పేదింటి ఆడపడుచులకు ప్రజాప్రభుత్వం చేయూత
ABN, Publish Date - Jun 21 , 2025 | 11:30 PM
పేద కుటుంబా ల్లో ఆడపడుచుల వివాహం త ల్లిదండ్రులకు భారం కాకూడదని ప్రజా ప్రభుత్వం చేయూతని స్తోందని రాష్ట్ర ఎక్సైజ్, పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు.
- కల్యాణలక్ష్మి చెక్కుల పంపిణీలో ఎక్సైజ్ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు
పెద్దకొత్తపల్లి, జూన్ 21 (ఆంధ్రజ్యోతి) : పేద కుటుంబా ల్లో ఆడపడుచుల వివాహం త ల్లిదండ్రులకు భారం కాకూడదని ప్రజా ప్రభుత్వం చేయూతని స్తోందని రాష్ట్ర ఎక్సైజ్, పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. శనివారం పెద్దకొత్తపల్లి మండలంలోని వివిధ గ్రామాలకు చెందిన 80మంది లబ్ధిదారులకు కల్యాణలక్ష్మి, పది మంది లబ్ధిదారులకు షాదీముబారక్ చె క్కులను స్థానిక తహసీల్దార్ కార్యాలయంలో మంత్రి పంపిణీ చేశారు. ముందుగా తహసీ ల్దార్ కార్యాలయంలో ఉన్న మహాత్మాగాంధీ వి గ్రహానికి, తెలంగాణ సిద్ధాంతకర్త జయశంకర్ వర్ధంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి పూ ల మాలలు వేసి నివాళులర్పించారు. ఈ కార్య క్రమంలో తహసీల్దార్ ఎం.శ్రీనివాసులు, మార్కె ట్ కమిటీ చైర్మన్ దండు నరసింహ, మైసమ్మ ఆలయ అభివృద్ధి కమిటీ చైర్మన్ శ్రీనివాస్ యాదవ్, గ్రంథాలయ సంస్థ మాజీ చైర్మన్ నా గపూరి విష్ణు, మాజీ ఎంపీపీలు సూర్యప్రతాప్ గౌడ్, వెంకటేశ్వర్‌రావు, మురళీధర్, సింగిల్ విం డో మాజీ చైర్మన్లు గోపాల్‌రావు, లక్ష్మణరావు, సింగిల్ విండో డైరెక్టర్ దండు చంద్రయ్య, కాంగ్రెస్ మండల అధ్యక్షుడు తగిలి కృష్ణయ్య, నాయకులు పాల్గొన్నారు.
Updated Date - Jun 21 , 2025 | 11:30 PM