ఉచిత విద్య, వైద్యం అదించడమే లక్ష్యం
ABN, Publish Date - Jul 08 , 2025 | 11:40 PM
ప్రజలకు ఉచిత వైద్యం, విద్య అం దించడమే లక్ష్యంగా కాంగ్రెస్ ప్రభుత్వం ముందుకు సాగుతోందని మంచిర్యాల ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేంసాగర్‌రావు అన్నారు. లక్షెట్టిపేటలో నూతనంగా నిర్మిస్తున్న ప్రభుత్వ ఆసుపత్రి భవనం పనులను ఆయన మంగళవారం స్థానిక నాయకులతో కలిసి పరిశీలించారు.
ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేంసాగర్‌రావు
లక్షెట్టిపేట, జూలై 8 (ఆంధ్రజ్యోతి): ప్రజలకు ఉచిత వైద్యం, విద్య అం దించడమే లక్ష్యంగా కాంగ్రెస్ ప్రభుత్వం ముందుకు సాగుతోందని మంచిర్యాల ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేంసాగర్‌రావు అన్నారు. లక్షెట్టిపేటలో నూతనంగా నిర్మిస్తున్న ప్రభుత్వ ఆసుపత్రి భవనం పనులను ఆయన మంగళవారం స్థానిక నాయకులతో కలిసి పరిశీలించారు. ఈనెల 13న భవనం ప్రారంభానికి ఏర్పాట్లు చేస్తున్నట్లు ఆయన తెలిపారు. అనంతరం ఎమ్మె ల్యే మాట్లాడుతూ ఆసుపత్రి భవనం ప్రారంభోత్సవానికి ఆరోగ్యశాఖ మం త్రి రాజనరసింహ, ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క రానున్నట్లు పే ర్కొన్నారు. అనంతరం పలు వసతిగృహాలు పరిశీలించి విద్యార్థులతో కలి సి మంత్రులు మధ్యాహ్న భోజనం చేస్తారన్నారు. ఈకార్యక్రమంలో ఎమ్మె ల్యే వెంట గిరిజన అభివృద్ధి సంక్షేమ శాఖ చైర్మన్ కోట్నాక తిరుపతి, ఆసుపత్రి సూపరిండెంట్ డాక్టర్ కోటేశ్వర్, డాక్టర్ ఆకుల శ్రీనివాస్, వైద్యు లు సురేష్, కృష్ణ, స్రవంతి, పవిత్ర, తహసీల్దార్ దిలీప్‌కుమార్, పార్టీ ప ట్టణ అధ్యక్షుడు ఆరీఫ్, మండల అధ్యక్షుడు పింగిళి రమేష్, ట్రాన్స్‌పోర్టు మెంబర్ అంకతి శ్రీనివాస్, జిల్లా ఉపాద్యక్షుడు చింత అశోక్ పాల్గొన్నారు.
Updated Date - Jul 08 , 2025 | 11:40 PM