కేసులు, 4 సివిల్‌ కేసుల్లో రాజీ పడడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో న్యాయవాదులు, పోలీసులు, బ్యాం కుల అధికారులు పాల్గొన్నారు.

Updated Date - Jun 14 , 2025 | 11:23 PM