రైతుల సమస్యల పరిష్కారమే ప్రభుత్వ లక్ష్యం
ABN, Publish Date - Jun 25 , 2025 | 12:08 AM
సీఎం రేవంత్‌రెడ్డి నేతృత్వంలోని ప్రజా ప్రభుత్వం రైతు పక్షపాతిగా పనిచేస్తుందని నకిరేకల్ వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్‌పర్సన్ గుత్తా మంజులమాధవరెడ్డి అన్నారు.
కేతేపల్లి, జూన్ 24(ఆంధ్రజ్యోతి): సీఎం రేవంత్‌రెడ్డి నేతృత్వంలోని ప్రజా ప్రభుత్వం రైతు పక్షపాతిగా పనిచేస్తుందని నకిరేకల్ వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్‌పర్సన్ గుత్తా మంజులమాధవరెడ్డి అన్నారు. రైతుభరోసా సంబరాల్లో భాగంగా మండలకేంద్రంలోని రైతు వేదికలో సీఎం రేవంత్‌రెడ్డి ప్రసంగాన్ని వీక్షించారు. యాసంగిలో రైతులు పండించిన ధాన్యం సకాలంలో కొనుగోలు చేసి, సన్న ధాన్యం పండించిన రైతులకు క్వింటాకు రూ.500బోనస్ చెల్లించిన ఘనత సీఎం రేవంత్‌రెడ్డికే దక్కిందన్నారు. రైతులకు అవసరమైన వ్యవసాయ పరికరాలు సబ్సిడీపై అందిస్తుందన్నారు. ఈ కార్యక్రమాల్లో తహసీల్దార్ ఎంఏ. సత్తార్, వ్యవసాయాధికారి బి. పురుషోత్తం, మార్కెట్ డైరెక్టర్లు ఎస్‌కె. లతీఫ్, బయ్య ముత్తయ్య, ఏఈవోలు బాలరాజు, నాగరాజు, ఉమేష్, ఎ. మహేందర్‌రెడ్డి, కె. మహేందర్‌రెడ్డి, ఎ. జోగిరెడ్డి, జి. మాధవరెడ్డి, ఎ. రవీంద్రాచారి, జె. లింగయ్య పాల్గొన్నారు.
మర్రిగూడ: మండలంలోని మర్రిగూడ, ఎర్రగండ్లపల్లి, భీమనపల్లి రైతు వేదికల్లో రైతుభరోసా సంబరాలు నిర్వహించారు. సీఎం రైతులతో ముఖాముఖి కార్యక్ర మాన్ని అధికారులు, రైతులతో కలిసి వీక్షించారు. కార్యక్రమంలో తహసీల్దార్ జె. శ్రీనివాస్, ఎంపీడీవో మున్నయ్య, వ్యవసాయ అధికారి సహ్రాస్, మార్కెట్ వైస్ చైర్మన్ ఎన్. శ్రీనివాస్, మర్రిగూడ పీఏసీఎస్ చైర్మన్ పి. యాదయ్య, శివన్నగూడ ఎఫ్‌ఎస్‌సీఎస్ చైర్మన్ బి.నర్సింహ, ఎంఈవోలు విజయ్‌కుమార్, సుజాత, రాధిక, శ్రీలత, అరుణ, నాగస్వాతి, ఆర్‌ఐ జహోరుద్దీన్, సీఈవో శ్రీను ఉన్నారు.
Updated Date - Jun 25 , 2025 | 12:08 AM