లోటు వర్షపాతమే...!
ABN, Publish Date - Jul 29 , 2025 | 11:40 PM
అల్పాపీడన ప్రభావంతో జిల్లాలో వర్షాలు కురుస్తున్నప్పటికీ ఆశిం చిన మేర వర్షపాతం లేదనే చెప్పాలి. ఇటీవల వరుస గా వర్షాలు కురిసినప్పటికీ చెరువులు, కుంటలు, ప్రాజె క్టుల్లోకి ఆశించిన మేరు నీరు చేరలేదు. రెండు మూడు సంవత్సరాలతో పోల్చితే లోటు వర్షపాతమే జిల్లాలో నమోదు అయింది.
జిల్లాలో సాధారణం కంటే తక్కువ నమోదు
ప్రాజెక్టుల్లో పూర్తి స్థాయిలో చేరని నీరు
కుంటలు, చెరువులదీ అదే పరిస్థితి
ఎల్లంపల్లి ప్రాజెక్టులోనూ అంతంతే..
మంచిర్యాల, జూలై29 (ఆంధ్రజ్యోతి): అల్పాపీడన ప్రభావంతో జిల్లాలో వర్షాలు కురుస్తున్నప్పటికీ ఆశిం చిన మేర వర్షపాతం లేదనే చెప్పాలి. ఇటీవల వరుస గా వర్షాలు కురిసినప్పటికీ చెరువులు, కుంటలు, ప్రాజె క్టుల్లోకి ఆశించిన మేరు నీరు చేరలేదు. రెండు మూడు సంవత్సరాలతో పోల్చితే లోటు వర్షపాతమే జిల్లాలో నమోదు అయింది. ఒకటిరెండు భారీ వర్షాలు కురిసిన ప్పటికీ అధికంగా ముసురు కమ్ముకోవడంతో పెద్దగా నీరు చేరలేదు. వర్షకాలం ప్రారంభమై దాదాపు 45 రో జులు గడుస్తున్న పరిస్థితి ఎప్పటిలాగే ఉంది.
బోసిగా జలాశయాలు...
లోటు వర్షపాతం కారణంగా జిల్లాలోని మధ్యతర హా, పెద్ద ప్రాజెక్టులు బోసిపోతున్నాయి. జిల్లాలో ప్రధా న ప్రాజెక్టు అయిన ఎల్లంపల్లి ప్రాజెక్టులో ఇప్పటి వర కు కేవలం పది టీఎంసీల నీరు మాత్రమే చేరింది. జి ల్లా వ్యాప్తంగా 650 చెరువులు ఉండగా ఎక్కడ కూడ నీరు మత్తడి దూకిన సందర్భాలు లేవు. అలాగే వాగు లు, వంకల్లోను చెప్పుకోదగ్గ నీరేమి చేరలేదు. గత ఏ డాది ఈ సమయానికి జిల్లాలో చెరువులు, ప్రాజెక్టులు నీటితో కళకళలాడాయి. జిల్లాను ఆనుకొని ప్రవహిస్తు న్న గోదావరిలోను కనీస స్థాయి నీరు చేరలేదు. ఎగు వన కడెంప్రాజెక్టు ఒకగేటు తెరచి గోదావరిలోకి నీటిని వదులుతున్న అది ఎల్లంపల్లి ప్రాజెక్టు వరకే పరిమి తం అవుతుంది. ఈ ఏడాది జిల్లా సగటు వర్షపాతం 29శాతం లోటు నెలకొంది. అల్పపీడన ప్రభావంతో వా రం రోజుల్లో చాలా ప్రాంతాల్లో అధిక వానలు పడ్డా యి. జిల్లాలోని పలు మండలాల్లో సాధారణ వర్షపా తం ఉండగా మిగితాచోట్ల లోటువర్షపాతమే నమోదు అయింది.
ప్రాజెక్టుల్లో అరకొర నీరే...
జిల్లాలో ఎల్లంపల్లి, ర్యాలీవాగు, గొల్లవాగు, నీల్వాయి రిజర్వాయర్లు ఉన్నాయి. వీటిలో నేటి వరకు ఆశించని నీరు చేరకపోవడంతో ఆందోళనకర పరిస్థితులు నెలకొన్నాయి.
రిజర్వాయర్ సామర్థ్యం(టీఎంసీలు) ప్రస్తుత నిల్వ(టీఎంసీలు)
ఎల్లంపల్లి 20.175 11.0713
ర్యాలీవాగు 0.4085 0.0713
గొల్లవాగు 0.567 5 0.1394
నీల్వాయి 0.846 0.429
ఎల్లంపల్లికి కొనసాగుతున్న వరద...
ఎగువన కురుస్తున్న వర్షాల కారణంగా గుడిపేట సమీపంలోని ఎల్లంపల్లి ప్రాజెక్టులోకి వరద కొనసాగు తోంది. ప్రాజెక్టు గరిష్ట ఎత్తు 148మీటర్లు కాగా ప్రస్తు తం 144.20 మీటర్ల ఎత్తు వరకు నీరు ఉంది. పా జ్రె క్టు సామర్థ్యం 20.175 టీఎంసీలకుగాను 11.0713 టీ ఎంసీల నీరు అందుబాటులో ఉంది. ప్రాజెక్టులోకి ఎగు వ నుంచి 2254క్యూసెక్కుల (5వ పేజీ తరువాయి)
నీరు వచ్చి చేరుతోంది. అలాగే ప్రాజెక్టు అవుట్‌ఫ్లో 440 క్యూసెక్కు లు ఉంది. హైదరాబాద్ మెట్రో పా లిటన్ వర్కు స్కీం కోసం 319 క్యూసెక్కుల నీటిని విడుదల చే స్తుండగా ఎన్‌టీపీసీ అవసరాల కో సం మరో 121 క్యూసెక్కులను వి డుదల చేస్తున్నారు.
జిల్లాలో 3.8 మిల్లీమీటర్ల
వర్షపాతం నమోదు..
గడిచిన 24గంటల వ్యవధిలో జి ల్లాలో 3.8 మిల్లీ మీటర్ల సగటు వ ర్షపాతం నమోదు అయింది. భీ మిని మండలంలో గరిష్టంగా 9.6 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదు కాగా వేమనపల్లి మండలంలో 7.4, నెన్నెల మండలంలో 7.2, భీమారం మండలంలో 6.4, కాసిపేట మం డలంలో 5.6, కన్నెపల్లి మండలం లో 5.4, బెల్లంపల్లి మండలంలో 4.8, మందమర్రి మిల్లీమీటర్ల, చె న్నూర్ మండలాల్లో 4.2 మిల్లీమీ టర్ల చొప్పున వర్షపాతం నమోదు అయింది.
Updated Date - Jul 29 , 2025 | 11:40 PM