ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

భూ సమస్యల పరిష్కారమే ధ్యేయం

ABN, Publish Date - May 11 , 2025 | 11:12 PM

భూ భారతి చట్టం ద్వారా భూ సమస్యల పరిష్కారమే ధ్యేయంగా అధికారులు కృషి చేయాలని కలె క్టర్‌ కుమార్‌ దీపక్‌ అన్నారు. ఆదివారం భీమారం మండలంలోని భీ మారం, దాంపూర్‌ గ్రామాల్లో నిర్వహిస్తున్న గ్రామసభలను ఆయన సందర్శించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ భూ భారతిలో భాగంగా భీమారం మండలాన్ని పైలెట్‌ ప్రాజెక్టు కింద ఎంపిక చేసి గ్రామసభలను నిర్వహించి రైతుల నుంచి దరఖాస్తులు స్వీకరిస్తామన్నారు.

కలెక్టర్‌ కుమార్‌ దీపక్‌

భీమారం, మే 11 (ఆంధ్రజ్యోతి) : భూ భారతి చట్టం ద్వారా భూ సమస్యల పరిష్కారమే ధ్యేయంగా అధికారులు కృషి చేయాలని కలె క్టర్‌ కుమార్‌ దీపక్‌ అన్నారు. ఆదివారం భీమారం మండలంలోని భీ మారం, దాంపూర్‌ గ్రామాల్లో నిర్వహిస్తున్న గ్రామసభలను ఆయన సందర్శించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ భూ భారతిలో భాగంగా భీమారం మండలాన్ని పైలెట్‌ ప్రాజెక్టు కింద ఎంపిక చేసి గ్రామసభలను నిర్వహించి రైతుల నుంచి దరఖాస్తులు స్వీకరిస్తామన్నారు. కాంగ్రెస్‌ ప్రభుత్వం భూ భారతి చట్టాన్ని తీసుకువచ్చి రైతుల సమస్యల పరిష్కారం కోసం కృషి చేస్తుందన్నారు. ముందుగా పట్టా భూముల సమస్యలను పరిష్కరిస్తామని, అనంతరం లావాణి పట్టా, అసైన్డ్‌ భూములు,సాదాబైనామాల సమస్యలను పరిష్కరిస్తామన్నారు. కాగా కొంత మంది రైతులు తాము తమ తాతల తండ్రుల కాలం నుంచి సాగు చేస్తున్నామని, తమ భూములకు పట్టాలు లేవని, కొందరు మోకా ఉంది కానీ రికార్డుల్లో పేర్లు లేవని సమస్యలను పరి ష్కరించేందుకు కృషి చేయాలని రైతులు కలెక్టర్‌కు విన్నవించారు. క్షేత్రస్ధాయిలో పరిశీలించి సమస్యలను పరిష్కరించాలని కలెక్టర్‌ అధికారులకు సూచించారు. ఈ కార్యక్రమంలో మండల తహసీల్దార్‌ సదానందం, జిల్లా అడ్మినిస్ర్టేటివ్‌ ఆఫీసర్‌ కృష్ణ, సిబ్బంది పాల్గొన్నారు.

Updated Date - May 11 , 2025 | 11:12 PM