దేశవ్యాప్త సమ్మెను విజయవంతం చేయాలి
ABN, Publish Date - Jun 25 , 2025 | 12:10 AM
కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న కార్మిక వ్యతిరేక విధానాలను నిరసిస్తూ, లేబర్ కోడ్‌ల రద్దు చేయా లని డిమాండ్ చేస్తూ జూలై 9న దేశవ్యాప్తంగా జరిగే సార్వత్రిక సమ్మెను విజ యవంతం చేయాలని సీఐటీయూ జిల్లా అధ్యక్షుడు చినపాక లక్ష్మీనారాయణ పిలుపునిచ్చారు.
నల్లగొండ టౌన్, నల్లగొండ రూరల్, జూన్ 24(ఆంధ్రజ్యోతి): కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న కార్మిక వ్యతిరేక విధానాలను నిరసిస్తూ, లేబర్ కోడ్‌ల రద్దు చేయా లని డిమాండ్ చేస్తూ జూలై 9న దేశవ్యాప్తంగా జరిగే సార్వత్రిక సమ్మెను విజ యవంతం చేయాలని సీఐటీయూ జిల్లా అధ్యక్షుడు చినపాక లక్ష్మీనారాయణ పిలుపునిచ్చారు. జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి పుట్ల శ్రీనివాస్, జిల్లా పంచా యతీ అధికారి వెంకయ్యలకు మంగళవారం నోటీసులు అందజేశారు. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ కార్పొరేట్ల ప్రయోజనం కోసం పాకులాడుతోందన్నారు. వందేళ్ళ క్రితం పోరాడి సాధించుకున్న 29 కార్మిక చట్టాలను రద్దుచేసి వాటికి బదులుగా కార్మికులను మోసగిస్తూ నాలుగు లేబర్ కోడ్లు తెచ్చేందుకు ప్రయత్ని స్తోందన్నారు. కార్మిక ఐక్య పోరాటలు ఉధృతం చేస్తూ జాతీయ స్థాయిలో కార్మిక సంఘాలు ఇచ్చిన దేశ వ్యాపిత సమ్మెలో కార్మికులందరూ పాల్గొనాలని పిలుపు నిచ్చారు. ఈ కార్యక్రమంలో సీఐటీయూ జిల్లా నాయకులు పోలె సత్యనారాయణ ఆశ వర్కర్ల యూనియన్ నాయకులు ఎడవెల్లి ప్రేమలత, బి. రేణుక, సి. శోభ, ఆకారం శోభ తదితరులు పాల్గొన్నారు.
నల్లగొండ రూరల్: కేంద్ర ప్రభుత్వం అవలంబిస్తున్న కార్మిక ప్రజా రైతు వ్యతిరేక విధానాలను నిరసిస్తూ జూలై 9న నిర్వహించే దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెను విజయవంతం చేయాలని తెలంగాణ పవర్‌లూం వర్కర్స్ యూనియన్ (సీఐటీయూ) జిల్లా ప్రధాన కార్యదర్శి దండెంపల్లి సత్తయ్య పిలుపునిచ్చారు. మంగళవారం పవర్లూమ్ వీవర్స్ అసోసియేషన్ జిల్లా ప్రధాన కార్యదర్శి రాపోలు చంద్రశేఖర్‌కు సమ్మె నోటీసులు అందజేశారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ పవర్‌లూం వర్కర్స యూనియన్ పద్మనగర్ అధ్యక్షుడు గంజి నాగరాజు, పెండెం బుచ్చి రాములు, భద్రయ్య, తదితరులు పాల్గొన్నారు.
Updated Date - Jun 25 , 2025 | 12:10 AM