ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

సన్నరకం వడ్లను ప్రభుత్వం కొనుగోలు చేయాలి

ABN, Publish Date - May 15 , 2025 | 10:25 PM

రైతులు పండించిన సన్నరకం వడ్లను ప్రభుత్వం వెంటనే కొనుగోలు చేయాలని బీజేపీ జిల్లా అధ్యక్షుడు నగునూరి వెంకటేశ్వర్‌గౌడ్‌ డిమాండ్‌ చేశారు. గురువారం చెన్నూరు మం డలంలోని కిష్టంపేట గ్రామంలోని ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని సందర్శిం చి రైతులను వివరాలు అడిగి తెలుసుకున్నారు.

బీజేపీ జిల్లా అధ్యక్షుడు వెంకటేశ్వర్‌గౌడ్‌

చెన్నూరు, మే 15 (ఆంధ్రజ్యోతి) : రైతులు పండించిన సన్నరకం వడ్లను ప్రభుత్వం వెంటనే కొనుగోలు చేయాలని బీజేపీ జిల్లా అధ్యక్షుడు నగునూరి వెంకటేశ్వర్‌గౌడ్‌ డిమాండ్‌ చేశారు. గురువారం చెన్నూరు మం డలంలోని కిష్టంపేట గ్రామంలోని ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని సందర్శిం చి రైతులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం, వ్యవసాయాధికారుల ద్వారా రబీ సీజన్‌లో రైతులు సన్నరకాలను సాగు చేయాలని ప్ర్సోతహించి సబ్సిడీపై విత్తనాలు సరఫరా చేసిందని, తీరా పంట చేతికి వచ్చి నెల రోజులు గడుస్తున్నా ప్ర భుత్వం కొనుగోలు చేయడం లేదన్నారు. ఇటీవల కిష్టంపేటలో రైతులు ఆందోళన చేసిన తర్వాత ఒక్క లోడు వడ్లు క్వింటాళుకు 20 కిలోలు అధి కంగా తూకం వేసుకుని ఒక మిల్లర్‌ తీసుకున్నారన్నారు. సన్నరకాల వడ్ల నుంచి నూక వస్తుందని రైతులను వేధించడం సరైంది కాదన్నారు. సన్నర కాల వడ్లకు బోనస్‌ వస్తుందని ఆశించిన రైతులకు అసలుకే మోసం వ చ్చిందన్నారు. రైతులు కష్టపడుతున్నా స్థానిక ఎమ్మెల్యే వివేక్‌ ఈ విష యంపై స్పందించకపోవడం శోచనీయమన్నారు. ఈ కార్యక్రమంలో జి ల్లా ప్రధాన కార్యదర్శి దుర్గం అశోక్‌, మండల అధ్యక్షుడు బుర్ర రాజశేఖర్‌ గౌడ్‌, మండల సీనియర్‌ నాయకులు ఆలం బాపు, కొటారి వెంకటేష్‌, శివ కృష్ణ, వంశీగౌడ్‌, కార్యకర్తలు పాల్గొన్నారు.

Updated Date - May 15 , 2025 | 10:25 PM