ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

ధాన్యం కొనుగోలు ప్రక్రియ సమర్ధవంతంగా నిర్వహించాలి

ABN, Publish Date - May 22 , 2025 | 12:02 AM

కొనుగోలు కేంద్రాల్లో వరిధాన్యం కొనుగోలు ప్రక్రియ సమర్ధవంతంగా నిర్వహించాలని కలెక్టర్‌ కుమార్‌ దీపక్‌ అన్నారు. బుధవారం చెన్నూరు మండలంలోని కిష్టంపేట గ్రా మంలోని ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని సందర్శించారు.

చెన్నూరులో ప్రభుత్వ ఆసుపత్రి నిర్మాణ పనులను పరిశీలిస్తున్న కలెక్టర్‌ కుమార్‌ దీపక్‌

చెన్నూరు, మే 21 (ఆంధ్రజ్యోతి) : కొనుగోలు కేంద్రాల్లో వరిధాన్యం కొనుగోలు ప్రక్రియ సమర్ధవంతంగా నిర్వహించాలని కలెక్టర్‌ కుమార్‌ దీపక్‌ అన్నారు. బుధవారం చెన్నూరు మండలంలోని కిష్టంపేట గ్రా మంలోని ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని సందర్శించారు. కలెక్టర్‌ మా ట్లాడుతూ రైతుల సంక్షేమం కోసం ప్రభుత్వం 345 ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసి నిబంధనల ప్రకారం రైతుల వద్ద నుంచి ధాన్యం కొనుగోలు చేస్తుందన్నారు. సన్నరకం వడ్లకు మద్దతు ధరతో రూ. 500 బోనస్‌ ఇస్తుందన్నారు. కొనుగోలు కేంద్రాల్లో రైతుల కోసం నీడ, ఓఆర్‌ఎస్‌ అందుబాటులో ఉంచామని, గోనె సంచులు, టార్పాలి న్‌ కవర్లు సమకూర్చామన్నారు. కొనుగోలు కేంద్రాల నిర్వహకులు వా రికి కేటాయించిన లక్ష్యాలను త్వరగా పూర్తి చేయాలని సూచించారు. అనంతరం మండల కేంద్రంలో చేపట్టిన వంద పడకల ప్రభుత్వ ఆ సుపత్రి నిర్మాణ పనులను మండల తహసీల్దార్‌ మల్లికార్జున్‌తో కలిసి పరిశీలించారు. ఆసుపత్రి నిర్మాణ పనులను త్వరగా పూర్తి చేసే విధం గా అధికారులు నిరంతరం పర్యవేక్షించాలని, పనులను నాణ్యతతో చే పట్టేలా అధికారులు చర్యలు తీసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో సంబంధిత అధికారులు పాల్గొన్నారు.

Updated Date - May 22 , 2025 | 12:02 AM