ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

స్థానిక సంస్థల బలోపేతమే లక్ష్యం

ABN, Publish Date - Jul 30 , 2025 | 11:37 PM

రానున్న స్థానిక సంస్థల బలోపేతం కోసమే రాజీవ్‌ గాంధీ పంచాయతీ రాజ్‌ సంఘటన్‌ కార్యక్రమానికి కాంగ్రెస్‌ పార్టీ శ్రీకారం చు ట్టిందని డీసీసీ అధ్యక్షుడు, అచ్చంపేట ఎమ్మెల్యే డాక ్టర్‌ చిక్కుడు వంశీకృష్ణ అ న్నారు

మాట్లాడుతున్న డీసీసీ అధ్యక్షుడు, అచ్చంపేట ఎమ్మెల్యే వంశీకృష్ణ

- డీసీసీ అధ్యక్షుడు, అచ్చంపేట ఎమ్మెల్యే డాక్టర్‌ చిక్కుడు వంశీకృష్ణ

- జిల్లా కేంద్రంలో రాజీవ్‌గాంధీ పంచాయతీరాజ్‌ సంఘటన్‌ సమావేశం

నాగర్‌కర్నూల్‌ టౌన్‌, జూలై 30 (ఆంధ్రజ్యోతి): రానున్న స్థానిక సంస్థల బలోపేతం కోసమే రాజీవ్‌ గాంధీ పంచాయతీ రాజ్‌ సంఘటన్‌ కార్యక్రమానికి కాంగ్రెస్‌ పార్టీ శ్రీకారం చు ట్టిందని డీసీసీ అధ్యక్షుడు, అచ్చంపేట ఎమ్మెల్యే డాక ్టర్‌ చిక్కుడు వంశీకృష్ణ అ న్నారు. బుధవారం జిల్లా కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో రాజీవ్‌గాంఽధీ పంచాయతీరాజ్‌ సంఘటన్‌ జిల్లా అఽధ్యక్షుడు చత్రూనాయక్‌ అధ్యక్షతన పార్టీ ముఖ్య నాయకులతో విస్తృత స్థాయి సమా వేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మె ల్యే వంశీకృష్ణ మాట్లాడుతూ రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో మహిళలకు 33 శాతం రిజర్వేషన్లు కల్పించి స్థానిక సంస్థల బలోపేతా నికి కాంగ్రెస్‌ కృషి చేస్తోందన్నారు. పంచాయ తీరాజ్‌ వ్యవస్థను బలోపేతం చేసినప్పుడే గ్రా మాల్లో అభివృద్ధి జరుగుతుందన్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో పార్టీ గెలుపుకోసం ప్రతీ ఒక్క రు కృషి చేయాలని ఆయన కోరారు. కార్యక్ర మంలో ఎమ్మెల్సీ కూచకుళ్ల దామోదర్‌రెడ్డి, తాజా మాజీ ప్రజా ప్రతినిధులు, కాంగ్రెస్‌ పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు.

అర్వులందరికీ రేషన్‌ కార్డులు

వంగూరు : పదేళ్ల బీఆర్‌ఎస్‌ పాలనలో పేద లకు రేషన్‌ కార్డులు కూడా ఇవ్వలేకపోయింద ని, కాంగ్రెస్‌ ప్రభుత్వం ఇప్పుడు పేదలందరికీ అందజేస్తుందని అచ్చంపేట ఎమ్మెల్యే వంశీకృష్ణ అన్నారు. బుధవారం మండలంలోని వంగూరు ల గేటు వద్ద ఓ ఫంక్షన్‌ హాల్‌ నిర్వహించిన రేషన్‌ కార్డుల పంపిణీ కార్యక్రమానికి ఎమ్మెల్యే హాజరై లబ్ధిదారులకు రేషన్‌ కార్డులు పంపిణీ చేశారు. కార్యక్రమంలో మాజీ మార్కెట్‌ కమిటీ వైస్‌ చైర్మన్‌ అల్వాల్‌రెడ్డి, తహసీల్దార్‌ ముర ళీమోహన్‌, పీఏసీఎస్‌ చైర్మన్‌ సురేందర్‌రెడ్డి, జెల్ల గురువయ్యగౌడ్‌, క్యామ మల్లయ్య, రమేష్‌ గౌడ్‌, యాదగిరిరావు, రాజశేఖర్‌రెడ్డి, వేమారెడ్డి, జనార్దన్‌, వెంకటయ్య యాదవ్‌, వెంకట్‌గౌడ్‌, తిరుమలయ్య, తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Jul 30 , 2025 | 11:37 PM